పొణకా కనకమ్మ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పొణకా కనకమ్మ
పొణకా కనకమ్మ

పొణకా కనకమ్మ చిత్రపటంజననం జూన్ 10, 1892
మినగల్లు, ఆంధ్ర ప్రదేశ్
మరణం సెప్టెంబరు 15, 1963
నెల్లూరు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి పొణకా సుబ్బరామి రెడ్డి
సంతానము 1 అమ్మాయి
నివాసము పొట్లపూడి, పల్లెపాడు
మతం హిందూమతం

పొణకా కనకమ్మ (Ponaka Kanakamma) సుప్రసిద్ద సంఘసేవిక. ఈమె నెల్లూరు పట్టణంలో గల కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు. ఈమె జననం-1896. మరణం-1962.

కస్తూరిదేవి విద్యాలయము 3వ వార్షికోత్సవము.

నెల్లూరుకు చెందిన మరువూరు కొండారెడ్డి కూతురు పొణకా కనకమ్మ. గొప్ప సంఘ సంస్కర్త ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వారిలో మహిళలే ఎక్కువ. అటువంటి మహిళలలో చెప్పుకోదగ్గ వ్యక్తి కనకమ్మ గారు. తనతో పాటు తన కుటుంబము మొత్తం సత్యాగ్రహం పోరాటంలో పాల్గొనేలా చేసింది. ఖద్దరు ప్రచారం చేసింది. నెల్లూరిలో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది. రాజకీయరంగంలో వీరికి ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మగారి సహకారం లభించింది. 1930 లో సత్యాగ్రహసందర్భంలో జైలుకు వెళ్ళారు. కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు.

సాహిత్యకృషి[మార్చు]

  • జ్ఞాననేత్రము
  • ఆరాధన
  • నైవేద్యము-గీత
  • రమణగీత
  • శ్రీరమణ గురుస్తవము
  • ఆంధ్రస్త్రీలు
  • వీటిలో కొన్ని అముద్రితములు అలభ్యములు
  • కనకపుష్యరాగం (పొణకా కనకమ్మ స్వీయచరిత్ర). సం. డా. కాళిదాసు పురుషోత్తం. రచనాకాలం 1959-60. ప్రచురణ 2011.

వీరి రచనలు పేర్లను బట్టి ఆధ్యాత్మిక రచనలు చేసినారని తెలుస్తుంది.

బహుమతులు[మార్చు]

1955లో గృహలక్ష్మి స్వర్ణకంకణము స్వీకరించారు.