"స్వైన్‌ఫ్లూ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
No change in size ,  6 సంవత్సరాల క్రితం
* లక్షణాలు ఆరంభమై 48 గంటల తర్వాత కూడా తగ్గకపోతుంటే.. వీరి శ్వాసలో వైరస్‌ మోతాదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరి ద్వారా ఇంట్లో మిగతా వారికీ తేలికగా వ్యాపించే అవకాశం ఉంటుందని గుర్తించాలి.
* స్వైన్‌ఫ్లూ బాధితులను ఆసుపత్రిలో చేర్చినా.. వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా ప్రత్యేకమైన గదిలో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. వీళ్ల కోసం వినియోగించే పరికరాలను ఇతరులకు వాడకూడదు.
* ఫ్లూ లక్షణాలున్న వారితో చేతులు కలపటం, కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం వంటివి చేయరాదు.
 
== లక్షణాలు==
సాధారణంగా ఫ్లూ జ్వరంలో కనిపించే లక్షణాలే స్వైన్‌ఫ్లూలోనూ ఉంటాయి. ముఖ్యంగా జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు కారటం. వీటికి తోడు దగ్గు, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన నీరసం కూడా ఉంటాయి. కొందరిలో వాంతులు, విరేచనాలు ఉండొచ్చు. సాధారణంగా ఈ ఫ్లూ లక్షణాలు కనబడినప్పుడు పెద్ద ఆందోళన అక్కర్లేదు. ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇవి ముదురుతుంటే మాత్రం తాత్సారం చెయ్యకూడదు. లక్షణాలు తీవ్రంగా ఉండి కూడా చాలా రోజులు చికిత్స తీసుకోకపోతే మరణావకాశాలు పెరుగుతాయి. మనం చూస్తున్న స్వైన్‌ఫ్లూ మరణాలన్నింటికీ దాదాపు ఇదే కారణం! ఇప్పటి వరకూ స్వైన్‌ఫ్లూతో చనిపోయిన వారిని పరిశీలిస్తే- వీరంతా లక్షణాలు మొదలైన 10-15 రోజులైనా చికిత్స తీసుకోకపోవటం వల్ల న్యుమోనియా తీవ్రతరమై మరణించారు. పైగా వీరిలో చాలామందికి మధుమేహం, గుండె జబ్బుల వంటి ఇతరత్రా ఏదో ఒక సమస్య కూడా ఉన్నట్టు తేలింది. గర్భిణులు, చిన్నపిల్లలకు కూడా స్వైన్‌ఫ్లూ తీవ్రమైతే మరణించే ముప్పు పెరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ లక్షణాలు కనబడి 48 గంటల తర్వాత కూడా లక్షణాల తీవ్రత తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. గర్భిణులు, పిల్లలు, ఇతర ఆరోగ్య సమస్యలున్న వాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1541407" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ