Jump to content

పెండ్యాల హరికృష్ణ

వికీపీడియా నుండి
పెండ్యాల హరికృష్ణ

1986 మే 10 న జన్మించిన పెండ్యాల హరికృష్ణ (Pendyala Harikrishna) ఆంధ్రప్రదేశ్కు చెందిన చదరంగం క్రీడాకారుడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత చెస్ క్రీడలో ప్రస్తుతం భారతదేశంలో ఇతను రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 2001లో దేశంలోనే అతిపిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ అయిన రికార్డు స్థాపించాడు. ఈ రికార్డును పరిమార్జిన్ నేగి 2006లో అధికమించాడు. 2004నవంబర్లో ప్రపంచ జూనియర్ సెస్ చాంపియన్‌షిప్ సాధించాడు.

సాధించిన విజయాలు

[మార్చు]
  • 1996 : ప్రపంచ అండర్-10 చాంపియన్
  • 1996 : ప్రపంచ అండర్-12 రాపిడ్ చాంపియన్
  • 1998 : చిల్డ్రెన్స్ ఒలింపియాడ్ విజయం
  • 2000 : కామన్వెల్త్ చాంపియన్షి్ప్
  • 2000 : భారత్ తరపున అతిపిన్న వయస్సులో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా
  • 2000 : ప్రపంచ అండర్-14 చాంపియన్‌షిప్
  • 2000 : జాతీయ ఏ చాంపియన్‌షిప్
  • 2000: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్
  • 2000 : చెస్ ఒలింపియాడ్
  • 2001 : కోరస్ టోర్నమెంట్
  • 2001 : ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్
  • 2001 : భారత్ తరపున పిన్న వయస్సులో గ్రాండ్‌మాస్టర్ అయిన హోదా
  • 2001 : కామన్వెల్త్ చాంపియన్‌షిప్
  • 2004 : ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్
  • 2005 బెర్మూడా ఇన్విటేషనల్ టోర్నమెంట్
  • 2006 : రిక్జావిక్ ఓపెన్ టొర్నమెంట్

బయటి లింకులు

[మార్చు]