లంబాడి

వికీపీడియా నుండి
(బంజార నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


కృతయుగము నుండి కలియుగ వరుకు వారి వంశ కల్పము వస్తూనే యున్నది బంజారా, లంబాడీ సూర్య వంశ క్షత్రియులు గా పిలవ బడే కుల దేవుని కొన్ని అవతారలు :- దేవేంద్రుడు, సూర్యదేవుడు ,వాసుదేవుడు( కృష్ణుడు తండ్రి )గరుడ దేవుడు,భువనేంద్ర, భూమి పుత్ర, పరమాత్మ, దేవా, దేవరాజ్,సింహనరేంద్ర(ధర్మ పురిలో ఉగ్ర సింహుడిగా అవతరించాడు )ధర్మేంద్ర, మహీంద్రా, నాగేంద్ర, ఇంద్ర కేశవ, మునిరాజు,ఆధిపతి,వాసుదేవుడు,అర్జునుడు, లక్ష్మణుడు, వేణుగోపాలస్వామి, భృగు మహర్షి, సప్త ఋషులు(వారి అవతారం అది శేషులు), బుద్దా దేవుడు,(బంజారాలు బౌద్ధు లుగా ఉన్నపుడు వారి రాజధాని రాజస్థాన్) ఇంద్ర బటారిక (కర్ణాటక చాలుక్య రాజ్యం) ,గోనే (ఆవుల మంద) రుద్రదేవుడు (శిల్ప బ్రహ్మ )తూర్పు చాలుక్యూడైనా వెయ్యి స్తంభాల గుడి త్రికూట లేదా త్రిలింగం 1, ఇంద్ర లింగం 2, విష్ణు లింగం,3, శివ లింగం గుర్తు గా ఆలయం కట్టించాడు సృష్టి,పాలి స్థితి,లయ,,అతని కోట మహబూబ్ నగర్ ఘనపూర్ కోట , అతనే గోనెమహరాజ్,గోనే బుద్దా,గోనేంద్ర స్వామి,గోనేంద్రుడు,గోనెంద్ర,గోనే దేవుడు, బాలాజీ,(అంటే 12 సంవత్సరాల బాల వయస్సు లో హతి రామ్ బావాజీ కి దర్శనం ఇచ్చాడు )పేర్లతో పిలవబడతాడు,ఇతని కుమారుడే హతి రామ్ బావాజీ,,,,,! బల్జా, బలియావాల్ ,బంజార, లంబాడి ఇలా క్రమంగా మారిపోయిన పేర్లు

ఇప్పుడు తిరుపతిలో హాథీరాం భావాజీ 11 వ శాంతబ్దం లో గోనే మహారాజ్ మఠం వారి భవనము
హాథీరాం భావాజీ శ్రీ వారితొ పాచికలాడుతున్న దృశ్య., తిరుమలలోని చిత్రం

భారత దేశ చరిత్ర సంస్కృతి ఒక వైపు,, సంస్కృతి సంప్రదాయాలు ఒక వైపు.... ప్రదానంగా బంజారా తెగ జీవనవిధానం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు వారి పూర్వీకుల జీవన అనుభవాలతో ముడిపడిన అంశం.... బంజార పూర్వికులు వారి కుల దేవుడు వాలి సుగ్రీవు ల తండ్రి దేవా దేవేంద్రుడు (ఇంద్రుడు) ఏడు రంగులు అంటే ఇంద్ర ధనస్సు ఏడు రంగుల చీర దాన్ని గుర్తు గా "సీతలా వాసిడో" (గొడ్ల దాటుడు పండుగ) జరుపు కుంటారు. ఏడు గురి అమ్మవార్ల ను మొక్కు తారు ఒక మహోన్నత ఆలోచన తో లంబాడీల సంస్కృతి కాపాడడం కోసం తండాలను తమ నివాసాలుగా చేసుకున్నారు... లంబాడీలది ప్రాచీన సంస్కృతి,, అడవులలో పశువుల పోషణ వీరి జీవన ఆధారము. తాండా ప్రజలు ఒక ప్రత్యేక గౌరవాన్ని, నాయకత్వం, పంచాయతీ వ్యవస్థ, ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలు,పండుగలను కలిగి ఉన్నారు. బ్రిటిష్ రాజ్యం లో లంబాడీ తెగ గా పిలువ బడ్డారు వారు పవిత్రమైన ఆచారాలను కలిగి ఉంటారు. లంబాడీలు సంతలో కానీ బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఏడుస్తారు. దీనికి ఒక చరిత్ర ఉంది, లంబాడీలు తెలంగాణ ప్రాంతం నుండి గోదావరి నది దాటి ఛత్తీస్గడ్,మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు పశువులను తీసుకొని వెళ్లే వారు, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళినవారు అందరు తిరిగి వచ్చేవారు కాదు కొంతమంది చనిపోయే వారు వారిని తలుచుకొని వారు ఏడుస్తారు. ఈ దృశ్యం కంట కన్నీళ్లు పెట్టిస్తుంది. లంబాడీ తెగ ప్రజల నుండి బయట సమాజం చాలా నేర్చుకోవాలి.

పూర్వం తాండాలో లంబాడీలు నైతికవిలువలు, మానవీయ విలువలు పాటించి వారి సంస్కృతి ని పరిరక్షించుకున్నారు. కానీ ఈ ప్రజల గురించి ఏ మత గ్రంధాలు, ఏ చరిత్ర కారులు, ఏ పుస్తకాలలో రాయలేదు. ఏ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం. ఈ నాగరిక సమాజంలో పూర్వం నుండి మోసపోతూనె ఉన్నారు.... గిరిజనులలో మూఢనమ్మకాలు ఎక్కువ లంబాడీలు శారీకంగా భారీ మనుసులు. దృడమైన శరీరం కలిగి ఎత్తుగా ఉంటారు, వారిని చుసిన బ్రిటిష్ ప్రభుత్వం Long Bodies అని పేరు పెటింది. దీని నుండి లంబాడీ అనే పేరు వచ్చింది. వీరు అత్యంత ప్రమాదకర గిరిజనులు అని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం Criminal Tribe Act అమలులోకి తెచ్చింది, ఈ చట్టం ఉద్దేశం లంబాడీ లు బ్రిటిష్ సైనికులను చంపారు కావున లంబాడీ లు నేరస్థలు.. కావున వారిని బందించామని బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశించింది. అప్పుడు బ్రిటిష్ వారు అడవిలోని లంబాడీల తాండాలపై పడడంతో, లంబాడీలు అడవులలో పారిపోయారు. వారి పై ఎవరు దాడి చేసిన మా ప్రజలను, మా సమాజాన్ని నాశనం చేస్తారేమోనని పోరాడుతారు ఈ సిద్ధాతం లంబాడీ తెగ కూడా పాటించింది. ఆలా బ్రిటిష్ వారి నుండీ పారిపోయి అడవులలో సంచార జీవనం కొనసాగించి. సంచార తెగగా లంబాడి లు పిలవపడుతున్నారు. ఒక లంబాడీలు మాత్రమే కాదు, ఏ తెగ వారు ఐనా సరే ఆహారం,, జీవన మనుగడ కోసం సంచరిస్తూనే ఉంటారు. ప్రస్తుతం తెలంగాణ లో తండాలు, గుడాలు, నిర్మించుకొని స్థిర నివాసం ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు.లంబాడిలు అడవినే నమ్ముకొని తమ పశువులు మేపడానికి, తమ వ్యవసాయం చేయడానికి,జీవనం కోసం అడవి ఉత్పతుల మీద ఆధారపడి జీవించారు. బయట సమాజం గురించి తెలియక ఇతర ప్రజలతో కలవక లంబాడీలు ఎన్నో కష్టాలు పడ్డారు. లంబాడీల సంస్కృతీ సంప్రదాయాలు కట్టుబాట్లు ఎంతో గొప్పనైనవి ప్రత్యేకమైనవి. వీరినే లంబాడీ, సుగాలీ లమ్మాణీ బంజారాలు అని కూడా అంటారు. వీరి నివాస ప్రాంతాలను తాండాలు అంటారు. పూర్వం వరిచేలలో కుప్ప నూర్పిళ్ళప్పుడు ధాన్యం కల్లాలు తొక్కించటానికి ఆవుల్ని తోలుకొచ్చేవాళ్ళు. లంబాడీ భాష కు లిపి లేదు. సవర భాష దీనికి కొంచెం దగ్గరగా ఉంటుందంటారు.

లంబాడీలు ఈప్పటికి కూడా తాండాలలో తమ ఆచార వ్యవహారాలను పాటిస్తూనే ఉన్నారు. లంబాడీ పూర్వికులు ఉండడానికి తాండాలను నెలకొల్పి లంబాడీ సంస్కృతిని కాపాడేలా చేసారు. ఈ తాండాలు జనావాసానికి దూరంగా నిర్మించుకున్నారు. అంటే బయట ఎంత పెద్దవారు ఐనా ఎంత గొప్పవారు ఐనా, తాండాలో వచ్చి ఎలాంటి కొత్త పద్ధతులు, సిద్ధాంతాలు, లంబాడీలపై రుద్దడానికి వీలులేదు, కావున తాండా బయటి మనసులను రాణించే వారు కాదు. తాండా నాయక్ (తాండా పెద్ద ) ఏం చెప్తే అదే లంబాడీ ప్రజలకు వేదం. ఒక వ్యక్తి లేదా ప్రజలు జనావాసానికి దూరంగా ఉంటున్నారు,అంటే వారిలో ఎదో ప్రత్యేకం ఉంది అని అర్ధం. లంబాడీలలో పుట్టినప్పటి నుండీ చనిపోయేవరకు సంస్కృతీ, సంప్రదాయాలు,కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, జీవనవిధానం, పెళ్లి,, చావు, అన్ని ప్రత్యేకమైనవే. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో వీరి సంస్కృతి,బాషా కనుమరుగవుతున్నాయి, వీరి సంసృతి సంప్రదాయాలను రక్షించడం అందరి బాధ్యత.

లంబాడీల దేవతలు

[మార్చు]

తండాలో ఏ కార్యం జరిగినా పెళ్ళి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెళ్ళి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు శ్రీ గోనే మహారాజ్ దేవేంద్రుడి అంశ (ఇంద్ర)ఇంద్ర ధనస్సు 🏹

🏳️‍🌈

1,బాగేమ్మ(తోల్జా బవాని) 2, ఆరేమ్మ(మేరామ్మ) 3, అంబామ్మ(అంబ బవాని) 4,ఆమ్లఖా(హింగ్లా బవాని) 5,యసోదమ్మ(సత్తిభవాని) 6, దానిమ్మ(ద్వాలా బవాని) 7, కమలఖా(కాంత&కేంకలిబవాని) ఏడు భవానిలు( సీత్లా వాసిడో )పండగమేరమ్మ, త్వళ్జ, సీత్ల, మంత్రల్, హింగ్ల, ధ్వాళ్ ఆంగళ్, కంకాళీ.

వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి, పెళ్ళికాని అమ్మాయిలకు మంచి కాపురం దొరకాలి. సుఖ సంతోషాలతో అత్తగారి ఇంటికి వెళ్ళాలి, పంటలు పండేవిధంగా పచ్చగా కాపురం ఉండాలని మేరమ్మను కోరుకుంటారు. తీజ్ 9 రోజులు జరుపుకుంటారు. నవధాన్యాలు బుట్టలో వేసి మొలకతీస్తారు. ఏ మొలక బాగా వస్తుందో ఆ పంట వేసుకోవాలని తండాలో పెద్దలు నిర్ణయిస్తారు. శాస్త్రీయంగా విత్తనాలు వేసుకుంటారు. పంటలు పండిస్తారు.

పండిన పంట ఇంటికి తీసుకొస్తే నవధాన్యాలు గుమ్మాలు, గాదెలు నిండే ఉండే విధంగా ఉండాలని కష్టాలు రాకుండా కాచుకోవాలని పూజిస్తారు. అల్లుళ్లు, బిడ్డలు చుట్టాలంతా రావాలని, కలుసుకోవాలని, కొడుకులకు, కోడళ్లకు పిల్లలు పుట్టాలని (దసరాఏర్ దాడో) ఈ దేవతకు ఇష్టమైన రోజు అని భావించి అమ్మవారి ప్రసాదం(హడ్క)గా స్వీకరించి త్వల్జా భవానిని వేడుకుంటూ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. దేశంలోని ప్రజలు దసరా పండుగ రోజున దేవి శరన్నవరాత్రులతో ఉత్సాహంగా జరుపుకుంటే, బంజారాలు మాత్రం అదే పండుగను వారి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా "దస్రావ్" ను నిష్ఠతో జరుపుకుంటారు.

తండాలో ఉన్న పశువులు, గొర్ర్లు, మేకలు, కోళ్లు, పశుసంపద పెరగాలని, దూళ్ళకు పాలు సరిపోను ఉండాలని గడ్డి బాగా దొరకాలని క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలని అటవీ సంపద తరగకూడదని, మొక్కులు తీర్చుకుంటారు.అలాగే తాండాలో అనారోగ్యాలకు గురి కాకుండా , వ్యాధుల నుండి రక్షణగా నిలవడానికి ఈ పూజని ఎక్కువగా ఆషాడ మాసంలో చేస్తారు

ఇతర ఊర్లలో ఉండే రోగాలు, కష్టాలు, జబ్బులు, గత్తెరలాంటివి తండాల పొలిమేర వరకు రాకూడదని శుభ్రం చేసుకుంటూ పూజిస్తారు.

పుట్టే ప్రతి పిల్లతో పాటు తల్లి తండా ఆరోగ్యంగా ఉండాలని పుట్టిన ప్రతి వారు అన్ని విధాల దృఢంగా ఉండాలని తిండి, అలవాట్లు మెరుగుపర్చుకొని బిడ్డను కాపాడాలని మొక్కుకుంటారు.

అడవిలో ఉండే పక్షులు, జంతువులు బాగుండాలని వన సంరక్షణలో జంతువులు కాపాడబడాలని పాలపిట్ట, పక్షి రోజు తండాకు కనబడిపోవాలని ఆరాధిస్తారు.

మానవునిపై ధాన్యాలపై పశు సంపదలపై ఎటువంటి శత్రువుల దాడి కుట్రలు జరగకుండా దరిచేరకుండా ఉండేందుకు బాధ్యతగా చూసుకోవాలని మొక్కుకుంటారు లంబాడీలు. పెళ్ళి అయిన అమ్మాయిలకు ఒక తులం బంగారం ఒక కిలో వెండి 12 రూపాయి నాణేలతో దండ, కొంకుణాలు, చేతివేళ్ళకు మేరికలు, రైకలు, లంగాల నిండా అద్దాలు, గవ్వలు, తెల్లటి గాజులు చేతినిండా ఉండేవి. పెళ్ళి అయిన అమ్మాయి ఇంట్లోకి వస్తే లక్ష్మి వచ్చింది అనేది అనాడు లంబాడీల విశ్వాసం.

లాంబాడీ సంస్కృతిపై దాడి

[మార్చు]

కొత్త పేర్లు కొత్త రూపాల్లో పండుగలు తండాలలోకి ప్రవేశిస్తున్నాయి. తండా సంస్కృతిని ధ్వంసం చేయడం జరుగుతోంది. ఆర్థికంగా సామాజికంగా వీరిని మరింత ఇబ్బందుల్లో పడేసే విధంగా మూఢనమ్మకాలను నమ్మిస్తున్నారు. ఇదంతా వారి జీవన విధానాన్ని సహజీవనాన్ని ధ్వసం చేయడమే గతంలో తండా పెద్దలు కూర్చొని ఏ కార్యం అయినా పండుగ అయినా పెళ్ళి అయినా పంచాయితీ అయినా సామూహికంగా పంచయితీ {నసబ్ } పరిష్కరించేవారు ,కానీ ఇప్పుడు ఈ సమాజం లో సంస్కృతిక దాడులు రాజకీయంగా అన్యాయం జరిగుతుంది .దీనిని అడ్డుకట్ట వేయాలని ఎంతమంది వచ్చిన అర్హికంగా రాజకీయంగా ,ముడ నమ్మకంగా మోసంచేస్తున్నారు .

కానీ ఇప్పుడు ఉన్న యౌత మాత్రం దిని పయి ఎటువంటి అవగాహన లేఖపోవడం వల్ల వాళ్ళ చర్రిత్రను వాళ్ళే తెలుసుకోలేని దురద్రుస్తావంతులుగా మిగిలిపోతున్నారు .

లంబాడీల ఆచార సంప్రదాయాలు

[మార్చు]
ఒక లంబాడీ మహిళ బాల్జా వస్తులా వేషా ధారణ చే మేరమా రూపం
బంజారా పురుషుల‌ సాంప్రదాయక దుస్తులు చిత్రం

గోత్రాలు : లంబాడీలు పెళ్ళిలో ప్రప్రథమంగా గోత్రాలను పరిశీలిస్తారు. కొన్ని గోత్రాల వారు మరికొన్ని గోత్రాల వారితో వియ్యమందు కోకూడదనే నిషేధాలున్నాయి.

భరోపురాకరేర్

లంబాడీలలో కన్యాశుల్కం ఇవ్వడం ఆచారం. కన్యకు, ఆమె తల్లిదండ్రులకు వరుడు పశువులను, ధాన్యాన్ని కన్యా శుల్కంగా అర్పించుకుంటాడు. దీనినే లంబాడీలు ‘‌’ అంటారు. వధువు తల్లిదండ్రులకు నాల్గు కోడెలు 45 రూపాయలు ఇచ్చుకుంటారు. వధువుకు ఆమె తల్లిదండ్రులు కూడా పరికిణి, కాంచళి (రవిక) మొదలైన దుస్తులను, ముక్కెరను రూపాయల దండను, ఒక తాంగిడిని ఇస్తారు. తాంగిడి అంటే పెళ్ళిలో పుట్టింటివారు పెళ్ళి కూతురికి ఇచ్చే గోనె సంచి. పశువుల రూపంలో కన్యాశుల్కాన్ని సమర్పించి పెళ్ళి చేసుకొనే ఆచారం ఉంది.

వరుని దేహ దారుఢ్య పరీక్ష

వరుని దేహ దారుఢ్యాన్ని, సహనాన్ని పరీక్షించటానికి కొన్ని కార్యక్రమాలు చేపడతారు. స్త్రీలు జిలేడు, మోదుగు కర్రెలతో, రోకళ్ళతో కొడుతూ మా కుతురిని బాధిస్తావా? బూతు మాటలు మాట్లాడుతావా? అంటూ ప్రశ్నిస్తారు. బావ మరుదులు చిన్నచిన్న రాళ్ళు చెవి దొప్పలో పెట్టి మా అమ్మ నాన్నని తిడుతావా? మా చెల్లిని బాధిస్తావా అంటూ నలుపుతారు. ఎంత కొట్టినా, ఎంత నలిపినా అ నొప్పి అని నోట మాట రాకూడదు.వీటిని బట్టి వరుని శరీర పటుత్వాన్ని ఓర్చుకొనే శక్తిని పరీక్షిస్తారు. ఈ అవస్థలను భరించినవాడే వధువుకు సరియైన భర్తగా పోషించే సమర్థుడని నమ్ముతారు.

ఢావలో

పెళ్ళికి వారం రోజుల ముందు నుండే తండాలోని స్త్రీలందరూ కలసి వధువుకు పంపక సమయంలో ఏడ్చే విధానాన్ని నేర్పుతారు. దీనినే ఢావలో అంటారు. ఈ కార్యక్రమములో మూడు విధానాలుంటాయి. ఏడ్పును నేర్పించే ఆచారాన్ని ఢావలో అని, పంపక సమయంలో అందరినీ కౌగిలించుకొని ఏడ్వటం, మళేరో అని ఎద్దుపై నిల్చొని తన పుట్టింటి వారు సుభిక్షంగా వుండాలని కోరుకుంటూ పాడేపాటను దావేలి అని అంటారు. ఢావలో ఎంత కఠిన హృదయులనైనా కరిగిస్తుంది. ఈ పాటలో వధువు పుట్టింటిలో తన బాల్యాన్ని తల్లిదండ్రుల ప్రేమానురాగాలను తలచుకొని దుఃఖించే విధంగా తండాలోని వారందరికీ కంట నీరు పెట్టిస్తుంది. ఆడపుట్టుక పుట్టిన తరువాత అత్తవారింటికి వెళ్లవలసిందే అని వధువు నిశ్చయించుకొని పుట్టింటివారు క్షేమంగా వుండాలని కోరుకుంటుంది.

మళేరో

మళేరో అంటే తల్లిదండ్రు లను, అన్నాదమ్ములను, స్నేహితులను ఉద్దేశించి తన చిన్ననాటి జ్ఞాపకాలను తలచుకొంటూ దుఃఖించటం. లంబాడీలలో తల్లులే కాకుండా పెళ్ళి కూతురు తోటి వారు కూడా ఆమె దుఃఖాన్ని ఉపశమింప చేయడానికి ప్రయత్నిస్తూ అత్తవారింట్లో మెలగవలసిన విధానాన్ని పాటలో బోధిస్తారు.

విందు (గోట్‌)

గోట్‌ అంటే విందు అని అర్థం. పెళ్ళి కుమారుడే ఇవ్వాలని ఆచారముంది. తండా జనాన్ని దృష్టిలో పెట్టుకొని మేకల్ని బలి యిస్తారు. రక్తాన్ని పాత్రలో పట్టి ‘సొలోయ్‌’ వండుతారు. సొలోయ్‌ అంటే చింతపండు పులుసు, ఉప్పు, రక్తం కలిపి తయారుచేస్తారు. సరిపోయే కల్లు, సారాయితో సాయంత్రం అందర్నీ బంతిగా కూర్చోబెట్టి సొలోయ్‌ని వడ్డించి మత్తుపానీయాలు సేవిస్తారు, తరువాత భోజనము చేస్తారు.

కుటుంబీకుల సేవ

కన్యకు పెళ్ళి పూర్తికావడంతో ఓ ఇంటి కోడలవుతుంది. అత్తమామలకు ప్రతిరోజూ సాయంత్రం వేడినీళ్ళతో స్నానం చేయించాలి. అన్న పానాదులు క్రమ పద్ధతిలో అందునట్లు జాగ్రత్తపడాలి. రాత్రి సమయంలో అత్తమామలకు కాళ్ళు నొక్కడం వీరి ఆచారము.

తీజ్

[మార్చు]
తీజ్ బుట్టలతో బంజారా మహిళలు

తొమ్మిది రోజుల సంబురాలు... కఠోర నియమాలు.. డప్పుల మోతలు... తండంతా కేరింతలు... పెళ్ళికాని ఆడబిడ్డల ఆటాపాటలు.. అన్నాచెప్లూళ్ల... అక్కాతమ్ముళ్ల అనుబంధాలు... బావమరదళ్ల అల్లరిచేష్టలు... ఆ పై భక్తి భావం... వీటన్నింటి మేళవింపే తీజ్ పండుగ...

తెలంగాణలోని ప్రతి గిరిజన తండా తీజ్ పండుగతో కళకళలాడుతున్నది. తరతరాలుగా వస్తున్న సంస్కృతి సంప్రదాయంగా ఈ తీజ్ పండుగను లంబాడీలు ఘనంగా జరుపుతారు. ఈ పండుగ బతుకమ్మను పోలి ఉంటుంది. తీజ్‌ను ఎనిమిది రోజుల పాటు పూజించి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తారు. ఈ ఉత్సవాలను తండాలోని పెళ్ళికాని ఆడపిల్లలే నిర్వహిస్తారు. వీరికి తండాపెద్దలు, సోదరులు సహకరిస్తారు. వర్షాకాలం ప్రారంభంలో కనిపించే ఎర్రని ఆరుద్ర పురుగును ‘తీజ్’ అంటారు. అలాగే గోధుమ మొలకలను కూడా ‘తీజ్’గా పిలుస్తారు. బతుకమ్మను పూలతో అలంకరించినట్లే.. తీజ్‌లో గోధుమ మొలకలను పూజించడం లంబాడీల ఆనవాయితీ.

‘మారో బాపూ బజరజ్ హూంసియో కనాయియో’
‘ఓరి భేటీవూన తీజ్ బొరాదూ కేరోయే’

పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లలకు పెండ్లి అయితే వచ్చే ఏడాదికి ఇంట్లో ఉండరనే ఉద్దేశంతో తల్లిదంవూడులు తీజ్ ఉత్సవాలను నిర్వహిస్తారు. పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లలు తల్లిదంవూడులు, తమకంటే వయస్సులో పెద్దవాళ్ల ఆశీస్సులను తీసుకుంటారు. వర్షాకాలం ప్రారంభమై నాటు పూర్తయిన తర్వాత ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. సీత్లాభవాని(లంబాడీల దేవత) పూజ ముగిసిన తర్వాత తీజ్‌ను జరుపుతారు.

‘నాయక్ బాపూ బొరాయో తీజ్, బాయీరో పాలేణా!
నాయెక్ బాపుతి రాజీయేగి తీజ్, బాయీరో పాలేణా’!

ఆడపిల్లలంతా కలిసి ఇల్లిల్లు తిరిగి పెద్దవాళ్ల ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఉత్సవాలు నిర్వహించడానికి అనుమతి కోసం ‘నాయక్’ దగ్గరికి వెళ్తారు. తండాకు పెద్ద మనిషి ‘నాయక్’ కాబట్టి, తండాలో ఎలాంటి శుభకార్యం జరిగినా ఆయన అనుమతి తప్పనిసరి. ఇది గిరిజన తండా కట్టుబాటు. అనుమతి పొందిన తర్వాత ఏర్పాటు పనులను మొదలు పెడతారు. ఆడపిల్లలందరూ కలిసి ఇంటింటికీ తిరిగి వేడుకల కోసం విరాళాలు సేకరిస్తారు.

‘ఘేవూలారయే తోన శారేతీ మంగాయీ’
ఘేవూలారయేతోన టపారే మా గోకి’

ఆ విరాళాలతో వారంలో ఒక రోజు అంగడికి వెళ్తారు. ఉత్సవాలకు కావాల్సిన గోధుమలు, శనగలు, ఇతరత్రా సామాన్లను తెచ్చుకుంటారు. సాయంవూతానికి గోధుమలను నానబెట్టి, తీజ్‌లను మొలకెత్తించడానికి ఆడపిల్లలు, వారి సోదరులు బుట్ట (ఓల్డి) లను అల్లుతారు. ఇందుకోసం అడవిలో దొరికే దుసేరు తీగ (పిలోణీర్ వేళ్లీ) ను వాడుతారు. గోధుమలను నానబెట్టే క్రమం అత్యంత పవివూతంగా ఉండాలి. పుట్టమట్టిని తెచ్చి అందులో మేక ఎరువును కలుపుతారు. లంబాడీల దేవతలు దండియాడి (తొళ్జా భవాని), సేవాభాయా, సీత్లాభవాని పేర్లతో ‘దుసేరు తీగ’తో తయారు చేసిన బుట్టలో మొదటగా తండా నాయకుని చేత ఎరువు కలిపిన మట్టిని పోయిస్తారు. ఆ తర్వాత నానబెట్టిన గోధుమలు చల్లిస్తారు. ఈ తీజ్ ఉత్సవంలో దేవుని కోసం చేసే ప్రతికార్యం పాటతోనే సాగుతుంది.

‘శీత్లా యాడీ బొరాయీ తీజ్, బాయీ తారో పాలేణా,
సోనేరో డాక్ళో ఘలాన, బాయీ తారో పాలేణా’

తండాలోని ఒక్కొక్క ఆడపిల్ల ఒక్కొక్క తీజ్ బుట్టను పెడతారు. ఆ బుట్టలన్నీ ఒకేచోట ఉండేందుకు పందిరిని ఏర్పాటు చేస్తారు. ఆ పందిరిని వర్ణిస్తూ ఆడపిల్లలందరూ పాట అందుకుంటారు. ఒక్కొక్క ఆడపిల్ల తన బుట్టను గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆ బుట్టలపై నీళ్లుపోయాల్సి ఉంటుంది. రోజంతా ఏ పనుల్లో ఉన్నా ఆ సమయానికి ఖచ్చితంగా తీజ్‌కు నీళ్లు పోయాల్సిందే!

బోరడి ఝష్కేరో ... బోరఢి ఝష్కేరో కార్యక్షికమం తీజ్ పండుగలోనే ఒక ప్రత్యేక ఘట్టం. ‘బోరడి’ అంటే రేగుముళ్లనీ, ‘ఝష్కేరో’ అంటే గుచ్చడమని అర్థం. నానబెట్టిన రేగుముళ్లను గుచ్చే ఒక విలక్షణమైన ఆచారాన్ని ఈ పేరుతో పిలుస్తారు. గోధుమలను బుట్టల్లో చల్లేరోజు సాయంత్రం బోరడి ఝష్కేరోని నిర్వహిస్తారు. ఇది పూర్తి వినోదభరితం. పెళ్ళికాని ఆడపిల్లలు రేగుముళ్లకు శనగలు గుచ్చేటప్పుడు తమకు బావ వరుసవారు ముళ్లను కదిలిస్తారు. అయినా సహనంతో ఆడపిల్లలు శనగల్ని ముళ్లకు గుచ్చాల్సిందే. చెల్లెల్ని ఏడిపించే అన్నల్ని కూడా ఈ కార్యక్షికమంలో చూడవచ్చు.

‘ఖొద ఖొదారే సేవభాయకువలో ఖోద
కువలేరో పాణి అకెలాబి భరే, సకేలాభీ భరే’

బంజార లంబాడీలు సేవాభాయాను తమ దైవంగా భావిస్తారు. తమ నీటి కష్టాలను తీర్చడానికి సేవాభాయా బావిని లోతుగా తవ్వించాడని బంజారాలు భావిస్తూ తీజ్ కోసం నీళ్లను తెచ్చే సందర్భంలో ఆడపిల్లలు సేవాభాయాను పాటలో స్మరించుకుంటారు. సేవాభాయా తవ్వించిన బావి నుంచే నీళ్లను తెచ్చి తీజ్‌పై చల్లుతున్నట్లుగా భావిస్తారు.

‘లాంబీ లాంబీయే లాంబడి ఎకేరియా
లార లేరియే లాంబడి ఎకేరియా’

గోధుమలు, శనగలు మొలకెత్తి గునుగుపూలలా పొడుగ్గా పెరిగి వంగాలని ఆకాంక్షిస్తారు. ఇలా పెరిగితేనే నచ్చిన జీవిత భాగస్వామి దొరుకుతాడని, తమ బతుకులు పచ్చగా ఉండి, తండా బాగుపడుతుందని వారి నమ్మకం. మంచిగా కాలమై పంటలు బాగా పండుతాయని తండా పెద్దలు భావిస్తారు.

ఢమోళి...

ఇక ఏడో రోజు జరిపే కార్యక్షికమమే ‘ఢమోళి’. ‘చుర్మో’ (రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద) ను మేరామా భవానికి సమర్పించే కార్యక్షికమాన్నే ఢమోళి అంటారు. ఈ రోజు మేరామా భవానికి బలి ఇవ్వడం ఆచారం. వెండితో చేసిన మేరామా భవాని విగ్రహం కానీ, రూపాయి బిళ్ల కాని ముందుంచి మేకపోతును బలి ఇస్తారు. దీన్నే ‘అకాడో’ అంటారు. ప్రతి ఇంటి నుంచి పావుసేరు చొప్పున బియ్యం సేకరించి పాయసం (కడావో) వండుతారు. వండిన పాయాసాన్ని బలిగా ఇచ్చిన మేక మాంసాన్ని ఇంటింటికి పంపిస్తారు. ఆ రోజు తీజ్ వద్ద ఆటపాటలతో తండావాసులంతా ఆనందంగా గడుపుతారు.

కొంచెం దుఃఖం... కొంచెం ఆనందం

ఎనిమిదో రోజు తమ బంజారా ఆరాధ్య దేవతల ప్రతిరూపాలను మట్టితో చేసి పూజిస్తారు. వారికి పెళ్ళి చేస్తారు. అబ్బాయి (డోక్రా), అమ్మాయి (డోక్రి) ప్రతిరూపాలను మట్టితో చేసి ఆరాధిస్తారు. పెళ్ళి కాని ఆడపిల్లలు తమను డోక్రీలుగా ఊహించుకుంటారు. పెళ్ళి అయితే తమ పుట్టింటిని వదిలి వెళ్లాల్సి వస్తుందని దుఃఖంతో ఏడుస్తారు. వారిని ఓదార్చుతూ సోదరులు, ఆటపట్టిస్తూ బావ వరుసవారు ఇలా... కొంచెం దుఃఖం, కొంచెం ఆనందంతో కొనసాగుతుంది.

ఘెవులారే తాతీ వడలి వేరాదూ...

తొమ్మిదవ రోజును బంజారాలు ఘనంగా జరుపుకుంటారు. తీజ్ నిమజ్జనానికి బంధుమివూతులందరినీ ఆహ్వానిస్తారు. కొత్తబట్టలు వేసుకుని అత్యంత పవివూతంగా మేరమా భవాని, సేవాభాయాకు భక్తిక్షిశద్ధలతో పూజలు చేస్తారు. డప్పుచప్పుళ్లతో సంప్రదాయబద్ధంగా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిక్షిశద్ధలతో ఆడబిడ్డలు పెంచిన తీజ్‌ను తండా నాయక్ పరిశీలించి ఒక్కొక్క బుట్టను ఆడపిల్లలకు అందిస్తారు. మొదటి తీజ్ (గోధుమ నారు) ను నాయక్ రుమాలులో పెట్టిన తర్వాత, ఆపదల నుంచి రక్షించాలని ఆడపిల్లలు తమ అన్నదమ్ములకు నారు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు. (ఇది రాఖీ పండుగను పోలి ఉంటుంది) ఈ నారు అత్యంత పవివూతమైందని, దీని వల్ల శుభం జరుగుతుందని నమ్మకం. తీజ్ బుట్టలను పట్టుకొని వరుసగా ఆడపిల్లలు నిమజ్జనానికి డప్పుచప్పుళ్లతో బయలుదేరుతారు. నృత్యాలు.. పాటలు.. కేరింతలతో ఆనందభరితంగా ఈ నిమజ్జన వేడుక సాగుతుంది. చెరువు దగ్గర తీజ్ నిమజ్జనం ఓ అద్భుతమైన సన్నివేశం. తీజ్ తమను వదిలేసి వెళ్లిపోతుందనే దుఃఖంతో ఆడపిల్లలు ఏడుస్తుంటే పెద్దలు, సోదరులు వారిని ఊరడిస్తుంటారు. జీవితాంతం నీకు నీడగా ఉంటూ రక్షిస్తానని చెల్లెల్ని పీటపై నిల్చొపెట్టి కాళ్లను కడిగి పాదాభివందనం చేస్తాడు అన్నయ్య. ఆ తర్వాత తీజ్‌ను చెరువులో నిమజ్జనం చేస్తారు.

నియమనిష్టలు..

బంజారాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా జరుపుకునే ఈ తీజ్ ఉత్సవం తొమ్మిది రోజులు అమ్మాయిలకు అగ్నిపరీక్షే. ఉప్పుకారం లేని భోజనం తినాలి. అత్యంత పవివూతంగా ఉండాలి. స్నానమాచరించి భక్తిక్షిశద్ధలతో తమ దేవతలను పూజించాలి. తండా నుంచి బయటికి వెళ్లకూడదు. మాంసాహారాలు తినకూడదు. బావి నుంచి నీటిని తెచ్చే బిందెను ఎక్కడా కూడా నేలపై పెట్టకూడదు. నేరుగా పందిరిపై పోయాల్సిందే. నీటిని తెచ్చే క్రమంలో డప్పుచప్పుడు చేస్తూ నృత్యాలు చేస్తారు. నృత్యం చేసినంతసేపూ బిందెను నెత్తిపై పెట్టుకొని నిలబడాల్సిందే!

గుర్తింపు కావాలి...

మాకు ప్రత్యేకమైన భాష, ఆచారం, సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా మా సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నాం. కానీ మా సంస్కృతి సంప్రదాయాలకు ప్రభుత్వం నుంచి గుర్తింపు రావడం లేదు. తీజ్ పండుగ నిర్వహించుకోవడానికి ఒక ప్రత్యేకమైన తేది అంటూ ఏమీ లేదు. ఆగస్టు నెల రెండవ వారం నుంచి ఆగస్టు నెల చివరి వరకు వివిధ జిల్లాలోని లంబాడీలు ఒక్కొక్క రోజున జరుపుకుంటారు. బంజారాల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే సీత్లాభవాని (దాటుడు), తీజ్ పండుగలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి ఒక తేదీని కేటాయించాలి. తెలంగాణ రాష్ట్రంలోనైనా లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలను గుర్తిస్తారని ఆశిస్తున్నాం.

బంజారాల ఆచారాలు, అలంకరణలు

[మార్చు]
అంతర్జాతీయ విత్తన సదస్సు (ఇష్టా)లో బంజార కళాకారుల ప్రదర్శన

భారతదేశంలోని అనేక తెగలు, ప్రజల వస్త్రధారణలో అలంకరణలో లంబాడీ స్త్రీల వేషధారణనే ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది. ముఖ్యంగా అలంకరించుకొనే ఆభరణాలు ప్రాచీనతను ప్రతీకను సంతరించుకున్నాయి. ఇప్ప టికి నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాలలో లంబాడీల వేషధారణ దుస్తులు అలంకరణలు ఆచరణలో ఉన్నాయి. లంబాడీ పురుషులు వేషధారణలో ప్రత్యేకత ఏమీ లేదు. వారు ఆ కాలంలో ధరించే దుస్తులు మగవాళ్లకు దోతి, ఖాది, అంగీ, తలకు 24 మూరల పెద్ద పెద్ద రుమాలు కట్టేవారు. భుజంమీద కండువా ధరించి చేతిలో చేతి కర్ర ఉండేది. చెవులకు బంగారు పోగులు, చేతికి వెండి కడియాలు ధరించేవారు. ఈ విధంగా నల్లగొండ జిల్లాలో ఇప్పటికీ ఆచరణలోనే ఉందని చెప్పవచ్చు. లంబాడీ స్త్రీల దుస్తులు అందమైన కుట్టుపనులతో ఉంటాయి. అద్దాలు పొదిగించిన కాంచళి (రవిక), కుచ్చుల పేటియా (లంగా), అద్దాలు రూపాయి బిళ్లలతో తయారు చేసిన గుమ్‌టో (ముసుగు) ను ధరిస్తారు. లంబాడీ స్త్రీల ఆభరణాలు అందంగా ఉండటమే కాక బరువుగా కూడా వుంటాయి. వీరు ముక్కుకు భూరియా ముక్కెరను చెవులకు వివిధరకాల ములును, మెడలో హంస్‌లో గొలుసును, చేతులకు బలియ గాజులును వాంక్‌ డీ కడియాలును, చేతి వేళ్లకు చాస్‌ నగిషి కలిగినవి చల్లా నగిషిలేని మొదలైన ఉంగరాలను ధరిస్తారు. లంబాడీల్లోని సాంప్రదాయక ఆభరణాలు ఈనాడు మార్పులు ఎన్నో లోనవుతున్నాయి. ఆధునిక కాలంలోని నాగరిక ప్రభావంతో ఈ నగలన్ని అంతరించి పోతున్నాయి.

గాతే హంస్‌ కాంచళి గుగ్రో
గుంగ్‌టో బళియా డోరి వాంక్‌డీ

నల్లగొండ జిల్లాలోని లంబాడీ ప్రజలలో ఇప్పుడు పాత ఆచారాలు పోయి కొంతవరకు దుస్తులలోను, పెళ్ళి సొమ్ములలోను మనుష్యులలోను మార్పులు వచ్చాయి. అయినా లంబాడీలు మాట్లాడే భాషలలో మార్పురాలేదు. వారి గోత్రాలలో మార్పు రాలేదు. వారి గోత్రాలలో కొన్నికోడ్‌ నెంబర్లు ఉంటాయి. వారు వివాహాలువారి గోత్రాలకు వ్యతిరేఖ గోత్రాల తోనే పెళ్ళి చేసుకోవాలి. ఈ పెళ్ళి ఆచారాలను తెలుగు ప్రజలు చూసి లంబాడీ మానవుడు అని అంటారు. పెళ్ళి అయినవరు అత్తవారింటికి రావడం బహు అరుదు. ఈ లంబాడీలు ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వరుసకు వీరు అన్నా చెల్లెలు అవుతారు. ఇలా ఎన్నో ఆచార కట్టుబాట్లు ఉన్న వీరికి ఆదేశాలు, పట్టుదల, పంతాలు కూడా ఎక్కువే.లంబాడీలు శిశువు జన్మించిన మూడవ రోజు లేదా ఏడవ రోజు పురుడు చేస్తుంటారు. పూర్వం తల్లికి పాపకు పసుపు, ఆవుపేడతో ఒళ్లు రుద్ది స్నానం చేయించేవారు. ఈ రోజు కూడా సబ్బులకు బదులు పశువుల పేడను ఉపయో గించడం కన్పిస్తుంది. ఆరోగ్యరీత్యా పరిశీలిస్తే పేడలో అమ్మోనియా, పసుపులో క్రిమిసంహారక శక్తి ఉందని విజ్ఞాన శాస్త్రం తెలుపుతుంది.

అంతర్జాతీయ విత్తన సదస్సు (ఇష్టా) నిర్వహించిన 32వ విత్తన రైతుల సమావేశంలో బంజార వస్తువుల ప్రదర్శన

పురిటిరోజే జలమాత పూజ చేస్తారు. దీనిని లంబాడీలు దళయాదోకావేరో అంటారు. ఇంటికి తూర్పు దిక్కున తీసిన గుంతలో నీటిని నింపుతారు. ఈ పూజా కార్యక్రమం తెలంగాణా స్త్రీలు 21వ రోజు సంతానం లేని స్త్రీలను బావి దగ్గరకు తీసుకొనిపోయి వీపుపై నీళ్లు కుమ్మరించే ఆచారంతోపోలి వుంటుంది. మూడు ఇత్తడి చెంబులను మరికొన్ని ప్రాంతాల్లో ఒకే చెంబును సున్నం, బొగ్గు, పసుపు బొట్లతో అలంకరిస్తారు. మొదటి చెంబులో పసుపు నీళ్లు నింపుతారు. దరిచేవని విశ్వసిస్తారు. అలంకరించిన చెంబులను ఐదేండ్లు దాటని ముగ్గురు బాలురతో ఇద్దరు బాలికలతో బాలింత తలపైన పెట్టిస్తారు. సౌభాగ్యవతులు బియ్యాన్ని లేదా మొక్కజొన్ననలను అక్షింతలు చల్లుతూ, చ్వారికి, చోరా, చ్వారికి, చోరా అని పాడుతూ చెంబులను గుంత దగ్గర నింపుతారు. సన్‌ సుతిలిసువోలేన్‌ వర్‌ ఆయేస్‌ అంటూ పాటలను పాడుతారు. ఆడపిల్లలకైతే సూధి దారం తీసుకొనివెళ్లు, మగపిల్లాడికైతే జనుం, సుత్తి, డబ్బనం తీసుకొని వచ్చేయి. అని ఈ పాట అర్థం (జనపనారతో చేసిన సన్నటి తాడును సుతిలి అని, గోనో సంచిని కుట్టే సూధిని డబ్బనం అని అంటారు) ఈ పాటలో లంబాడీల జీవిత విధానం ప్రతిబింబిస్తుంది. లంబాడీ స్త్రీలు కనువిందును కలిగించే కళాత్మకమైన దుస్తులను కుట్టడంలో నేర్పరులు. కాంచలి (రవిక) గాగ్రా (పరికిణి) కుట్టడం నేర్చుకున్న తరువాతనే ఆడపిల్లలకు పెళ్ళి చేస్తారు. ఆకంచలి అంటే అద్దాలతో కుట్టిన రవిక, గాగ్రా అంటే పరికిణి, అందుకేఆడల్లిలకు ఉపకరించే కుట్టు పరికరాలను కానుకలుగా సమర్పించడం.పుట్టిన బిడ్డలకు మొదటిసారి తలవెంట్రుకలను తీయడాన్ని లంబాడీ భాషలో లట్టాకాడేర్‌ అని అంటారు. లంబాడీల్లో ఒక్కరికే కాకుండా జంటగా పుట్టు వెండ్రుకలు తీయడం ఆచారం, ఒక్కరికే తీయవలసి వచ్చినపుడు పక్కన ఓక్రాను పెడతారు. ఓక్రా అంటే చిన్న గోనె సంచిలో మెత్తని గడ్డి నింపి కుట్టిన దిండు లంబాడీలు సామాన్యంగా తుల్జాభవాని దేవత ఎదుట వెంట్రుకలను తీస్తుంటారు. ఒకవేళ బాలాజీ భగవానునికి గానీ, వేముల వాడ రాజన్నదేవునికి గానీ మొక్కుకున్నట్ల యితే రెండు పిలకలుంచుతారు. లంబాడీల్లో ఋతుమతి అయిన అమ్మాయిలకు ప్రత్యేక ఉత్సావాలు చేయరు. అయితే ఈ రోజుల్లో కొంతమంది లంబాడీలు తెలుగువారి సంస్కృతి ప్రభావంతో ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు.

ఈ ప్రపంచంలో బంజారాలు ప్రపంచంలోనే అతిపెద్ద సమాజం (12 కోట్లకు పైగా జనాభా) .ఎంహెచ్ తక్కువ 1 కోట్లకు పైగా జనాభా. కర్ణాటక లో 5 మిలియన్ జనాభా. తెలంగాణ లో 3-4 మిలియన్లు. రాజస్థాన్ లో 3.5 మిలియన్ జనాభా.

యివికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

ఆధారాలు

[మార్చు]
  • http://bhumika.org/archives/475
  • చీని నాయక్ రచించిన గ్రంథం: బంజారా చరిత్ర, సంస్కృతి.

ఇతర పఠనాలు

[మార్చు]
  • ఎ.అయ్యప్పన్ (1944). మానుషశాస్త్రం - ఆదిమ నివాసులు.
"https://te.wikipedia.org/w/index.php?title=లంబాడి&oldid=4355004" నుండి వెలికితీశారు