ఫీల్డ్స్ పతకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫీల్డ్స్ పతకం
ఫీల్డ్స్ పతకం యొక్క ముఖ భాగం
ఎందుకు ఇస్తారుగణిత శాస్త్రం లో చేసిన విశేష కృషికి లభించే పురస్కారం
సమర్పణఇంటర్నేష్నల్ మేథమాటికల్ యూనియన్ ( ఐ ఎం యు)
బహుమానముC$15,000
మొదటి ప్రధానం1936 (1936)
చివరి ప్రధానం2010
అధికారక వెబ్‌సైటుwww.mathunion.org/general/prizes/fields/details

ఫీల్డ్స్ పతకం ప్రపంచంలోని యువ గణిత శాస్త్రవేత్తలకు లభించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బహుమతి. గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతిగా దీనిని పరిగణిస్తారు. 40 ఏండ్లు పైబడని ఇద్దరు, ముగ్గురు లేదా నలుగురు గణిత శాస్త్రవేత్తలకు, ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక సారి జరిగే ఇంటర్‌నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మేథమేటీషీయన్స్ (ఐసీఎం) సందర్భంగా ఈ పురస్కారం లభిస్తుంది. పతకంతోబాటు 15,000 కెనేడియన్ డాలర్లు కుడా ఇవ్వడం జరుగుతుంది. ఈ బహుమతి యొక్క ఆధికారిక నామం ఇంటర్నేష్నల్ మెడల్ ఫర్ ఔట్ స్టాండింగ్ డిస్కవరీస్ ఇన్ మాథమాటిక్స్ అయినప్పటికీ, దీనిని స్థాపించడానికి కృషి చేసి, ఆర్థిక వనరులను సమకూర్చిన జోన్ చార్ల్స్ ఫీల్డ్స్ యొక్క పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఫీల్డ్స్ పతకంగా గుర్తింపు పొందింది.

ఫీల్డ్స్ పురస్కారం మొట్టమొదటి సారి 1936లో ఫిన్లాండుకు చెందిన లార్స్ అల్ఫోర్స్ మరియు అమెరికాకు చెందిన జెస్సి డగ్లస్ లకు లభించింది. రెండో ప్రపంచ యుధ్ధం కారణంగా ఐసీఎం జరగకపోవడం చేత 1950 వరకు ఈ బహుమతి ఎవ్వరికీ దక్కలేదు. అటు తరువాత ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇవ్వబడుతూ వచ్చింది. ఇటీవలి కాలంలో ఐసీఎం 2010 లో హైదరబాదులో జరిగింది.

చరిత్ర[మార్చు]

1923లో టొరొంటొ విశ్వవిద్యాలయం చేత స్థాపించబడిన కమిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ కి ఫీల్డ్స్ అధ్యక్షత వహించారు. ఫీల్డ్స్ పతకం యొక్క ప్రస్తావన మొదటిసారిగా ఫిబ్రవరి 24, 1931న జరిగిన కమిటీ సమావేశంలో వచ్చినట్టుగా నమోదు చేయబడి ఉంది[1]. ప్రారంభంలో రెండు పతకాలు మరియు $2,500 నగదు బహుమానంగా నిర్ణయించడం జరిగింది. ఆ తరువాత ఫ్రాన్స్, జర్మనీ, మరియు ఇతర దేశాలలోని గణిత శాస్త్రవేత్తల బృందాల నుండి ఈ ఆలోచనకు మద్దతు లభించింది. ఈ విధంగా ఫీల్డ్స్ తన ఆలోచనను అమలుపరిచేందుకు ప్రణాళిక సిద్ధం చేసాడు. కానీ తన ప్రణాళిక కార్యరూపం దాల్చేముందే ఆగస్టు 9, 1932 న ఫీల్డ్స్ కన్ను మూసాడు. వీలునామాలో తన ఆస్తిలో నుండి $47,000 ఈ పతకం కొరకు ఫీల్డ్స్ సమకూర్చాడు [1]. ఈ పతకం ఏ ఒక్క వ్యక్తికిగానీ, దేశానికిగాని సంబంధం లేకుండా తగినంతవరకు నిష్పాక్షిక స్వభావం కలిగి ఉండాలని ఫీల్డ్స్ భావించాడు. అయినప్పటికీ ఈ పతకం యొక్క పేరు ఫీల్డ్స్ పతకంగా నిలిచిపోయింది.

ఆకృతి[మార్చు]

పతకం యొక్క వెనుక భాగం

ఫీల్డ్స్ పతకాన్ని కెనడాకు చెందిన రోబర్ట్ టేట్ మెక్కెంజీ అనే శిల్పి రూపొందించాడు. ఈ పతకం 9 సెంటిమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. పతకానికి ఒక వైపు కుడి వైపుకి తిరిగి ఉన్న గ్రీకు శాస్త్రవేత్త ఆర్కిమెడెస్ యొక్క ముఖము, గ్రీకు అక్షరములలో అతని పేరు, టేట్ మెక్కెంజీ యొక్క సంతకము ("RTM"), రోమన్ సంఖ్యామానంలో తేది ("MCMXXXIII" అనగా 1930) మరియు లాటిన్ అక్షరాలలో సామెత ("Transire suum pectus mundoque potiri" ) ఉంటాయి. పతకానికి మరో వైపు లాటిన్ భాషలో ఈ విధంగ ముద్రించబడి ఉంటుంది: CONGREGATI EX TOTO ORBE MATHEMATICI OB SCRIPTA INSIGNIA TRIBUERE దీని అర్ధము ఈ విధంగా ఉంటుంది: "ప్రపంచమంతటి నుండి హాజరు అయిన గణిత శాస్త్రవేత్తలు అత్యుత్తమ రచనలకు గాను ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు". పతకాన్ని అందుకునే శాస్త్రవేత్త పేరు పతకం అంచులో ముద్రించబడి ఉంటుంది[2].

గ్రహీతలు[మార్చు]

సంవత్సరం ఐసిఎం జరిగిన నగరం గ్రహీతలు[3]
1936 నార్వే ఓస్లో లార్స్ అల్ఫోర్స్
జెస్సి డగ్లస్
1950 సంయుక్త రాష్ట్రాలు కేంబ్రిడ్జ్ లారెంట్ స్క్వార్ట్జ్
అట్లె సెల్బెర్గ్
1954 నెదర్లాండ్స్ ఆంస్టర్‌డామ్ కునిహికొ కొడైర
జాన్-పియెరీ సెర్రీ
1958 United Kingdom ఎడిన్బర్గ్ క్లాస్ రోత్
రెనే థామ్
1962 Sweden స్టాక్‌హోమ్ లార్స్ హోర్మందర్
జాన్ మిల్నోర్
1966 సోవియట్ యూనియన్ మాస్కో మైఖేల్ ఆటియ
పాల్ జోసెఫ్ కోహెన్
అలెగ్జాండర్ గ్రోథెండీక్
స్టీఫెన్ స్మలె
1970 France నైస్ అలాన్ బేకర్
హేసుకె హెరొనక
సెర్గీ నొవికవ్
జాన్ జి థాంప్సన్
1974 Canada వాంకోవర్ ఎన్రికో బొంబెయెరీ
డేవిడ్ మంఫొర్డ్
1978 ఫిన్లాండ్ హెల్సింకి పియరీ దులిన్య్
చార్ల్స్ ఫెఫెర్మన్
గ్రిగొరీ మర్గులిస్
డేనియల్ క్వెల్లెన్
1982 Poland వార్సా అలైన్ కొన్న్
విలియం థర్స్టన్
షింగ్ టంగ్ యు
1986 సంయుక్త రాష్ట్రాలు బర్కిలీ సైమన్ డొనల్ద్సొన్
గెర్డ్ ఫల్టింగ్స్
మైఖేల్ ఫ్రీడ్మన్
1990 జపాన్ క్యొటొ వ్లాదిమిర్ డ్రింఫెల్డ్
వాన్ ఎఫ్ ఆర్ జోన్స్
షెజెఫ్యుమె మొరి
ఎడ్వర్డ్ విట్టెన్
1994 Switzerland జూరిఖ్ జాన్ బోర్గన్
పియరీ-లూయిస్ లయన్స్
జాన్-క్రిస్టోఫ్ యొక్కొజ్
ఎఫిం జెల్మనొవ్
1998 Germany బెర్లిన్ రిచర్డ్ బొర్చర్డ్స్
టిమొతి గౌవర్స్
మాగ్జిం కొంట్సెవిచ్
కర్టిస్ మక్ ముల్లెన్
2002 China బీజింగ్ లారెంట్ లఫోర్గ్
వ్లాదిమిర్ వొవొడ్స్కి
2006 Spain మాడ్రిడ్ ఆండ్రె ఒకుంకోవ్
గ్రిగోరి పెరెల్మాన్*
టెరెన్స్ టాఒ
వెండెలిన్ వెర్నెర్
2010 భారత హైదరాబాద్ ఈలన్ లిండెన్ స్ట్రౌస్
గొ బొ చౌ
స్టానిస్లావ్ స్మిర్నోవ్
సెడ్రిక్ విల్లని
2014 దక్షిణ కొరియా సియోల్ మంజుల్ భార్గవ
మార్టిన్ హైరర్
మరియం మిర్జాఖనీ

*గ్రిగోరి పెరెల్మాన్ ఈ పురస్కారాన్ని తిరస్కరించారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "The Early History of The Fields Medal" (PDF). Retrieved 3 November 2013. Cite web requires |website= (help)
  2. "The Fields Medal". The Fields Institute For Research in Mathematical Sciences. Retrieved 1 November 2013. Cite web requires |website= (help)
  3. "List of Fields Medallists". International Mathematical Union (IMU). Retrieved 1 November 2013. Cite web requires |website= (help)