ప్రాచీ తెహ్లాన్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జాతీయత | భారతీయురాలు | |||||||||||||
జననం | ఢిల్లీ, భారతదేశం | 1993 అక్టోబరు 2|||||||||||||
ఆల్మా మ్యాటర్ | మాంట్‌ఫోర్ట్ సీనియర్ సెకండరీ స్కూల్ జీసస్ అండ్ మేరీ కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ, ఘజియాబాద్ మహారాజా అగ్రసేన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం, న్యూ ఢిల్లీ | |||||||||||||
వృత్తి | నటి, బాస్కెట్‌బాల్ & నెట్‌బాల్ క్రీడాకారిణి | |||||||||||||
క్రియాశీల సంవత్సరాలు | 2016–ప్రస్తుతం | |||||||||||||
మెడల్ రికార్డు
|
ప్రాచీ తెహ్లాన్ (జననం 1993 అక్టోబరు 2) భారతీయ మాజీ నెట్‌బాల్, బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి. ప్రస్తుతం సినిమా నటిగా[1] కెరీర్ ప్రారంభించిన ఆమె 2010 కామన్వెల్త్ గేమ్స్, 2010-11లలో ఇతర ప్రధాన ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించిన భారత జాతీయ నెట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్. ఆమె కెప్టెన్సీలో, భారత జట్టు 2011 సౌత్ ఏషియన్ బీచ్ గేమ్స్ లో మొదటి పతకాన్ని గెలుచుకుంది. ఆటల్లో ఆమెకు టైమ్స్ ఆఫ్ ఇండియా "క్వీన్ ఆఫ్ ది కోర్ట్", ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ "లాస్ ఆఫ్ ది రింగ్స్" అనే బిరుదులు ప్రధానం చేసాయి. ఆమె 2011-2017కి నెట్‌బాల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ కూడా.
ఆమె జనవరి 2016లో స్టార్ ప్లస్‌లో టీవీ సిరీస్ దియా ఔర్ బాతీ హమ్‌లో తొలిసారిగా నటించింది.[2][3] 2017లో మండూప్ సింగ్ దర్శకత్వం వహించిన రోషన్ ప్రిన్స్ సరసన పంజాబీ చిత్రం అర్జన్‌లో నిమ్మీగా ఆమె తన సినీ రంగ ప్రవేశం చేసింది.
ప్రారంభ జీవితం
[మార్చు]ఆమె ఢిల్లీలోని మోంట్‌ఫోర్ట్ సీనియర్ సెకండరీ స్కూల్ నుండి పాఠశాల విద్యను అభ్యసించింది. ఆమె ఢిల్లీ యూనివర్శిటీలోని జీసస్ అండ్ మేరీ కాలేజీ నుండి బి.కామ్ (ఆనర్స్) లో పట్టభద్రురాలైంది. ఘజియాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ నుండి మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో తన పీజి డిప్లొమా పూర్తి చేసింది. ఆమె మహారాజా అగ్రసేన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయంలో చేరింది, అక్కడ ఆమె బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (హెచ్.ఆర్ అండ్ మార్కెటింగ్)లో మాస్టర్స్ పూర్తి చేసింది.
ఆమె డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, డెలాయిట్, యాక్సెంచర్, 1800స్పోర్ట్స్.ఇన్‌లలో వివిధ ప్రాజెక్ట్‌లలో పనిచేసింది. ఢిల్లీలోని నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన యువత సమీకరణ, శిక్షణ, ఉపాధి కోసం ఉడాన్ - స్కిల్స్ టు సక్సెస్ అనే ప్రాజెక్ట్‌కి ఆమె సహకరిస్తున్నారు.
కెరీర్
[మార్చు]స్పోర్ట్స్
[మార్చు]పాఠశాలలో ఉండగానే జాతీయ స్థాయిలో బాస్కెట్‌బాల్ ఆడటం ద్వారా ఆమె తన క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. 2004లో ఒడిశాలోని కటక్‌లో జరిగిన భారత శిబిరానికి ఆమె మూడుసార్లు ఎంపికైంది.
బాస్కెట్‌బాల్
2002–03లో పాండిచ్చేరి, కర్ణాటక రెండు సబ్ జూనియర్ నేషనల్స్ అండర్-14 విభాగంలో ఆమె ఆడింది. అండర్-17 విభాగంలో ఢిల్లీకి 8 సార్లు ప్రాతినిథ్యం ఆమె వహించగా, అందులో మూడుసార్లు జట్టు విజయం సాధించింది. అండర్-19 కేటగిరీలో ఢిల్లీకి 3 సార్లు ప్రాతినిధ్యం వహించి, మూడుసార్లు మొదటి స్థానం సంపాదించిపెట్టింది. 2008లో భువనేశ్వర్‌లోని ఇంటర్ యూనివర్శిటీలో, నెల్లూరులోని ఆల్ ఇండియాలో మొదటి స్థానంలో నిలిచింది. 2009లో పంజాబ్‌లో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్‌బాల్‌లోనూ ప్రధమ స్థానం సాధించింది.
నెట్‌బాల్
2011లో, ఆమె 34వ జాతీయ క్రీడల్లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఇంటర్ కాలేజీలో మూడుసార్లు ఆడి ఒకటవ స్థానం సాధించింది. సీనియర్ నేషనల్స్‌లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించింది. 2010లో ఢిల్లీ, నోయిడాలలో జరిగిన ఇండో-సింగపూర్ సిరీస్‌ను 5-0 తేడాతో గెలుచుకుంది. ఢిల్లీలో జరిగిన 7వ యూత్ ఏషియన్ ఛాంపియన్‌షిప్ 2010కు భారత జట్టు కెప్టెన్ గా ఉంది. ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2010లో భారత సీనియర్ నెట్‌బాల్ జట్టుకు సారథ్యం వహించింది. 6వ నేషన్ కప్, సింగపూర్-2010లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆమె జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. 2011 సౌత్ ఏషియన్ బీచ్ గేమ్స్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా ఉంది. ఇందులో జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టు సాధించిన తొలి పతకం ఇదే కావడం విశేషం.
సినిమా
[మార్చు]శశి సుమీత్ ప్రొడక్షన్స్ నుండి వచ్చిన ఆఫర్‌ను ప్రాచీ తెహ్లాన్ అంగీకరించి, జనవరి 2016లో స్టార్ ప్లస్ ఛానెల్‌లో అత్యంత రేటింగ్ పొందిన టీవీ డ్రామా దియా ఔర్ బాతీ హమ్‌లో సైడ్ క్యారెక్టర్ రోల్‌లో తొలిసారిగా నటించింది.[4] దీంతో ఆమె నెట్‌బాల్, బాస్కెట్‌బాల్ క్రీడలకు దూరమైంది.[5] 2017లో, ఆమె పంజాబీ చిత్రం బైలారస్‌లో ప్రముఖ నటి పాత్రను పోషించింది. ఆమె మలయాళ చిత్రం మామంగం (2019)లో, మోహన్‌లాల్ సరసన రామ్ చిత్రంలోనూ నటించింది.[6][7][8][9]
మూలాలు
[మార్చు]- ↑ "Prachi Tehlan on women in sports". Femina. 12 May 2016.
- ↑ "Netball captain-turned- actress asked to lose 15 kilos for her show". The Times of India. 28 January 2016.
- ↑ "Diya Aur Baati star Prachi Tehlan: JMC girls represent true women power". The Times of India. 9 November 2017.
- ↑ "Netball captain-turned- actress asked to lose 15 kilos for her show". The Times of India. 28 January 2016. Retrieved 28 January 2016.
- ↑ "Prachi Tehlan excited to shoot in Rann of Kutch". The Times of India. Archived from the original on 2 ఏప్రిల్ 2018. Retrieved 1 April 2018.
- ↑ "Mammootty suggested me to watch The Crown". The Indian Express. Retrieved 19 November 2019.
- ↑ Kumar, Pradeep (19 November 2019). "Mamangam must be watched on the big screen: Prachi Tehlan". The Hindu. Retrieved 19 November 2019.
- ↑ "The role in Mamangam was the best thing to happen to me since my acting debut". The Times of India. Retrieved 23 September 2019.
- ↑ Express News Service (15 January 2020). "Prachi Tehlan in talks to join Mohanlal-Jeethu Joseph's 'Ram'". The New Indian Express. Retrieved 18 January 2020.
- Pages using Infobox sportsperson with unknown parameters
- ఢిల్లీ క్రీడాకారులు
- భారత నెట్‌బాల్ క్రీడాకారులు
- భారతదేశం కొరకు కామన్వెల్త్ గేమ్స్ పోటీదారులు
- 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో నెట్‌బాల్ క్రీడాకారులు
- సౌత్ ఏషియన్ బీచ్ గేమ్స్ రజత పతక విజేతలు
- నెట్‌బాల్‌లో దక్షిణాసియా బీచ్ గేమ్స్ పతక విజేతలు
- భారతీయ సినిమా నటీమణులు
- భారతీయ టెలివిజన్ నటీమణులు
- ఇండియన్ సోప్ ఒపెరా నటీమణులు
- హిందీ టెలివిజన్ నటీమణులు
- భారతీయ మహిళా మోడల్స్
- పంజాబీ సినిమా నటీమణులు
- మలయాళ సినిమా నటీమణులు
- తెలుగు సినిమా నటీమణులు