ఎస్.ఎస్.శ్రీఖండే
శరత్‌చంద్ర ఎస్.శ్రీఖండే | |
---|---|
జననం | Sagar, Madhya Pradesh, India | 1917 అక్టోబరు 19
నివాసం | భారతదేశము |
పౌరసత్వం | భారతీయుడు |
రంగములు | Combinatorics |
వృత్తిసంస్థలు | ముంబై విశ్వవిద్యాలయం ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయం |
చదువుకున్న సంస్థలు | University of North Carolina, Chapel Hill |
పరిశోధనా సలహాదారుడు(లు) | రాజ్ చంద్ర బోస్ |
ప్రసిద్ధి | Euler's conjecture |
శరత్ చంద్ర శంకర్ శ్రీఖండే (1917 అక్టోబరు 19 - 2020 ఏప్రిల్ 21) భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన "సంయోగ గణితశాస్త్రం"లో ప్రత్యేకమైన , బాగా గుర్తింపు పొందిన విజయాలు సాధించారు. ఆయన ఆర్.సి.బోస్ , ఇ.టి.పార్కర్ లతో కలసి "ప్రతి n విలువకు 4n + 2 వర్గం ఆర్థోగోనల్ లాటిన్ చదరములు రెండు వ్యవస్థితములు కావు" అనే సూత్రమునకు 1782 లో లియొనార్డ్ ఆయిలర్ చేయని నిరూపణను చేసి విశేష గుర్తింపు పొందారు.[1] శ్రీఖండే గణిత శాస్త్రంలో "సంయోగాలు", సాంఖ్యక శాస్త్ర డిసైన్లులో ప్రత్యేకతను సంతరించుకున్నారు. శ్రీఖండే గ్రాఫ్ [2] సాంఖ్యక శాస్త్ర డిజైన్లలో ఉపయోగిస్తున్నారు.
శ్రీఖండే 1950 లో చాపెల్ హిల్ల్ లోని నార్త్ కారొలినా విశ్వవిద్యాలయంలో శ్రీ ఆర్.సి.బోస్ గారి ఆధ్వర్యంలో పి.హెచ్.డిని పొందారు. ఆయన యు.ఎస్.ఎ, భారతదేశములలో వివిధ విశ్వవిద్యాలయాలలో బోధన చేశారు.[3]
శ్రీఖండే బానారస్ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేశారు. ముంబై విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర విభాగానికి అధిపతిగా కూడా యున్నారు. ఈయన సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీకి డైరక్టరుగా యున్నారు. ఆయన 1978 లో పదవీవిరమణ చేసిన వరకు ఆ పదవిలోనే కొనసాగారు. ఈయన "ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ", "ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్", యు.ఎస్.ఎ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాథమెటిక్స్ ఇనిస్టిట్యూట్ లలో ఫెలోగా యున్నారు.
ఆయన కుమారుదు మోహన్ శ్రీఖండే[4] మిచిగాన్ లోని మౌంట్ ప్లెజంట్ నందుగల సెంట్రల్ మిచిగాన్ విశ్వవిద్యాలయంలో సంయోగ గణిత శాస్త్రంలో ప్రొఫెసర్ గా యున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ Osmundsen, John A. (April 26, 1959), Major Mathematical Conjecture Propounded 177 Years Ago Is Disproved, New York Times. Scan of full article.
- ↑ "Shrikhande graph". Archived from the original on 2014-03-09. Retrieved 2014-01-26.
- ↑ "Prof. S. S. Shrikhande – An Outstanding Statistician", Statistical Newsletter, XXVIII (3): 3, July–September 2003, archived from the original on 2008-01-04, retrieved 2014-01-26
{{citation}}
: CS1 maint: date format (link). - ↑ "M. S. Shrikhande". Archived from the original on 2009-10-12. Retrieved 2014-01-26.
- భారతీయ గణిత శాస్త్రవేత్తలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with DBLP identifiers
- 1917 జననాలు
- 2020 మరణాలు
- భారతీయ గణాంక శాస్త్రవేత్తలు
- 20వ శతాబ్ద గణిత శాస్త్రవేత్తలు
- నాగపూర్ వ్యక్తులు
- Combinatorialists
- University of North Carolina at Chapel Hill faculty
- University of North Carolina at Chapel Hill alumni