ప్రత్యర్థి వారీగా న్యూజిలాండ్ క్రికెట్ జట్టు రికార్డు
న్యూజిలాండ్ జాతీయ క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. టెస్టు, వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే), T20I హోదాతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)లో పూర్తి సభ్యురాలు. [1] వారు 1930లో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో ఇంగ్లాండ్‌తో తమ మొదటి టెస్టు ఆడి, టెస్టు క్రికెట్ ఆడిన ఐదవ దేశంగా అవతరించారు. 1955-56 సీజనులో, 26 సంవత్సరాల తరువాత, ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో వెస్టిండీస్‌ను ఓడించినపుడు టెస్టుల్లో తొలి గెలుపు రూచి చూసారు. [2] వారు తమ మొదటి వన్‌డేని 1972-73 సీజన్‌లో పాకిస్తాన్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో ఆడారు. 2005లో మొదటి ట్వంటీ 20 ఇంటర్నేషనల్ ఆడిన అత్యంత పురాతన దేశం (ఆస్ట్రేలియాతో ఉమ్మడిగా).
టెస్టు క్రికెట్‌లో న్యూజిలాండ్ విజయ శాతం 23.83. 2021 ఆగస్టు నాటికి, న్యూజిలాండ్ 449 టెస్టు మ్యాచ్‌లు ఆడింది; అందులో 107 గెలిచింది, 175 ఓడిపోయింది, 167 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. [3]
అనేక టోర్నమెంట్‌ల సెమీ-ఫైనల్‌లకు చేరుకున్నందున, న్యూజిలాండ్ కూడా అత్యంత విజయవంతమైన వన్‌డే జట్టులో ఒకటి. 2021 ఆగస్టు నాటికి, వారు 775 వన్‌డే మ్యాచ్‌లు ఆడారు, అందులో 354 గెలిచారు, 374 ఓడిపోయారు; 7 మ్యాచ్‌లు టైగా ముగియగా, 40 మ్యాచ్‌ల్లో ఫలితం లేదు . [4] వారు 1975, 1979, 1992, 1999, 2007, 2011 సంవత్సరాల్లో క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆరు సార్లు సెమీ-ఫైనల్‌లకు చేరుకున్నారు. ప్రపంచ కప్‌లలో న్యూజిలాండ్ అత్యుత్తమ ప్రదర్శన 2015, 2019 లో రన్నరప్‌గా నిలిచింది. ICC ఛాంపియన్స్ ట్రోఫీలో, 2000 లో న్యూజిలాండ్ ఛాంపియన్‌గా నిలిచింది . వారు ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2009 లో రన్నరప్‌గా, ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2006 లో సెమీ-ఫైనలిస్టులుగా కూడా ఉన్నారు.
ట్వంటీ20 ఇంటర్నేషనల్స్‌లో న్యూజిలాండ్ మామూలు ప్రదర్శన కనబరిచింది. 2021 అక్టోబరు నాటికి న్యూజిలాండ్, 150 T20I మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 73 గెలిచింది, 65 ఓడిపోయింది, 8 మ్యాచ్‌లు టైగా ముగియగా, 4 మ్యాచ్‌లు ఫలితం ఇవ్వలేదు. వారి గెలుపు శాతం 52.73. [5] 6 ICC వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్‌లలో, న్యూజిలాండ్ అత్యుత్తమ ప్రదర్శన 2007, 2016 లో సెమీ-ఫైనలిస్ట్‌లుగా ముగిసింది.
2021 ఆగస్టు నాటికి, న్యూజిలాండ్ టెస్టు క్రికెట్‌లో తొమ్మిది జట్లతో తలపడింది. వారు అత్యంత తరచుగా ఆడిన ప్రత్యర్థి ఇంగ్లాండ్. వారితో 107 మ్యాచ్‌లు ఆడింది. [6] అయితే, వారు శ్రీలంకపై అత్యధికంగా 16 విజయాలు నమోదు చేసుకున్నారు. కానీ వారి అత్యుత్తమ విజయాల శాతం మాత్రం బంగ్లాదేశ్‌పై 80%. వారు 15 టెస్టులు ఆడగా న్యూజీలాండ్ 12 గెలిచింది. [6] వన్‌డే మ్యాచ్‌లలో, న్యూజిలాండ్ 18 జట్లతో ఆడింది; వారు తమ ఖండంలోని ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో చాలా తరచుగా 137 మ్యాచ్‌లు ఆడి, 29.77 విజయ శాతం సాధించారు.[7] సాధారణ వన్‌డే దేశాలలో, న్యూజిలాండ్ 49 సందర్భాలలో శ్రీలంక, భారత్‌లను ఓడించింది. ఇది వన్‌డేలలో వారి అత్యుత్తమ రికార్డు. [7] టీ20లో 13 దేశాలతో పోటీ చేసింది. [8]
సూచిక
[మార్చు]
|
|
టెస్టు క్రికెట్
[మార్చు]ఆడిన మ్యాచ్‌లు (దేశం వారీగా)
[మార్చు]ప్రత్యర్థి | తొలి టెస్టు | చివరి టెస్టు | మ్యాచ్‌లు | గెలుపు | ఓటమి | డ్రా | టైలు | గెలుపు % |
---|---|---|---|---|---|---|---|---|
ఆఫ్ఘనిస్తాన్ | – | – | 0 | 0 | 0 | 0 | 0 | – |
ఆస్ట్రేలియా | 1946 మార్చి 29 | 2020 జనవరి 3 | 60 | 8 | 34 | 18 | 0 | 13.33 |
బంగ్లాదేశ్ | 2001 డిసెంబరు 26 | 2022 జనవరి 9 | 17 | 13 | 1 | 3 | 0 | 80 |
ఇంగ్లాండు | 1930 జనవరి 10 | 2023 ఫిబ్రవరి 24 | 112 | 13 | 52 | 47 | 0 | 11.60 |
భారతదేశం | 1956 జనవరి 6 | 2021 డిసెంబరు 3 | 62 | 13 | 22 | 27 | 0 | 20.97 |
ఐర్లాండ్ | – | – | 0 | 0 | 0 | 0 | 0 | – |
పాకిస్తాన్ | 1955 నవంబరు 7 | 2023 జనవరి 2 | 62 | 14 | 25 | 21 | 0 | 22.58 |
దక్షిణాఫ్రికా | 1932 ఫిబ్రవరి 27 | 2022 ఫిబ్రవరి 25 | 45 | 5 | 26 | 16 | 0 | 10.63 |
శ్రీలంక | 1983 మార్చి 11 | 2019 ఆగస్టు 22 | 36 | 16 | 9 | 11 | 0 | 44.44 |
వెస్ట్ ఇండీస్ | 1952 ఫిబ్రవరి 8 | 2020 డిసెంబరు 11 | 49 | 17 | 13 | 19 | 0 | 34.69 |
జింబాబ్వే | 1992 నవంబరు 7 | 2016 ఆగస్టు 6 | 17 | 11 | 0 | 6 | 0 | 64.70 |
సారాంశం | 1930 | 2023 | 462 | 110 | 182 | 170 | 0 | 23.81 |
మూలం: Cricinfo[permanent dead link] . చివరిగా అప్‌డేట్ చేయబడింది: 2023 మార్చి 2 |
వన్ డే ఇంటర్నేషనల్
[మార్చు]ఆడిన మ్యాచ్‌లు (దేశం వారీగా)
[మార్చు]ప్రత్యర్థి | 1st వన్‌డే | Last వన్‌డే | Matches | Won | Lost | Tied | No result | % Won |
---|---|---|---|---|---|---|---|---|
ఆఫ్ఘనిస్తాన్ | 2015 మార్చి 8 | 2019 జూన్ 8 | 2 | 2 | 0 | 0 | 0 | 100.00 |
ఆస్ట్రేలియా | 1974 మార్చి 30 | 2022 సెప్టెంబరు 11 | 141 | 39 | 95 | 0 | 7 | 29.10 |
బంగ్లాదేశ్ | 1990 ఏప్రిల్ 28 | 2019 జూన్ 5 | 38 | 28 | 10 | 0 | 0 | 73.68 |
కెనడా | 2003 మార్చి 3 | 2011 మార్చి 13 | 3 | 3 | 0 | 0 | 0 | 100.00 |
East Africa† | 1975 జూన్ 7 | 1 | 1 | 0 | 0 | 0 | 100.00 | |
ఇంగ్లాండు | 1973 జూలై 18 | 2019 జూలై 14 | 91 | 43 | 41 | 3 | 4 | 51.14 |
భారతదేశం | 1975 జూన్ 14 | 2023 జనవరి 24 | 116 | 50 | 58 | 1 | 7 | 46.33 |
ఐర్లాండ్ | 2008 జూలై 1 | 2022 జూలై 15 | 7 | 7 | 0 | 0 | 0 | 100.00 |
కెన్యా | 2003 ఫిబ్రవరి 21 | 2011 ఫిబ్రవరి 20 | 2 | 2 | 0 | 0 | 0 | 100.00 |
నెదర్లాండ్స్ | 1996 ఫిబ్రవరి 17 | 2022 ఏప్రిల్ 4 | 4 | 4 | 0 | 0 | 0 | 100.00 |
పాకిస్తాన్ | 1973 ఫిబ్రవరి 11 | 2023 జనవరి 13 | 110 | 50 | 56 | 1 | 3 | 47.19 |
స్కాట్‌లాండ్ | 1999 మే 31 | 2015 ఫిబ్రవరి 17 | 3 | 3 | 0 | 0 | 0 | 100.00 |
దక్షిణాఫ్రికా | 1992 ఫిబ్రవరి 29 | 2019 జూన్ 19 | 71 | 25 | 41 | 0 | 5 | 37.87 |
శ్రీలంక | 1979 జూన్ 9 | 2019 జూన్ 1 | 99 | 49 | 41 | 1 | 8 | 54.39 |
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 1996 ఫిబ్రవరి 27 | 1 | 1 | 0 | 0 | 0 | 100.00 | |
యు.ఎస్.ఏ | 2004 సెప్టెంబరు 10 | 1 | 1 | 0 | 0 | 0 | 100.00 | |
వెస్ట్ ఇండీస్ | 1975 జూన్ 18 | 2022 ఆగస్టు 21 | 68 | 30 | 31 | 0 | 7 | 49.18 |
జింబాబ్వే | 1987 అక్టోబరు 10 | 2015 ఆగస్టు 7 | 38 | 27 | 9 | 1 | 1 | 74.32 |
Summary | 1973 | 2021 | 775 | 357 | 374 | 7 | 40 | 48.63 |
Source: Cricinfo. Last updated: 2 March 2023. |
ట్వంటీ20 ఇంటర్నేషనల్
[మార్చు]ఆడిన మ్యాచ్‌లు (దేశం వారీగా)
[మార్చు]ప్రత్యర్థి | 1st T20I | Last T20I | Matches | Won | Lost | Tied | No result | Win % |
---|---|---|---|---|---|---|---|---|
ఆఫ్ఘనిస్తాన్ | 2021 నవంబరు 7 | 1 | 1 | 0 | 0 | 0 | 100.00 | |
ఆస్ట్రేలియా | 2005 ఫిబ్రవరి 17 | 2022 అక్టోబరు 22 | 16 | 5 | 10 | 1 | 0 | 34.37 |
బంగ్లాదేశ్ | 2010 ఫిబ్రవరి 3 | 2022 అక్టోబరు 12 | 17 | 14 | 3 | 0 | 0 | 82.35 |
ఇంగ్లాండు | 2007 సెప్టెంబరు 18 | 2022 నవంబరు 1 | 23 | 8 | 13 | 1 | 1 | 38.63 |
భారతదేశం | 2007 సెప్టెంబరు 16 | 2023 ఫిబ్రవరి 1 | 25 | 10 | 12 | 3 | 0 | 46.00 |
ఐర్లాండ్ | 2009 జూన్ 11 | 2022 నవంబరు 4 | 5 | 5 | 0 | 0 | 0 | 100.00 |
కెన్యా | 2007 సెప్టెంబరు 12 | 1 | 1 | 0 | 0 | 0 | 100.00 | |
నమీబియా | 2021 నవంబరు 5 | 1 | 1 | 0 | 0 | 0 | 100.00 | |
నెదర్లాండ్స్ | 2014 మార్చి 29 | 2022 ఆగస్టు 5 | 3 | 3 | 0 | 0 | 0 | 100.00 |
పాకిస్తాన్ | 2007 సెప్టెంబరు 22 | 2022 నవంబరు 9 | 29 | 11 | 18 | 0 | 0 | 37.93 |
స్కాట్‌లాండ్ | 2009 జూన్ 6 | 2022 జూలై 29 | 4 | 4 | 0 | 0 | 0 | 100.00 |
దక్షిణాఫ్రికా | 2005 అక్టోబరు 21 | 2017 ఫిబ్రవరి 17 | 15 | 4 | 11 | 0 | 0 | 26.66 |
శ్రీలంక | 2006 డిసెంబరు 22 | 2022 అక్టోబరు 29 | 20 | 11 | 7 | 1 | 1 | 60.52 |
వెస్ట్ ఇండీస్ | 2006 ఫిబ్రవరి 16 | 2022 ఆగస్టు 14 | 19 | 10 | 4 | 3 | 2 | 67.64 |
జింబాబ్వే | 2010 మే 4 | 2015 ఆగస్టు 9 | 6 | 6 | 0 | 0 | 0 | 100.00 |
Summary | 2005 | 2023 | 185 | 94 | 78 | 9 | 4 | 53.24 |
Source: Cricinfo. Last updated: 2 March 2023 |
గమనికలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ICC Members Countries". International Cricket Council (ICC). Archived from the original on 16 January 2013. Retrieved 14 April 2013.
- ↑ Frindall, Bill (2009). Ask Bearders. BBC Books. p. 163. ISBN 978-1-84607-880-4.
- ↑ "Records / Test matches / Team records / Results summary". ESPNcricinfo. Retrieved 10 September 2013.
- ↑ "Records / One-Day Internationals / Team records / Results summary". ESPNcricinfo. Retrieved 10 September 2013.
- ↑ "Records / Twenty20 Internationals / Team records / Results summary". ESPNcricinfo. Retrieved 10 September 2013.
- ↑ 6.0 6.1 "Records / New Zealand / Test matches / Result summary". ESPNcricinfo. Retrieved 10 September 2013.
- ↑ 7.0 7.1 "Records / New Zealand / One-Day Internationals / Result summary". ESPNcricinfo. Retrieved 10 September 2013.
- ↑ "Records / New Zealand / Twenty20 Internationals / Result summary". ESPNcricinfo. Retrieved 30 March 2013.