"మొఘల్ చిత్రకళ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
రిజా అబ్బాసి మాదిరిగా గీసినటువంటి ఏక వ్యక్తి (single figures) రూప చిత్రాలు అంతగా ప్రజాదరణ పొందలేదు, కాని ప్యాలెస్ నేపధ్యంలో ప్రేమికుల దృశ్యాలను పూర్తిగా చిత్రించిన రూపపటాలు తరువాత కాలంలో బాగా జనాదరణ పొందాయి. ముఖ్యంగా చిత్రాలలో ముస్లిం లేదా హిందువుల యొక్క పవిత్ర పురుషులను, ఆధ్యాత్మిక మూర్తులను చూపించే కళా ప్రక్రియ బాగా ప్రాచుర్యం పొందింది.
 
అక్బర్ స్వయంగా ఒక చిత్రపట ఆల్బంను కలిగి ఉండేవాడు. ప్రస్తుతం అందులోని చిత్రపటాలు చెల్లా చెదురై పలు విదేశీ మ్యూజియంలకు తరలిపోయాయి. ఈ ఆల్బంలో అతని ఆస్ధానికులందరి రూపపట చిత్రాలు పొందుపరచబడి ఉండేవి. దీనికి సహేతుకమైన కారణం వుంది. చరిత్రకారుల ప్రకారం, అక్బర్ తన సలహాదారులతో వ్యక్తుల నియామకాలను గురించి చర్చించేటప్పుడు, ఆ చర్చించబడుతున్న వ్యక్తులు ఎవరో గుర్తుకు తెచ్చుకునేందుకు చక్రవర్తి ఆ ఆల్బంను సంప్రదించేవాడని తెలుస్తుంది. ఆ విధంగా అక్బర్ కు తన జ్ఞాపకశక్తి పరీక్షించుకోవడానికి ఆ చిత్రపట ఆల్బం ఒక గీటురాయిగా వుపయోగపడేది. చిత్రాలలో వ్యక్తులతోపాటు ఆయా వ్యక్తుల సంబంధిత ప్రత్యేక వస్తువులను కూడా చిత్రించబడటం వలన వారిని గుర్తుపట్టడం చక్రవర్తికి సులభమైయ్యేది. అటువంటి ప్రతీక వస్తువులు లేని సందర్భాలలో వారి రూపపట చిత్రాలు సాదా నేపథ్యంలోనే ఉండేవి.
 
==మొఘల్ చిత్రకళా వికాసం==
7,316

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2915974" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ