పెద్దింటల్లుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెద్దింటల్లుడు
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం శరత్
నిర్మాణం టి.ఆర్. తులసి
కథ పి. వాసు
చిత్రానువాదం శరత్
తారాగణం సుమన్ ,
నగ్మా
సంగీతం కె.వి.మహదేవన్
సంభాషణలు ఓంకార్
ఛాయాగ్రహణం వై. మహీధర్
కూర్పు మురళి రామయ్య
నిర్మాణ సంస్థ శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర
భాష తెలుగు

పెద్దింటల్లుడు 1991 లో వచ్చిన హాస్య చిత్రం. దీనిని శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర నిర్మాణ సంస్థ [1] కింద టిఆర్ తులసి నిర్మించింది. శరత్ దర్శకత్వం వహించాడు. [2] రాజ్-కోటి సంగీతం సమకూర్చాడు. ఇందులో సుమన్, నగ్మా, మోహన్ బాబు, వాణిశ్రీ నటించారు . [3] ఇది 1962 లో వచ్చిన హిందీ సినిమా ప్రొఫెసర్కు రీమేక్, ఇంతకు ముందు 1969 లో తెలుగులో ఎన్ టి రామారావు నటించిన భలే మాస్టారుగా రీమేక్ చేసారు. [4] ఇది తెలుగు సినిమా పరిశ్రమలో నటి నగ్మాకు తొలి చిత్రం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నమొదైంది. [5]

రాజా (సుమన్) నిరుద్యోగి. అతని తల్లి (డబ్బింగ్ జానకి) తీవ్రమైన గుండె జబ్బు మనిషి. పెద్ద ఆపరేషన్ అవసరం. కానీ పేదరికం కారణంగా, రాజా తన తల్లి చికిత్స, ఉద్యోగం కోసం హైదరాబాదుకు మారాలని నిర్ణయించుకుంటాడు. దారిలో, అతను రిటైర్డ్ సంగీతం టీచర్ శ్రీనివాసరావు (బాబు మోహన్) ను రైలులో కలుస్తాడు, అతను 3000 జీతంతో ఐలాండ్ ఎస్టేట్ లో ట్యూషన్ మాస్టరుగా చేరడానికి వెళుతున్నాడు. రైలు దిగేటపుడు రాజా శ్రీనివాసరావు ల సూట్కేసులు తారుమారవుతాయి. గదికి చేరుకున్న తరువాత, రాజా శ్రీనివాసరావు అపాయింట్‌మెంట్ లెటర్, అడ్రస్ కవర్‌ను చూస్తాడు. తన తల్లి పరిస్థితి విషమంగా ఉన్నందున, రాజా మారువేషంలో ఉన్న వృద్ధుడిగా ఈ పదవిలో చేరిపోతాడు.

ఐలాండ్ ఎస్టేట్ యజమాని బాలా త్రిపుర సుందరి (వాణిశ్రీ) ఒక లేడీ హిట్లర్, ఆమె చనిపోయిన తన సోదరుడి నలుగురు కొంటె పిల్లలు గీత (నగ్మా), రాధ (సీమ), టింకు (మాస్టర్ అమిత్), పింకీ (బేబీ విజయలక్ష్మి) లకు సంరక్షకురాలు. బాలా త్రిపుర సుందరి శ్రీనివాసరావును వాళ్ళకు కేర్ టేకర్ & టీచర్‌గా నియమిస్తుంది. ఇప్పుడు రాజా తనను ఇద్దరు మనుషులుగా చూపించుకుంటాడు. యువకుడి రూపంలో శ్రీనివాసరావు సోదరుడి కొడుకుగా పరిచయం చేసుకొని గీతను ప్రేమించడం మొదలుపెడతాడు వృద్ధుడి అవతారంలో బాలా త్రిపుర సుందరిని ప్రశంసించి ఆమె ప్రశంసలను పొందుతాడు. ఒకసారి రాజా తన గెటప్‌లను మార్చుకుంటున్నప్పుడు ఒక దొంగ గోడల కన్నారావు (మోహన్ బాబు) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, బ్లాక్ మెయిలింగ్ ప్రారంభించి అతనితో పాటు అతడి బావమరిదిగా ఆ ఇంట్లో స్థిరపడతాడు. ఇంతలో, బాలా త్రిపుర సుందరి, శ్రీనివాసరావుకు కుజదోషం ఉందని తెలుస్తుంది. అది ఉన్న వ్యక్తులు అది ఉన్న వ్యక్తులనే పెళ్ళి చేసుకోవాలి, లేదంటే సంబంధిత భాగస్వామి చనిపోతాడు. దీనివల్ల బాలా త్రిపుర సుందరికి పెళ్ళి కాలేదు. కాబట్టి, ఇప్పుడామె శ్రీనివాసరావును ప్రేమించడం ప్రారంభించి పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. రాజా ఈ సమస్యల నుండి ఎలా బయటపడతాడనేది మిగతా కథ[6]

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
ఎస్. పాట పేరు గాయకులు పొడవు
1 "జిందాబాద్ జీవితం" ఎస్పీ బాలు 4:53
2 "కన్ను కొట్టు" ఎస్పీ బాలు, చిత్ర 4:12
3 "జోహరే భామా" ఎస్పీ బాలు, చిత్ర 3:28
4 "అబ్బలాలో" ఎస్పీ బాలు, చిత్ర 3:54
5 "కళ్ళే మూడట" ఎస్పీ బాలు, చిత్ర 4:36

మూలాలు

[మార్చు]
  1. "Peddinti Alludu (Banner)". Filmiclub.
  2. "Peddinti Alludu (Direction)". Know Your Films.
  3. "Peddinti Alludu (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-13. Retrieved 2020-08-25.
  4. "Peddinti Alludu (Remake)". Spicy Onion.
  5. "Peddinti Alludu (Review)". The Cine Bay. Archived from the original on 2018-10-13. Retrieved 2020-08-25.
  6. Andhrajyothy (20 June 2021). "30 వసంతాల 'పెద్దింటల్లుడు'!". andhrajyothy. Archived from the original on 20 జూన్ 2021. Retrieved 20 June 2021.