పోడూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పోడూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.[1]. పిన్ కోడ్ : 534 327. పోడూరు చక్కని ప్రకృతి అందాలతో సమృద్ధి గలిగిన పంట పొలాలతోనూ అభివృద్ధిలో ఉన్న గ్రామము. పోడూరులో సినిమా షూటింగులకు సహజసిద్ధమైన హంగులను సమకూరుస్తున్నాయి. 1976 నుంచి ఈ గ్రామంలో తెలుగు సినిమా షూటింగులు చేపడుతున్నారు. దర్శకులలో ప్రసిద్ధులైన కోడి రామకృష్ణ, దాసరి నారాయణరావుల అధిక సినిమాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకొన్నవి. షూటింగ్ చేసుకొనేందుకు అన్ని సౌకర్యాలు,వసతి అందుబాటులో ఉండుటవలన నిరంతరం ఏదో ఒక షూటింగ్‌తో ప్రస్తుతం పోడూరు షూటింగ్ స్పాట్‌గా మారిపోయింది.

పోడూరు మండలంలోని గ్రామాలు[మార్చు]

అప్పన్న చెర్వు · కవిటం · కొమ్ముచిక్కాల · గుమ్మలూరు · జగన్నాధపురం · జిన్నూరు · తూర్పుపాలెం · పండితవిల్లూరు · పెనుమదం · పెమ్మరాజుపోలవరం · పోడూరు · మట్టపర్రు · మినిమించిలిపాడు · రావిపాడు · వద్దిపర్రు · వేడంగి


  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు