కొణిజేటి రోశయ్య

వికీపీడియా నుండి
(రోశయ్య నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కొణిజేటి రోశయ్య
కొణిజేటి రోశయ్య


పదవీ కాలం
2011 ఆగస్టు 31 – 2016 ఆగస్టు 30
ముందు సూర్జీత్ సింగ్ బర్నాలా
తరువాత సి.హెచ్.విద్యాసాగర్ రావు (ప్రత్యేక బాధ్యత)

పదవీ కాలం
2014 జూన్ 28 – 2014 ఆగస్టు 31
ముందు హెచ్.ఆర్. భరద్వాజ్
తరువాత వాజుభాయ్ వాలా

పదవీ కాలం
2009 సెప్టంబరు 3 – 2011 జూన్ 25
ముందు వై.యస్. రాజశేఖరరెడ్డి
తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
నియోజకవర్గం గుంటూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం[1](ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు)

పదవీ కాలం
1998 మార్చి 10 – 1999 ఏప్రిల్ 26
ముందు కోట సైదయ్య
తరువాత నేదురుమల్లి జనార్ధనరెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం (1933-07-04) 1933 జూలై 4 (వయసు 91)
వేమూరు, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం)
మరణం 2021 డిసెంబరు 4
హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి శివలక్ష్మి
సంతానం కె. ఎస్. సుబ్బారావు
పి. రమాదేవి
కె. ఎస్. ఎన్. మూర్తి
నివాసం అమీర్‌పేట, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
మతం ఆర్యవైశ్య, హిందూ

కొణిజేటి రోశయ్య ( 1933 జూలై 4 - 2021 డిసెంబరు 4) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించాడు . రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరుగా పనిచేశాడు.

నేపధ్యము

[మార్చు]

కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసించారు. ఆయన భారత జాతీయ కాంగ్రెసు పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైననూ, 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కొణిజేటి రోశయ్య 1933 జూలై 4న ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. వాణిజ్యశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశాడు. 1968లో తొలిసారిగా శాసనమండలికి ఎన్నికయ్యాడు.[2] కొణిజేటి రోశయ్య అనారోగ్యంతో 2021లో డిసెంబరు 4న ఉదయం హైదరాబాదులో కన్నుమూశారు.[3][4]

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యులు. నిడుబ్రోలు లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.[5]

ఆర్థికమంత్రిగా

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం.[6] బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినారు.[7]

ముఖ్యమంత్రిగా

[మార్చు]

వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు.[8] పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24న తన పదవికి రాజీనామా చేసారు.

కాలరేఖ

[మార్చు]

గుర్తింపులు

[మార్చు]
  • 2007లో ఆంధ్ర విశ్వవిద్యాలయం రోశయ్యకు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది.

జీవిత సాఫల్య పురస్కారం

[మార్చు]

2018 ఫిబ్రవరి 11 ఆదివారం నాడు టి.సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యను గజమాలతో సత్కరించి జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు, రోశయ్యకు స్వర్ణ కంకణం బహుకరించారు. రోశయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యదక్షుడని కొనియాడారు. సౌమ్యత, విషయ స్పష్టతతో ఏ పనినైనా నిబద్ధతతో చేసేవారని తెలిపారు. రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఆంధ్ర ఉద్యమంతో తన రాజకీయ జీవితం ప్రారంభమైందని రోశయ్య తెలిపారు. ఆ సమయంలోనే వెంకయ్యతో పరిచయం ఏర్పడిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందించిన సహకారంతోనే చట్టసభల్లో తగిన గుర్తింపు లభించిందన్నారు. తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. తనకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వహించానని తెలిపారు.

తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత వెంకయ్య, రోశయ్యలకు దక్కుతుందని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ కాలంపాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత రోశయ్యదేనని కీర్తించారు. ఒక మహోన్నత వ్యక్తి మరో గొప్ప వ్యక్తికి సన్మానం చేయటం విశేషమన్నారు. చమత్కారాలు, ఛలోక్తులు విసరటంలో వీరిద్దరూ ఎవరివారే సాటి అని తెలిపారు.[9]

మరణం

[మార్చు]

కొణిజేటి రోశయ్య అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లో 2021 డిసెంబరు 4న మరణించాడు.[10]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Rosaiah not to contest Assembly polls". The Hindu. Chennai, India. 24 August 2008. Archived from the original on 23 జూన్ 2013. Retrieved 27 మార్చి 2017.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-05-2009
  3. "బిగ్ బ్రేకింగ్: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత". NTV (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-04. Archived from the original on 2021-12-04. Retrieved 2021-12-04.
  4. "మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూత.. ఇంట్లోనే అస్వస్థత, ఆస్పత్రికి తరలించే సరికే!". Samayam Telugu. Retrieved 2021-12-04.
  5. http://www.indianexpress.com/news/after-a-life-content-in-the-wings-rosaiah/512607/
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-07-27. Retrieved 2009-09-03.
  7. సాక్షి దినపత్రిక, తేది 26-05-2009
  8. "Konijeti Rosaiah: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత". EENADU. Retrieved 2021-12-04.
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-02-12. Retrieved 2018-02-12.
  10. TV9 Telugu (4 December 2021). "ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూత". Archived from the original on 4 December 2021. Retrieved 4 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)


ఇంతకు ముందు ఉన్నవారు:
వై.యస్. రాజశేఖరరెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
02/09/2009 — 16/11/2010
తరువాత వచ్చినవారు:
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.