పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ పైదారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హైదరాబాదు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు అవాంతరాలు లేని ఉచిత ప్రయాణం కోసం నిర్మించిన పైదారి పా.వే.నరసింహా రావు వడిబాట. మెహదీపట్నం నుండి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 11.6 కిలోమీటర్ల పొడవున నిర్మించిన పైదారి ఇది. 2009 అక్టోబరు 19 న ఈ పైదారి ప్రారంభించారు.

ఈ పైదారి మెహదీపట్నంలో సరోజినీ దేవి కంటి ఆస్పత్రి వద్ద ప్రారంభమై, రేతిబౌలి, లక్ష్మీ నగర్, అత్తాపూర్, హైదర్‌గూడా, ఉప్పరపల్లి, రాజేంద్రనగర్ గుండా వెళ్ళి ఆరామ్‌ఘర్ జంక్షన్ సమీపంలో జాతీయ రహదారి-7 ను కలుస్తుంది. ఈ పైదారిపై గరిష్ఠ వేగ పరిమితిని 60 కి.మీ./గంటగా ప్రతిపాదించారు. ఎడ్లబండ్లు, తోపుడు బండ్లను ఈ పైదారిపై నిషేధించారు. తేలికపాటి, మధ్య మరియు భారీ వాహనాలతో సహా అన్ని వస్తురవాణా వాహనాలకు కూడా అనుమతి లేదు.