ప్లాటీహెల్మింథిస్
Appearance
(ప్లాటిహెల్మింథిస్ నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ప్లాటిహెల్మింథిస్ | |
---|---|
"Platodes" from Ernst Haeckel's Kunstformen der Natur, 1909 | |
Scientific classification | |
Kingdom: | |
Subkingdom: | |
Superphylum: | |
(unranked): | |
Phylum: | ప్లాటిహెల్మింథిస్ Gegenbaur, 1859
|
Classes | |
ప్లాటిహెల్మింథిస్ (ఆంగ్లం Platyhelminthes) వర్గాన్ని గెగెన్ బార్ ఏర్పరిచారు. సాధారణంగా బల్లపరుపు పురుగులు (ప్లాటి:బల్లపరుపు) అని పిలిచే ఈ జీవులు త్రిస్తరిత జీవులు. ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవంతో, శరీర కుహరరహితంగా ఉంటాయి. ఎక్కువగా పరాన్నజీవులు, కొన్ని స్వేచ్ఛాజీవులు. ఇవి సాగర, మంచినీటి, భూచర పరిసరాలలో నివసిస్తాయి.
సాధారణ లక్షణాలు
[మార్చు]- శరీరం పృష్టోదరంగా అణిగి ఉంటుంది. కాబట్టి వీటిని సాధారణంగా 'బల్లపరుపు పురుగులు' అంటారు.
- ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవం కనబరుస్తాయి. మధ్య అక్షానికి ఇరువైపులా శరీర అవయవాలు ఉంటాయి. జీవిని సమాయత అక్షంలో ఖండించినప్పుడు దర్పణ ప్రతిబింబ అర్ధబాగాలు ఏర్పడతాయి.
- మితమైన శిరఃప్రాధాన్యం, ఏకదిశా చలనం కలిగి ఉంటాయి.
- ఇవి మొట్టమొదటి త్రిస్తరిత జీవులు. ఇవి పిండదశలో మధ్యత్వచాన్ని ఏర్పరుచుకొంటాయి. ఇది మూడో జననస్తరం, నిజ కండర కణజాలం అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది.
- జీర్ణనాళానికి, శరీర కుడ్యానికి మధ్య శరీర కుహరం లేదు. కాబట్టి వీటిని కుహరరహిత జీవులు అంటారు. మధ్యత్వచం నుంచి ఏర్పడిన మృదుకణజాలం దీని స్థలంలో నిండి ఉంటుంది.
- బల్లపరుపు పురుగు శరీర నిర్మాణం, అవయవ, వ్యవస్థల స్థాయిని ప్రదర్శిస్తుంది.
- జీర్ణనాళానికి ఒకే ఒక్క రంధ్రం ఉంటుంది. అదే నోరు. నిడేరియాలలోలాగ పాయువు లేదు. నోటిద్వారానే ఆహార అంతర్గ్రహణం, మలవిసర్జనం జరుగుతుంది. నిడేరియా జీవులలో లాగా జఠరప్రసరణ కుహరకుడ్యపు కణాలు, ఆహారపదార్ధాలను భక్షించి, కణాంతస్థ జీర్ణక్రియ జరుపుకొంటాయి.
- మిధ్యాఖండీభవనం గల సెస్టోడా (బద్దెపురుగులు) మినహాయించి ఏ జీవులలోనూ ఖండీభవనం లేదు.
- జ్వాలా కణాలు అనే ప్రత్యేకమైన ప్రాథమిక వృక్కాలతో విసర్జన జరుగుతుంది. జ్వాలా కణాలు జంతువుకూ పరిసరాలకూ మధ్య ద్రవాభిసరణక్రమతను నియంత్రిస్తాయి.
- శ్వాస, రక్తప్రసరణ వయవస్థలు లేవు.
- నాడీవ్యవస్థలో మితంగా అభివృద్ధిచెందిన మెదడు, నాడీదండాలు ఉంటాయి. స్వేచ్ఛగా నివసించే జీవులలో జ్ఞానాంగాలు ఉంటాయి.
- ఎక్కువగా ఉభయలింగ జీవులలో అంతఃఫలదీకరణ జరుగుతుంది.
- జీవితచరిత్ర సరళంగా లేదా క్లిష్టంగా ఉంటుంది. ఒకటి లేదా ఎక్కువ మాధ్యమిక అతిధేయులు కలిగి, వివిధ రకాలైన పిండాభివృద్ధి దశలైన మిరాసీడియమ్, స్పోరోసిస్టు, రీడియా, సర్కేరియా మొదలయినవి ఉంటాయి. కొన్నిటిలో బహుపిండత్వం సర్వసాధారణం.
వర్గీకరణ
[మార్చు]ప్లాటిహెల్మింథిస్ వర్గాన్ని మూడు విభాగాలుగా వర్గీకరించారు.
- విభాగం 1: టర్బెల్లేరియా:
- ఇవి చాలా వరుకు స్వేచగా జీఏంచినా అరుదుగా సహజీవనం లేదా పరాన్న జీవనం సాగిస్తాయి.
- తల భాగంలో కళ్లు గుంతలు స్పర్శకాలు జ్ఞన కంటక రోమాలు వంటివి ఉంటాయి.
- శరీరం కుడ్యం బయటి భాగంలో శైలికామయ బాహ్య చర్మం ఉంటుంది.బాహ్య చర్మంలో రాబ్డయిట్లు అనే నిర్మాణాలు ఉంటాయి.
- కొన్నింటిలో నోరు ఉండదు.ఉదా: ఫెకాంఫియా,ఫేగోకాటాలో ఎన్నో గ్రసనులు,తత్ఫలితంగా ఎన్నో ఆస్య రంధ్రాలు ఏర్పడ్డాయి.నోరు ఉంటే ఉదర తలంలో ఉంటుంది.
- పునరుత్పత్తి అధికంగా ఉంటుంది.
- ఈ విభాగంలో ఇంత వరకు 3000 ప్రజాతులున్నాయి.
- ఇందులో ఎసీలా,పాలిక్లాడిడా,రాబ్డోసీలా,టెమ్నోసెపాల,ట్రైక్లాడిడా క్రమాలున్నాయి.
- ఉదా:ప్లానోసిరా,నోటోప్లాన,దయిసనోజూన్.
2. విభాగం 2:ట్రెమటోడా:
- ఇవి ఆకు లాగా పల్చగా,బల్ల పరుపుగా ఉండే జీవులు.
- ఇవి బాహ్య,అంతర పరాన్న జీవనం సాగిస్తాయి.
- అభివృద్ధిలో బాహ్య చర్మాన్ని కోల్పోయి అవభాసిని "టెగ్యుమెంట్" ఏర్పడుతుంది.
- రాబ్డయిట్లు లేవు.పూర్వాంతంలో నోరుంటుంది.
- విసర్జక వ్యవస్థలో శాఖాయుతమైన నాళాలు అమరి ఉంటాయి.
- ఒకే ఒక స్త్రీ బీజకోశం ఉంటుంది.
- అభివృద్ధి పరోక్షంగా డింభకాలతో జరుగుతుంది.
- ఉప విభాగం1:మోనోజెనియా:
- ఇవి చేపలు,ఉభయ చరాలపై బాహ్య పరాన్న జీవులు.
- నోటిని ఆవరించి చూషకం ఉండదు.
- పూర్వాంతంలో రెండు విసర్జక రంధ్రాలుంటాయి.
- గర్భాశయం పొట్టిగా ఉంటుంది.డింభకం శైలికాసహితం.
- జీవిత చరిత్ర నేరుగా ఆతిధేయిలను మార్చకుండా జరుగుతుంది.
- విభాగం 3: సెస్టోడా: ఉ. టీనియా, ఎకైనోకోకస్