Jump to content

ప్రేమ ఎంత మధురం

వికీపీడియా నుండి
(ప్రేమ ఎంతమధురం నుండి దారిమార్పు చెందింది)
ప్రేమ ఎంతమధురం
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం జంధ్యాల
నిర్మాణం ఎం.పి.జితేందర్‌రెడ్డి
కథ పొత్తూరి విజయలక్ష్మి
చిత్రానువాదం జంధ్యాల
తారాగణం నరేష్,
మయూరి కాంగో,
బ్రహ్మానందం,
కోట శ్రీనివాసరావు,
సుత్తివేలు,
గొల్లపూడి మారుతీరావు,
అచ్యుత్,
వరలక్ష్మి,
శిల్ప,
మహర్షి రాఘవ,
డబ్బింగ్ జానకి,
రాళ్ళపల్లి,
జిత్ మోహన్ మిత్ర,
శ్రీలత,
విశ్వనాధం
సంగీతం విద్యాసాగర్
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రమణ్యం,
కె.ఎస్.చిత్ర
సంభాషణలు జంధ్యాల
ఛాయాగ్రహణం బాబ్జీ
విడుదల తేదీ సెప్టెంబర్ 6,1991
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ప్రేమ ఎంత మధురం జంధ్యాల దర్శకత్వం వహించగా, నరేష్, మయూరి, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సుత్తివేలు ప్రధానపాత్రల్లో ఎం.పి.జితేందర్ రెడ్డి నిర్మించిన 1991 నాటి తెలుగు హాస్య కథాచిత్రం. ఈ సినిమాకి పొత్తూరి విజయలక్ష్మి రాసిన సంపూర్ణ గోలాయణం నవల ఆధారం.

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

పొత్తూరి విజయలక్ష్మి రాసిన ప్రేమలేఖ నవలని జంధ్యాల రచనా దర్శకత్వంలో శ్రీవారికి ప్రేమలేఖ సినిమాగా తీశాడు. ఆ సినిమా వందరోజుల ఫంక్షన్లో మళ్ళీ నాకెప్పుడు మంచి కథ ఇస్తున్నారనీ, రాస్తున్న నవల పూర్తికాగానే పంపండనీ కోరడంతో పొత్తూరి విజయలక్ష్మి రెండు కుటుంబాల మధ్య తాను రాసిన నవలను ఆయనకు పంపింది. ఐతే ఆయన ఫోన్ చేసి ప్రొడ్యూసర్ మనిషి వచ్చి అడ్వాన్స్ ఇస్తారని చెప్పడం, కానీ అందుకు ఆలస్యం కావడంతో, ఆ సంగతి వదిలి విజయలక్ష్మి తన నవలను సంపూర్ణ గోలాయణం అన్న పేరుతో ఉదయంలో ప్రచురణకు పంపగా సీరియల్ గా ప్రచురితమైంది. ఆపైన నవలగా కూడా విడుదలయ్యాకా, మళ్ళీ జంధ్యాల కలిసి ఆ నవల సంగతి కనుక్కుని సినిమా ప్రారంభించారు.[1]

మూలాలు

[మార్చు]
  1. దాట్ల, లలిత. "ఆంధ్రుల అభిమాన హాస్య రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారితో ముఖాముఖీ". జంధ్యామారుతం. Archived from the original on 20 ఏప్రిల్ 2017. Retrieved 17 April 2017.