Jump to content

పెళ్లీడు పిల్లలు

వికీపీడియా నుండి
(పెళ్ళీడుపిల్లలు నుండి దారిమార్పు చెందింది)
పెళ్లీడు పిల్లలు
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
నిర్మాణం దుక్కిపాటి మధుసూధనరావు
రచన బాపు,
ముళ్ళపూడి వెంకటరమణ
తారాగణం సురేష్,
విజయశాంతి,
జె.వి.సోమయాజులు,
శరత్ బాబు,
సంగీత,
సుమలత
సంగీతం ఎమ్.ఎస్.విశ్వనాధన్
సంభాషణలు ముళ్ళపూడి వెంకటరమణ
ఛాయాగ్రహణం బాబా ఆజ్మీ
కూర్పు జి అర్ అనిల్ దత్తాత్రేయ
నిర్మాణ సంస్థ శ్రీ అన్నపూర్ణ పిక్చర్స్ ప్రై.లిమిటెడ్
పంపిణీ మ్యుజిక్ వరల్డ్ (భారత, వీసీడీ)
భాష తెలుగు

పెళ్లీడు పిల్లలు సినిమా అన్నపూర్ణ పిక్చర్స్ బేనరులో తీయబడిన సినిమాలలో అతి తక్కువ బడ్జెట్టుతో తీయబడిన సినిమా. దుక్కిపాటి మదుసూదనరావు ఈ చిత్రం ద్వారా అనేక మందిని తెరపరిచయం చేసాడు. ఈ చిత్రం అధిక భాగం అమరావతి దేవాలయము ప్రాంతములోనూ, వైకంఠపురం గ్రామ పరిసర ప్రాంతాలలోనూ చిత్రీకరించబడింది.

కథాగమనం

[మార్చు]

పి.వి.రావు (సోమయాజులు) చెల్లెలు చనిపోతూ తన ఇద్దరు కూతుళ్ళూ అయిన దుర్గ (సంగీత), శాంతి (విజయశాంతి)లను వాళ్ళ ఆస్తిని అతనికప్పగించి పోతుంది. పి.వి.రావు వారి ఆస్తిని స్వాదీనం చేసుకొని దుర్గకు ఒక పేదవాడైన చలపతి (శరత్ బాబు) తో పెళ్ళి చేస్తాడు. దుర్గ అతని దుర్మార్గం తెలుసుకొని చెల్లెను తెసుకొని వచ్చేసి పచ్చళ్ళు, అప్పడాలు తయారు చేస్తూ జీవిస్తుంటుంది. తన కాలేజీలోనే చేరిన పి.వి.రావు కొడుకు తనకు బావ అయిన సురేష్‌ను గుర్తించి అతడిని ఆట పట్టిస్తూంటుంది శాంతి, తన స్నేహితురాలైన అన్నపూర్ణ (సుమలత)తో కలసి. అతడు కూడా ఆమె ఎవరో తెలుసుకొన్న తరువాత ఇద్దరూ ప్రేమించుకోవడం మొదలెడతారు. వీళ్ళిద్దరి ప్రేమ విషయం తెలిసిన పి.వి.రావు తన కొడుక్కు ఆస్తి కోసం వల వేస్తున్నారని దుర్గ, శాంతి లను తిట్టి వెళతాడు. అభిమానం దెబ్బతిన్న దుర్గ, మేనమామ అయిన పి.వి. రావు నడిపే హొటల్ ఎదురుగా తనొక హొటల్ పెట్టి అభివృద్ధి చేసి ఆస్తిపాస్తులను సంపాదించి మేనమామ హొటల్ వ్యాపారాన్ని దెబ్బతీస్తుంది. మనో వ్యాధితో మంచంపడతాడు పి.వి.రావు. శాంతికి అన్నపూర్ణ ప్రేమించిన సాయినాధ్ తో వివాహం నిశ్చయిస్తుంది దుర్గ. అది శాంతికి ఇష్టం లేక మేనమామ దగ్గరకు వెళ్ళి తన పెళ్ళి వేరే అతనితో జరగటం తనకిష్టం లేదని, బావను తప్ప వేరెవరినీ చేసుకోననీ చెబుతుంది. మార్పు చెందిన పీ.వీ.రావు శాంతికి అభయమిచ్చి తను చెప్పినట్టూగా చేయమని చెప్తాడు. అక్క నిర్ణయించిన పెళ్ళికి సిద్దమవుతుంది శాంతి. పి.వీ.రావు చలపతి, అన్నపూర్ణ, అన్నపూర్ణ తల్లి రమప్రభలతో కలసి పెళ్ళిలో చిన్న నాటకమాడి, పెళ్ళి కూతుళ్ళను మార్చి, అదే ఇంట్లో మేడమీద గదిలో శాంతి, సురేషుల పెళ్ళి జరుపుతాడు. అసలైన పెళ్ళి పందిరిలో అన్నపూర్ణ, సాయిచందుల వివాహం జరుగుతుంది. ఆఖరున పి.వీ.రావు నచ్చచెప్పడంతో దుర్గ కూడా రాజీ పడడంతో కథ సుఖాంతం అవుతుంది.

తారాగణం

[మార్చు]

సాంకేతిక బృందం

[మార్చు]

సంగీతం

[మార్చు]

సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: ఎమ్మెస్ విశ్వనాథన్.

పాటలు
సం.పాటపాట రచయితగానంపాట నిడివి
1."పదహారు ప్రాయం"ఆత్రేయఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల4:20
2."పరువపు వలపుల సంగీతం"శ్రీశ్రీపి.సుశీల3:50
3."వయసే వెల్లువగా"శ్రీశ్రీఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల4:20
4."ముసిముసినవ్వుల రుసరుసలు[1]"శ్రీశ్రీపి.సుశీల 

చిత్ర విషేషాలు

[మార్చు]

అన్నపూర్ణ వారిలో బడ్జెట్ చిత్రమైన పెళ్ళీడు పిల్లల్లో ఎన్నో విషేషాలు ఉన్నాయి.

  • ఈ చిత్రం దర్శకుడు బాపు యొక్క తొలి చిత్రం.
  • సంగీత దర్శకుడు ఎమ్.ఎస్. విశ్వనాథన్ యొక్క తొలి చిత్రమూ ఇదే.
  • హీరోగా సురేష్ తెర పరిచయమూ ఇదే చిత్రముతో జరిగింది.
  • ప్రముఖ నటి షబనా ఆజ్మీ తమ్ముడైన బాబా ఆజ్మీ ఈ చిత్రానికి పొటోగ్రపీ అందించారు.
  • అప్పటి వరకూ గౌరవనీయ పాత్రలను పోషించిన జె.వి.సోమయాజులు తొలిసారిగా ప్రతినాయకునిగా{విలన్} ఈ చిత్రంలో నటించారు. ఈ పాత్రను ప్రేక్షకులు సరిగా రిసీవ్ చేసుకోరనే భయంతో ఆయన దుష్ట కార్యాలు చేసే సందర్భాలలో ఆయన ఆత్మ రూపం ఎదురుగా వచ్చి నువ్వు చేస్తున్న పనులు తప్పు అని వాదించే విదంగా ఒక పాత్రను రూపొందించారు.
  • ఈ చిత్రాన్ని దుక్కిపాటి స్వర్గీయ సావిత్రికి అంకితమిచ్చారు.
  • చిత్ర నిర్మాత దుక్కిపాటి దేవదాసు సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలో శ్రేయోభిలాషిగా వెళుతుండేవారు. ఆసినిమాకు సంగీత దర్శకుడైన సి.ఆర్. సుబ్బరామన్ హఠాత్తుగా సినిమా మధ్యలో స్వర్గస్తులవడంతో మిగిలిన సంగీత బాధ్యతలు అప్పటికి ఆయన వద్ద అసిస్టెంటుగా పనిచేస్తున్న ఎమ్.ఎస్.విశ్వనాధన్ నిర్వహించారు. అంతేకాక ఆణిముత్యాలవంటి జగమేమాయ వంటి పాటలను కూడా అందించారు. ఆసమయంలో దుక్కిపాటి ఆయనకు తన సినిమాలో పూర్తి సంగీత కర్తగా అవకాశం ఇస్తానని అన్నారు. అప్పటి మాట పెళ్ళీడు పిల్లలతో నెరవేర్చుకొన్నారు.
  • ఈ చిత్రంలో విజయశాంతి నటన చూసిన దుక్కిపాటి ఆమెను అభినందిస్తూ నువ్వు సరిగా నటించగలిగితే సావిత్రి తరువాత ఆమె అంతటి నటివి కాగలవని అంటూ సినిమా పూర్తి అయిన తరువాత అప్పట్లో ఖరుదుగల సోనీ టూ ఇన్ ఒన్ బహుమతిగా ఇచ్చారు.

మూలాలు

[మార్చు]
  1. శ్రీశ్రీ (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటి లింకులు

[మార్చు]