బాబ్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాబ్జీ
Babji.jpg
జననం(1966-04-25)ఏప్రిల్ 25, 1966
వృత్తిచలనచిత్ర దర్శకుడు, నటుడు
జీవిత భాగస్వాములుశ్రీకళ
పిల్లలుఅఖిల్ సన్నీ, కమల్

బాబ్జీ ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు,[1] నటుడు రచయిత, నిర్మాత.

జననం - విద్యాభ్యాసం[మార్చు]

బాబ్జీ 1966, ఏప్రిల్ 25న సబాహు బాబు, పార్వతీదేవి దంపతులకు ప్రకాశం జిల్లా, పెద్ద దోర్నాల గ్రామంలో జన్మించాడు. ప్రకాశం జిల్లాలోని బెస్తవారిపేట, గిద్దలూరు, పొదిలి, ఎర్రగొండపాలెం, మార్కాపురంలో బాబ్జీ విద్యాభ్యాసం సాగింది. బి.యస్సీ. వరకు చదువుకున్నాడు.

వివాహం - పిల్లలు[మార్చు]

శ్రీకళతో బాబ్జీ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (అఖిల్ సన్నీ, కమల్)

సినిమారంగ ప్రస్థానం[మార్చు]

తాత, నాన్న కమ్యూనిస్టు పార్టీ లో పనిచేయడంతో, బాబ్జీకి చిన్నప్పటిపుండే కమ్యూనిస్టు భావాలు ఉండేవి. నేను స్కూల్‌లో ఉన్నప్పుడే శ్రీశ్రీ మహాప్రస్థానం చదవి ఉత్తేజితుడై, ఆ స్ఫూర్తితో సామాజిక అంశాలపై పాటలు రాశాడు. స్టూడెంట్‌గా ఉన్నప్పుడే ఎస్‌ఎఫ్‌ఐలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజలను చైతన్య పరిచేందుకు ప్రజానాట్యమండలిలో చేరాడు. బాబ్జీ రాసిన పాటల్లో వంద వరకూ పాపులర్ అయ్యాయి.

చిన్నప్పటినుంచే బాబ్జీకి సినిమాలంటే ఇష్టం ఉండేది. మాదాల రంగారావు సినిమాలు చూసి ప్రభావితుడయ్యేవాడు. దర్శకుడిగా కాకముందు అనేక సినిమాలకు రచయతగా పనిచేవాడు. 1997లో స్వీయ దర్శకత్వంలో నల్లపూసలు, 2000లో ఎన్.టి.ఆర్.నగర్, 2016లో రఘుపతి వెంకయ్య నాయుడు సినిమాలు తీశాడు.

దర్శకత్వం[మార్చు]

  1. నల్లపూసలు (1997)[1]
  2. ఎన్.టి.ఆర్.నగర్ (2000)[2]
  3. రఘుపతి వెంకయ్య నాయుడు (2016)[3]

అవార్డులు - పురస్కారాలు[మార్చు]

  1. నల్లపూసలు చిత్రానికి ఉత్తమ నూతన దర్శకుడిగా బంగారు నంది బహుమతి తోపాటు వంశీ బర్కిలీ అవార్డ్స్, భరతముని నాలుగు అవార్డులు, మహానటి సావిత్రి అవార్డులు, చైతన్యకళా వేదిక అవార్డులతో కలిపి మొత్తం 39 అవార్డులు వచ్చాయి.
  2. ఎన్.టి.ఆర్.నగర్ చిత్రం దక్షిణ భారతదేశం లోని ప్రముఖ హీరోల డూప్‌లనే హీరోలుగాచేసి తీసిన తొలి సినిమా ఇదే. భరతముని దశాబ్దపు ఉత్తమ ప్రయోగాత్మక చిత్ర దర్శకుడు అవార్డుతోపాటు మొత్తం 18 అవార్డులు వచ్చాయి.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 సాక్షి. "శ్రీశ్రీ నాకు స్ఫూర్తి - సినీ డైరెక్టర్ నల్లపూసల బాబ్జీ". Retrieved 24 August 2017. CS1 maint: discouraged parameter (link)
  2. ఆంధ్రభూమి. "ప్రపంచానికి రాసే ప్రేమలేఖే సినిమా". Retrieved 24 August 2017. CS1 maint: discouraged parameter (link)
  3. సాక్షి. "మూలన మిగిలిపోయిన తెలుగు సినిమా మూల పురుషుడు". Retrieved 24 August 2017. CS1 maint: discouraged parameter (link)
"https://te.wikipedia.org/w/index.php?title=బాబ్జీ&oldid=3011291" నుండి వెలికితీశారు