Jump to content

మంజుల్ భార్గవ

వికీపీడియా నుండి
మంజుల్ భార్గవ
జననం (1974-08-08) 1974 ఆగస్టు 8 (వయసు 50)
హామిల్టన్, ఒంటారియో
జాతీయతకెనడా, యునైటెడ్ స్టేట్స్
వృత్తిసంస్థలుప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం
లైడెన్ విశ్వవిద్యాలయం
చదువుకున్న సంస్థలుహార్వర్డ్ విశ్వవిద్యాలయం
ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం
పరిశోధనా సలహాదారుడు(లు)ఆండ్రూ విలెస్
డాక్టొరల్ విద్యార్థులుమైఖేల్ వోల్‌పటో
మెలనీ వుడ్
ప్రసిద్ధిగాస్ కూర్పు చట్టాలు
15, 290 సిద్ధాంతాలు
ఫ్యాక్టోరియల్ ఫంక్షన్
దీర్ఘవృత్తాకార వక్ర రేఖల ర్యాంకులు
ముఖ్యమైన పురస్కారాలుఫీల్డ్స్ మెడల్ (2014)
ఇన్ఫోసిస్ బహుమతి (2012)
ఫెర్మాట్ బహుమతి (2011)
కోల్ బహుమతి (2008)
క్లే రీసెర్చ్ అవార్డు (2005)
SASTRA రామానుజన్ బహుమతి (2005)
హస్సీ బహుమతి (2003)
మోర్గాన్ బహుమతి (1996)
హోపెస్ బహుమతి (1996)

మంజుల్ భార్గవ (జననం: 08-08-1974) ఒక ఇండియన్ కెనడియన్ అమెరికన్ గణిత శాస్త్రవేత్త. సియోల్ లో జరిగిన అంతర్జాతీయ గణిత కాంగ్రెస్-2014లో 13-08-2014 న ఇతను గణిత నోబెల్ పురస్కారంగా పిలుచుకొనే "ఫీల్డ్స్ మెడల్"ను అందుకున్నాడు. గణిత శాస్త్రంలో అసమాన ప్రతిభ చూపిన వారికి ఈ ఫీల్డ్స్ మెడల్ లభిస్తుంది, దీని విజేత వయస్సు 40 సంవత్సరాలు దాటకూడదు, నాలుగు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే ఈ బహుమతిని ఇస్తారు. సంఖ్యా జ్యామితిలో శక్తిమంతమైన కొత్త విధానాలను అభివృద్ధి పరచినందుకు ఫీల్డ్స్ మెడల్ పురస్కారం భార్గవకు దక్కింది. ఈయన చిన్న శ్రేణి వలయాలను లెక్కించడానికి, దీర్ఘవృత్తాకార వంపుల సరాసరి శ్రేణి అవధిని నిర్ధరించడానికి సంఖ్యా జ్యామితిలో ఈ శక్తిమంతమైన కొత్త విధానాలను ఉపయోగించాడు. గణిత శాస్త్రంలో అపార నైపుణ్యమున్న ఇతను అనేక ప్రపంచస్థాయి బహుమతులను సొంతం చేసుకున్నాడు.

ఇండియన్ కెనడియన్ అమెరికన్

[మార్చు]

భార్గవ 1974లో కెనడాలో జన్మించాడు, అమెరికాలో పెరిగాడు, అలాగే మధ్యమధ్యలో కొంతకాలం భారత్ లోనూ గడిపాడు.

విద్య

[మార్చు]

2001లో అమెరికాలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పొందిన భార్గవ అదే యూనివర్సిటీలో 2003 నుంచి ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  • ఈనాడు దినపత్రిక - 16-08-2014 (రాగం.. తాళం.. గణితం బహుముఖ ప్రజ్ఞావంతుడు మంజుల్ భార్గవ)