సంతోష్ వెంపల
సంతోష్ వెంపల | |
---|---|
జననం | విశాఖపట్నం, భారతదేశం | 1971 అక్టోబరు 18
నివాసం | అట్లాంటా, జార్జియా |
రంగములు | కంప్యూటరు విజ్ఞానం |
వృత్తిసంస్థలు | ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ జార్జియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ |
చదువుకున్న సంస్థలు | కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం |
పరిశోధనా సలహాదారుడు(లు) | అవిరిం బ్లం |
ముఖ్యమైన పురస్కారాలు | కంప్యూటర్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీ యొక్క ఫెలోషిప్ (2015) |
సంతోష్ వెంపల (జననం18 అక్టోబరు 1971) భారతదేశానికి చెందిన కంప్యూటరు శాస్త్రవేత్త. ఆయన జార్జియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో కంప్యూటరు సైన్స్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. ఆయన థియరిటికల్ కంప్యూటరు సైన్స్ రంగంలో ప్రధానంగా కృషి చేస్తున్నారు.[1][2]
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన తన పి.హెచ్.డి కోసం 1997లో కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయంలో చేరారు. ఈ పి.హెచ్.డి ని అవ్రిం బ్లం అనే ప్రొఫెసర్ వద్ద చేసారు.[3]
1997లో బెర్కెలీ వద్ద మిలెర్ ఫెలోషిప్ పొందారు. అదేవిధంగా ఆయన 2006లో జార్జియా టెక్ కు వెళ్ళినంత వరకు ఎం.ఐ.టి లో ప్రొఫెసరుగా తన సేవలనందించారు.
పనులు
[మార్చు]ఆయన ప్రధానంగా "థియరిటికల్ కంప్యూటర్ సైన్స్" రంగంలో తన కృషిని కొనసాగించారు. ప్రత్యేకంగా ఆయన "ఆల్గరిథిమ్స్", "రాండమైజ్డ్ ఆల్గరిథిమ్స్", "కంప్యూటేషనల్ జామెట్రీ", "కంఫ్యుటేషనల్ లెర్నింగ్ థియరీ" వంటి రంగాలలొ విశేష సేవలనందిస్తున్నారు. ఆయన రాండం ప్రొజెక్షన్[1] , స్పెక్ట్రల్ మెథడ్స్.[2] లపై పుస్తకాలను రచించాడు.
2008లో ఆయన జార్జియా టెక్ అద్ద కంప్యూటింగ్ ఫర్ గుడ్ (C4G)[4] ప్రోగ్రామ్ కు సహ వ్యాస్థాపకునిగా ఉన్నారు.
పురస్కారాలు, గౌరవాలు
[మార్చు]ఆయన అనేక పురస్కారములు పొందారు. వాటిలో గుట్టెన్‌హీం ఫెలోషిప్, సోయాన్ ఫెలోషిప్, "జార్జియా ట్రెండ్స్" జాబితాలో స్థానం పొందారు.[5]
ఆయన "కుంభాకార సమితులు, సంభావ్యత విభజనం ల కొరకు ఆల్గరిథమ్స్ యొక్క కృషికి" ఎ.సి.ఎం ఫెలోషిప్ ను 2015లో పొందారు..[6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 S. Vempala, ``The Random Projection Method", American Mathematical Society, 2004.
- ↑ 2.0 2.1 R. Kannan and S. Vempala,``Spectral Algorithms, Now Publishers Inc., 2009.
- ↑ మూస:Mathgenealogy.
- ↑ "Computing for Good". Archived from the original on 2012-11-01. Retrieved 2016-11-19.
- ↑ “Georgia Trend 40 Under 40,” Georgia Trend Magazine, October 2010
- ↑ "ACM Fellows Named for Computing Innovations that Are Advancing Technology in the Digital Age". ACM. 8 December 2015. Archived from the original on 9 డిసెంబరు 2015. Retrieved 9 December 2015.
ఇతర లింకులు
[మార్చు]- భారతీయ గణిత శాస్త్రవేత్తలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with ORCID identifiers
- Wikipedia articles with DBLP identifiers
- Wikipedia articles with ACM-DL identifiers
- 1971 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- American male scientists of Indian descent
- విశాఖపట్నం జిల్లా శాస్త్రవేత్తలు