ప్రసన్న కుమార్ బెజవాడ
Jump to navigation
Jump to search
ప్రసన్న కుమార్ బెజవాడ | |
---|---|
జననం | ప్రసన్న కుమార్ బెజవాడ 1985 జూన్ 16 |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2008–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | మౌనిక |
పిల్లలు | జస్విన్ కుమార్ |
తల్లిదండ్రులు | అమలేశ్వరరావు, నాగలక్ష్మి |
ప్రసన్న కుమార్ బెజవాడ తెలుగు సినీరంగానికి చెందిన సినిమా రచయిత, పాటల రచయిత.[1] ఆయన ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ లో స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసి సినిమా చూపిస్త మావ సినిమా ద్వారా రచయితగా సినీరంగంలోకి అడుగుపెట్టి, 'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్', 'నేను లోకల్', 'హలో గురు ప్రేమకోసమే' సినిమాలతో మంచి గుర్తింపునందుకున్నాడు.[2]
జననం, విద్యాభాస్యం[మార్చు]
ప్రసన్న కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మచిలీపట్నంలో 1985 జూన్ 16న అమలేశ్వరరావు, నాగలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఆయన 2007లో బిటెక్ పూర్తి చేశాడు.
వివాహం[మార్చు]
ప్రసన్న కుమార్ మచిలీపట్నంలోని రెవిన్యూ మండపంలో 2020 జులై 29న మౌనికను వివాహమాడాడు. వారికీ ఒక కుమారుడు జస్విన్ కుమార్ ఉన్నాడు.
పని చేసిన సినిమాలు[మార్చు]
సంవత్సరం | సినిమా | కథా రచయిత | పాటల రచయిత | మాటలు | స్క్రీన్‌ప్లే | ఇతర విషయాలు |
---|---|---|---|---|---|---|
2015 | సినిమా చూపిస్త మావ | అవును | కాదు | కాదు | కాదు | తొలి సినిమా |
2016 | రన్ | కాదు | కాదు | అవును | కాదు | |
2016 | ఎక్కడికి పోతావు చిన్నవాడా | కాదు | అవును | కాదు | కాదు | |
2016 | నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ | కాదు | కాదు | అవును | అవును | |
2017 | నేను లోకల్ | అవును | కాదు | అవును | అవును | |
2018 | హలో గురు ప్రేమకోసమే | అవును | కాదు | అవును | అవును | |
2021 | పాగల్ | కాదు | అవును | కాదు | కాదు |
మూలాలు[మార్చు]
- ↑ Mid-day (21 March 2022). "Prasanna Kumar Bezawada is a celebrity cum screenwriter you need to know about" (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
- ↑ The Hindu (2 January 2018). "Tricky art of writing for films" (in ఇంగ్లీష్). Archived from the original on 3 July 2022. Retrieved 3 July 2022.