ఆచార్య హేమచంద్రుడు
ఆచార్య హేమచంద్రుడు (సంస్కృతం: हेमचन्द्र सूरी, 1087–1172) జైన మతానికి చెందిన ఆచార్యుడు, కవి, బహుశాస్త్రజ్ఙుడు. ఈయన వ్యాకరణ శాస్త్రము, తత్వశాస్త్రము, ఛందస్సు, సమకాలీన చరిత్ర వంటి గ్రంథాలను వ్రాసాడు. సమకాలీనులలో అద్భుతమైన వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు. ఆయనకు "కలికాల సర్వజ్ఞ" అనే బిరుదు ఉంది. దీనిఅర్థము కలియుగంలో అన్ని విషయాలు తెలిసినవాడు.
ఆయన గుజరాత్ రాష్ట్రం లోని "ఢంఢుక" (అహ్మదాబాద్ దక్షిణ ప్రాంతం నుండి 100 కి.మీ. దూరంలో) గ్రామములో చాచాదేవ, పాహినీ దేవిలకు జన్మించాడు. వారు అతనికి "చంద్రదేవ" అని నామకరణం చేసిరి. ఆయన జన్మ ప్రదేశంలో జైన తీర్థం అయిన మొథీరా ఉంది.ఆయన యువకునిగా ఉన్నపుడు "దెరసార్" వద్ద సన్యాసి దీక్షను ప్రారంభించి తన పేరును "సోమచంద్ర"గా మార్చుకున్నాడు. ఆయన మత గ్రంథములు, తత్వ శాస్త్రము, తర్క శాస్త్రము , వ్యాకరణ శాస్త్రముల పై శిక్షణ పొందాడు. సా.శ.1110 లో తన 21 వ సంవత్సరంలో ఆయన జైనుల లో శ్వేతాంబరుల ఆచార్యునిగా గుర్తింపబడ్డాడు. ఆయనకు సోమచంద్రుడుగా నామకరణం జరిగింది. ప్రస్తుతం హేమచంద్రునిగా ప్రజాదరణ పొందింది.[1]
ఆ సమయంలో గుజరాత్ ప్రాంతం "సోలంకి" రాజ్య పరిపాలనలో ఉంది. హేమచంద్రుడు "ముల్రాజు" యొక్క రాజ్యపాలనలో గొప్పతనాన్ని గుర్తించి ఆయన తర్వాత రాజు అయిన "కుమార్‌పాల్" (1143–1173) రాజుకు సహాయకునిగా ఉన్నాడు. కుమారపాలుని ఏలుబడిలో గుజరాత్ ప్రాంతం సంస్కృతికి కేంద్రబిందువైనది. 1121 మొదట్లో హేమచంద్రుడు "తరంగ" వద్ద నిర్మింపబడిన జైన మందిరం నిర్మాణంలో పాలుపంచుకున్నాడు. కుమారపాల మహారాజుపై ఈయన ప్రభావంతో జైన మతము గుజరాత్లో అధికార మతముగా విలసిల్లింది. ఆ కాలంలో జంతుబలులను నిషేధించారు.
హేమచంద్రుడు , కుమారపాలుడు
[మార్చు]అనేకాంతవాదం లోనికి ప్రవేశించిన తర్వాత ఆచార్య హేమచంద్రుడు విశాల దృక్పథాన్ని కలిగియుండాలని ప్రబోధించాడు. ఈ బోధన కుమారపాలునికి యిష్టపడింది.[1] ఆయనకు కుమారపాలుని వద్ద గల గౌరవం,, కీర్తికి అసూయ చెందిన కొందరు ఆయనకు అహంకార స్వభావం ఎక్కువని రాజుకు ఫిర్యాదు చేశారు. ఆయన హిందూ దేవతలను గౌరవించడని, శివుని వద్ద తన శిరసును వంచి నమస్కరించడని పిర్యాదుచేశారు. రాజుగారు హేమచంద్రుడిని శివాలయ దర్శనార్థం పిలిచినపుడు ఆయన శివుని విగ్రహానికి నమస్కారములు పెట్టి యిలా అన్నాడు.
“ | నేను ఏ దేవుడయితే లౌకిక జీవితంలో మనోవికారాలను , ద్వేషాలను నిర్మూలిస్తాడో ఆ దేవుడికి శిరసు వంచి నమస్కారము చేస్తాను. అది బ్రహ్మ , విష్ణు లేదా జినూడైనా నమస్కరిస్తాను.[1] | ” |
దీనిని బట్టి ఆయన జైన సిద్ధాంతం లోని సత్యాన్ని అనగా జైనులు ద్వేషాలకు అతీతంగా గల దేవుని మాత్రమే నమస్కరిస్తారు అనే సత్యాన్ని తెలియజేశాడు. అలా మనోవికారాలకు, రాగద్వేషాలకు అతీతంగా ఉన్న దేవుని "జినుడు" అన్నాడు. అదే సమయంలో రాజును సమాధానపరిచాడు. అప్పటి నుండి రాజు హేమచంద్రునికి భక్తునిగా మారిపోయాడు. అతడు జైన మత పక్షపాతి అయినాడు.[1]
చేసిన పనులు
[మార్చు]ఒక అద్భుతమైన రచయితగా ఆయన సంస్కృత, ప్రాకృత వ్యాకరణ శాస్త్రాలను వ్రాసాడు. విజ్ఞాన శాస్త్ర, తర్క శాస్త్ర విషయాలను, భారత తత్వ శాస్త్రములో వివిధ శాఖల ప్రయోగాత్మక పద్ధతులను వ్రాసాడు. ఆయన ముఖ్యమైన రచన మహా కావ్య పద్యమాల "త్రి షష్టి షాలక పురుష చరిత్ర" (63 మంది గొప్పవ్యక్తుల జీవిత చరిత్రలు). ఇందులో జైన మతములో గురువులు, విద్యార్థులు వారి జైన మతములో స్థానములు, వారి మరణాలు, పునర్జన్మాలు వంటి విషయాలను వ్రాశాడు. ప్రస్తుతం కూడా జైన చరిత్రలో విషయ సంశ్లేషణ స్థాయి కలిగి యున్న గ్రంథం అది.
యితర రచనలు
[మార్చు]- Kavyanushasana: poetics or hand book of poetry/manual of poetry.
- Desinamamala: a list of words of local origin
- Siddha-haima-shabdanushasana: Prakrit and Apabhramsha grammars
- Abhidhana-chintamani
- Dvyashraya-Mahakavya
Hemachandra, following the earlier Gopala, presented an earlier version of the Fibonacci sequence. It was presented around 1150, about fifty years before Fibonacci (1202). He was considering the number of cadences of length n, and showed that these could be formed by adding a short syllable to a cadence of length n − 1, or a long syllable to one of n − 2. This recursion relation F (n) = F (n − 1) + F (n − 2) is what defines the Fibonacci sequence.[2][3]
ఇవి కూడా చూడండి
[మార్చు]సూచికలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "Hemacandra". Jain World. Archived from the original on 2008-05-09. Retrieved 2013-06-04.
- ↑ Thomas Koshy (2001). Fibonacci and Lucas numbers with applications. John Wiley & Sons.
... before Fibonacci proposed the problem; they were given by Virahanka (between 600 and 800 AD), Gopala (prior to 1 135 AD), ...
- ↑ Philip Tetlow (2007). The Web's awake: an introduction to the field of Web science and the concept. John Wiley & Sons. ISBN 0-470-13794-0.
This sequence was first described by the Indian mathematicians Gopala and Hemachandra in 1150, who were investigating the possible ways of exactly packing items of length 1 and 2 into containers. In the West it was first studied by ...