సర్వదమన్ చౌలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్వదమన్ చౌలా
జననం(1907-10-22)1907 అక్టోబరు 22
లండన్, ఇంగ్లాండ్
మరణం1995 డిసెంబరు 10(1995-12-10) (వయస్సు 88)
Laramie, Wyoming, United States
రంగములుగణిత శాస్త్రము
విద్యాసంస్థలుInstitute for Advanced Study
University of Kansas
University of Colorado at Boulder
Penn State University
చదువుకున్న సంస్థలుCambridge University
పరిశోధనా సలహాదారుడు(లు)John Edensor Littlewood
డాక్టొరల్ విద్యార్థులుJohn Friedlander
ముఖ్యమైన పురస్కారాలుPadma Bhushan

సర్వదమన్ చౌలా (అక్టోబరు 22 1907 - డిసెంబరు 10 1995) ఇందియన్ అమెరికన్ గణిత శాస్త్రవేత్త. ఈయన "నంబర్ థియరీ" లో ప్రసిద్ధుడు.

ప్రారంభ జీవితం[మార్చు]

ఈయన లండన్ లో జన్మించారు. ఈయన తండ్రి గోపాల్ చౌలా లాహోర్ లో గణిత శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేశారు. సర్వదమన్ చౌలా కేంబ్రిడ్జ్ లో చదువుకున్నారు. ఆయన కుటుంబం భారత దేశానికి తిరిగివచ్చింది. లాహోర్ లోని ప్రభుత్వ కళాశాలలో 1928 లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.1931 లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ ను పొందారు. ఈయన డాక్టరేట్ ను జె.ఇ.లిటిల్ ఉడ్ అధ్వర్యంలో చేశారు. [1]:594

జీవితం, అవార్డులు[మార్చు]

చౌలా భారత దేశానికి వచ్చిన తరువాత అనేక విశ్వవిద్యాలయాలలో బోధించారు. 1936 లో ప్రభుత్వకళాశాలలో గణిత శాస్త్ర అధిపతిగా ఉన్నారు.[1]:594 1947 లో భారత దేశ విభజన జరిగినపుడు ఏర్పడిన సమస్యల మూలంగా ఆయన యునైటెడ్ స్టేట్స్ కు వెళ్ళిపోయాడు.[2] అచట "ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ " సంస్థను 1949 లో దాని పతనం అయ్యే వరకు సందర్శించారు. అపుడు ఆయన లారెన్స్ లోని కనాస్ విశ్వవిద్యాలయం లో బోధించారు. ఈ సంస్థ 1952 లో కొలొరాడో విశ్వవిద్యాలయంగా మారే వరకు బోధన కొనసాగించారు.[1]:594 ఆయన 1963 లో పెన్న్ రాష్ట్రంలో పరిశోధనా ప్రొఫెసర్ గా యున్నారు. ఇచట 1976 లో తాను పదవీవిరమణ చేసే వరకు కొనసాగారు.[1]:594 ఆయన ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ లో సభ్యునిగా యుండి భారత దేశ అత్యున్నత పురస్కారం అయిన పద్మభూషణ్ ను పొందారు..[1]:595

ఆయన చేసిన వివిధ సేవలలోని ఫలితాలకు ఆయన పేరుతోనే సూచించారు. యివి బ్రుక్-చౌలా-రైసెర్ సిద్ధాంతము, అంకినీ-అర్టిన్-చౌలా సరూపత, , చౌలా-మొర్డెల్ సిద్ధాంతం, , చౌలా-సెల్‌బర్గ్ సూత్రము, చౌలా సీక్వెన్స్.

పనులు[మార్చు]

  • Chowla, Sarvadaman (2000). The Collected Papers of Sarvadaman Chowla. Montréal: Centre de Recherches mathématiques, Université de Montréal. OCLC 43730416. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
  • Chowla, S. (1965). Riemann Hypothesis and Hilbert's Tenth Problem. New York: Routledge. ISBN 978-0-677-00140-1. OCLC 15428640.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 Ayoub, Raymond G. (1998). "Sarvadaman Chowla (1907-1995)" (PDF). Notices of the American Mathematical Society. Providence, RI: American Mathematical Society. 45 (5): 594–598. ISSN 0002-9920. OCLC 1480366. Retrieved 2008-05-16. Unknown parameter |month= ignored (help); Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
  2. O'Connor, John J.; Robertson, Edmund F., "సర్వదమన్ చౌలా", MacTutor History of Mathematics archive, University of St Andrews.

ఇతర లింకులు[మార్చు]