Jump to content

బంజారా దసరా పండుగ

వికీపీడియా నుండి

బంజారా దసరా పండుగ ను దసరావ్,దస్రావ్,లేదా మావ్లీ పూజ అని కూడా అంటారు.ఈ పండుగను బంజారా లంబాడీ గిరిజనులు ప్రతి సంవత్సరం గ్రీష్మ ఋతువు వైశాఖ,జ్యేష్ట మాసాలలో పున్నమి వెన్నెలలో మాత్రమే మంగళవారం రోజున ఏడు దేవతలను మేక పోతు బలి ఇచ్చి భక్తీ శ్రద్ధలతో పూజలు చేసి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.[1][2]

బంజారా దసరా పండుగ
బంజారా దసరా పండుగ
సాతీ భవానీ అను ఏడుగురు అక్కచేల్లెలకు పూజ చేసె చిత్రం
యితర పేర్లుదసరావ్, దస్రావ్, మావ్లీ పూజ
జరుపుకొనేవారుబంజారా లంబాడీలు,సుగాలిలు
ప్రారంభంగ్రీష్మ ఋతువు, వైశాఖ మాసము శుక్ల పక్షం మంగళవారం (రోజు)
ముగింపుజ్యేష్ట మాసము, శుక్ల పక్షం మంగళవారం (రోజు)
ఉత్సవాలురెండు రోజులు (ఒక రాత్రి)
వేడుకలువేదిక ఇంట్లో ఏర్పాటు,ఆ రోజు ఉపవాసం , మూర్తి పూజ చేయడం,హారతి (సాయింత్రం వళంగ్,మహీళలు పాడుతారు. ప్రొద్దున మగవారు కోళే తారణ్ హారతి పాడుతారు) కంకాళీ,త్వళ్జా,మేరమ్మ ,హింగ్ళా,ధోళాంగర్,సీత్ళా,అంబా భవానీ అను , ఏడు దేవతలకు మేక పోతు బలి ఇచ్చి నైవేద్యం సమర్పించబడతాయి.
సంబంధిత పండుగసీత్ళా భవానీ పూజ
ఆవృత్తిఎండా కాలంలో సంవత్సరానికి ఒకసారి

భవానీ పూజ సామాగ్రి

[మార్చు]

పసుపు,కుంకుమ,జోన్నపిండి, పీట, రూపాయి నాణేలు, పూలు,పళ్ళు, బియ్యము, దీపాలు రెండు పెద్దవి, వోత్తులు, అమ్మ వారి వెండి విగ్రాహాలు, గవ్వలు,పసుపు కొమ్ములు,ఎర్ర బట్టలు (రాత్డో కపడా)నిమ్మకాయలు, హారతి పళ్ళెము,తమలపాకు,కోబ్బరి కాయలు, ఎండు ఖర్జూరము,బాదాము,పోకలు, కుడకలు,గంగాజలం,చందనం,అగరువత్తులు,కర్పూరం,ఆగ్గిపెట్టె,నెయ్యి,మంచి నూనె,సాంబ్రాణి డబ్బా ధూపం కోసం, అడ్డేడు(అడ్డా),రెండు చెంచాలు, రెండు చెంబు,కట్టె పుల్లలు.

భజన సామాగ్రి

[మార్చు]

భజనలు పాడుటకు ఈ క్రింది వాద్య పరికరాలను ఉపయోగిస్తారు.నగారా (ఢంకా),తాళాలు చిన్నవి, తాళాలు పెద్దవి, ఇత్తడి పళ్ళెం,కంచు పళ్ళెం,స్టీలు పళ్ళెం,కంజీర,

సర్కారీ దసరా

[మార్చు]

బంజారాలుదసరా పండుగను సర్కారీ దసరా అంటారు.ఈ పండుగ సందర్భంగా పది రోజులు దసరా సేలవులు ఉంటాయి. సేలవుల్లో పట్టణ, నగరాల నుండి సొంతురికి ఈ పండుగకు వెళ్ళి జరపుకుంటారు.లంబాడీ గిరిజన తెగ లో ఈ సర్కారీ దసరాకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వరు.కాని కాలానికి అనుగుణంగా వీరి సంస్కృతి సాంప్రదాయాలలో వస్తున్న మార్పులను స్వీకరిస్తూ కొన్ని చోట్ల అక్కడక్కడ పెద్ద మొత్తంలో హిందూ సంప్రదాయం ప్రకారం తాండాలో కూడా సర్కారీ దసరా తో పాటు భవానీ పూజ, మావ్లీ పూజ కూడా జరుపుకుంటారు.

దసరా ప్రాముఖ్యత

[మార్చు]

దసరా పండుగ వాళ్ళ పూర్వీకులు, తాత ముత్తాతల నుండి పరంపరగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలను కోనసాగిస్తూ, ఈ పండుగను జరపుకుంటునారు.ఈ పండుగ సందర్భంగా సాతీ భవానీ[3] (ఏడు దేవతలు)

1.మేరమ్మ (మర్యామా),
2.కంకాళీ, 
3.త్వళ్జా ,
4.హింగ్ళా, 
5.సీత్ళా(మత్రాల్),  
6.ధోళాంగర్,
7.అంబా(మసురీ)భవానీ,

అను ఏడు దేవతలకు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. సంతానం లేని ఆలమగలు తమ ఆచారం ప్రకారం మొక్కడం వలన దేవతల అనుగ్రహంతో సంతానం కల్లుతాయిని వీరి దృఢవిశ్వాసం. బంజారాలది గోర్ (బంజారా) వంశం రాథోడ్,జాదవ్,పవార్,చౌహాన్,బానోత్ గోత్రాలను బట్టి వాళ్ళ ఇంట్లో ఉండే ఇంటి దేవతలను వారి అచారాల ప్రకారం పూజించి,అబ్బాయి,అమ్మాయిల కేశ ఖండన కార్యక్రమాలు,లేదా కేశ ఖండనం లేకుండా సాదా కూడా ఈ పండుగను జరపి మొక్కులు తీర్చుకుంటారు.

పండుగ జరిపే విధానం

[మార్చు]

దసరావ్, సస్రావ్ పండుగను బంజారా లంబాడీ గిరిజనులు ఎండా కాలంలో చంద్రుని పున్నమి వెన్నెలల్లో‌ మాత్రమే భక్తీ శ్రద్ధలతో భజన పాడుతు ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు.ఈ పూజను కొత్తగా చేసే వారు మూడు సంవత్సరాలు తప్పక చేయాల్సి వస్తుంది. ఈ పండుగ సందర్భంగా అబ్బాయిల కేశ ఖండనంతో పాటు, కొందరు అమ్మాయిల కేశ ఖండనం,మరి కొందరు కేశ ఖండనం కాక సాదా దసరా చేసి దేవతకు మొక్కులు తీర్చుకుంటారు ఎండాకాలం పున్నమి వెన్నెలలో ఏడు దేవతలు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దినినే దస్రావ్ అంటారు. సాతీ భవానీ ఏడుగురు దేవతలు మేరమ్మ (మర్యామా),త్వళ్జా,కంకాళీ,హింగళ,సీత్ళా, ధోళాంగర్,అంబా భవానీ మొదలగు ఏడు దేవతలు ఉంటాయి. అందులో వంశాన్ని బట్టి వాళ్ళ ఇంట్లో ఉండే కంకాళీ, త్వళ్జా,హింగ్ళా దేవతలను వారి పవిత్రమైన రోజు మంగళవారము న ఉదయం కంసాలి దగ్గర కడగడానికి పంపి వారు వచ్చిన తర్వాత తాండా పరిసర అతి సమీప ప్రాంతంలో వాళ్ళను నిలబెట్టి బాజ భజంత్రీలతో పోయెటప్పుడు వచ్చేటప్పుడు పాటలు పాడుతారు.

అతరా దనేరి భవానీ కతే గైయితీ తోన కణ వలేమాయా, రంగారా ఘర గైయితీ ఛాట్యా మాలాయితి మోలతు మోలావతు పడగయి రాతర హోరహే...

అతరా దనేరి భవానీ కతే గైయితీ తోన కుణ్ వలేమాయా, ధనగరవాడ గైయితీ బోకడో మాలాయితి మోలతు మోలావతు పడగయి రాతర హోరహే... ధనగర వలేమాయో ధనగర వలేమాయో

అతరా దనేరి త్వళ్జా కతే గైయితీ తోన కుణ్ వలేమాయా, సనార్ ఘర గైయితీ హాస్లో మోలాయితీ మోలతు మోలావతు పడగయి రాతర హోరహే... సనార్ వలేమాయో,సనార్ వలేమాయో

అతరా దనేరి కంకాళీ కతే గైయితీ తోన కుణ్ వలేమాయా, కోమట్ వాడ గైయితీ నారళ మోలాయితీ మోలతు మోలావతు పడగయి రాతర హోరహే... ఇలా ఏడు దేవతలను తలచుకుంటు పాట పాడాలి. అతరా దనేరి మర్యామా కతే గైయితీ తోన కుణ్ వలేమాయా, మాళిరే ఘర గైయితీ లింబుడా మోలాయితీ మోలతు మోలావతు పడగయి రాతర హోరహే... మాళి వలేమాయో, మాళీ వలేమాయో..

తీసుకోని వచ్చేటప్పుడు ఇలా పాడుతారు. సేవా లాలేరో లష్కర్ లాదోజా లాలి గరది వడే...జాన ఢాళోరె సేవా నారకేరో బాగ్ కాళేపిళే ఢేరా తణే... పాంచ్ నారళ్ తోడ్ మారి దేవిన చడా కోరెడారి మార జడేర...

సేవా లాలేరో లష్కర్ లాదోజా లాలి గరది వడే...జాన ఢాళోరె సేవా లింబుడారో బాగ్ కాళేపిళే ఢేరా తణే పాంచ లింబుడా తోడ మారి దేవిన చడా కోరెడారి మార జడేర... సేవా లాలేరో లష్కర లాదోజా లాలి గరది వడేర జాన ఢాళోరె సేవా సపారిరో బాగ్ కాళేపిళే డెరా తణే... సేవాలాలేరో లష్కర్ లాదోజా లాలి గరది వడే... జాన ఢళోరె సేవా చంపేలార బాగ్ ళేపిళే డెరా తణే. పాంచ చంపేలా తోడ మారి దేవిన చడా కాళేపిళే డెరా తణే.

పాటలు పాడుకుంటూ హారతి,నీళ్ళు,దేవతలకు పెట్టటానికి ఒక ఇనుప అడ్డా అందులో కొంత ధాన్యం తీసుకోని వెళ్ళి ముందుగా వాళ్ళను ఒక పిఠమీద నిలబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి కాళ్ళకు పసుపు కుంకుమతో బొట్టు పెట్టి పూజ చేసి మొక్కిన తర్వాత దేవతలను ధాన్యం ఉన్న అడ్డాలో ఎర్రపు రంగు బట్ట పెట్టి దానిపై తమలపాకు పెట్టి దాని పైన దేవతలను ఉంచి తిరుగు ప్రయాణంలో పాటలు పాడుకుంటు ఇంటికి తీసుకోవచ్చి మళ్ళీ ఇంటి ముందు కూడా పూజలు చేసి కుటుంబ సభ్యులు అందరు మొక్కి ఇంట్లో దేవతలను తీసుకోని పోతారు.

తర్వాత దేవతలను గుమ్మం ముందు జొన్న పిండి,పసపు కుంకుమ్మలతో దీర్ఘచతురస్ర ఆకారంలో ముగ్గులు తీసి ఎరుపు రంగు కొత్త వస్త్రం పరిచి దానిపైన బియ్యాం పోసి,కంకాళి, త్వళ్జా మాతను తమలపాకు పైన కూర్చో బెట్టి చూట్టు రూపాయి బిల్లలు, కొబ్బరికాయ,గవ్వలు, నిమ్మకాయ,ఖర్జూరం,బాదం, పోకలు, కుడుకలు, పసుపు,కుంకుమతో బోట్టు పెట్టి అగర్బత్తులు ముట్టించి దీపం వెలిగించి కొబ్బరి కాయ కొట్టి కుర్చో పెట్టుతారు. సాంబ్రాని (ఊదు) పోగా చేసి, కర్పూరం వెలిగించి,ఇంటి ముందు ఆ దీపాలను మేకపోతు చూసే విధంగా పట్టి ఉంచుతారు.తల,కాళ్ళ పైన నీళ్ళు జల్లి బోట్టు పేట్టి జడ్తా తీసుకుంటెనే దేవుడు కరుణించినట్టు భావించి ' సాయి వేస్‌ యాడి సాబ్ణీ అని మొక్కి మేకపోతును బలి ఇస్తారు.కోసిన మటన్ ముక్కలను వకాళీ,నారేజా,(హాల్ధి ఫ్రాయి) చేసి మాంసం ఉడికించి ములగబోక్కలు ఏడు,(ఘూండీవాళో హడ్కా) , కాలేయ ముక్కలు ఏడు తయారు చేసిన సళోయి(నల్లా) బాటి లతో అగ్నిహారం (ధప్కార్) ఇస్తారు.అగ్నిహారం కంటే ముందు ఊర్లో ఉన్న నాయకణ్ బాయి, కార్భాణిబాయి,డావణ్, సేజారణ్ బాయి, అసామణ్ మొదలగు మహిళలు వళంగ్ అనే పాటపాడుతారు.

వళంగ్ పాట

1)కంకాళీర్ మెల ఉజళోయె..మావేలి..మాతా...

2)మరియ్యమార్ మెల్ ఉజళోయె... మావేలి మాతా...

3)తళ్జార్ మెల ఉజళోయె మావేలి మాతా...

4) హీంగ్ళార్ మెల ఉజళోయె... మావేలి మాతా...

5) మసూరిర్ మెల ఉజళోయె మావేలి మాతా...

6)ధోళాంగరేరో మెల ఉజళోయె మావేలి మాతా...

7)భవానీర్ మెల్ ఉజళోయె మావేలి మాతా... పసిభరో చావళ్ ఓరియె బద,బద్ అయె ఖీర్,ఘస్,ఘస్ థాళీపర పరోసియె రచ,రచ ఝారి బరోయెరే,సరావణ తారో సేవా కర భుకోతారో సేవ కర,తరసో తారో సేవకర.అని పాడుతారు.

విన్నపాలు(అర్ధాస్)

[మార్చు]

పురుషులు, మహిళలు,బాలబాలికలు అందరు కలిసి దేవతలకు ప్రార్థన చేస్తారు. మహీళల వళంగ్ పాట దాదాపు గంట సమయం తీసుకుంటుంది.ఆనంతరం తాండా నాయక్,కార్భారి,డావ్,కాయకణ్,కార్భాణ్ణి ,డావణ్ ఇలా తాండా వాసులందరిని పిలిచి అందరు వచ్చిన తర్వాత ఇంటి ముందు అర్ధ చంద్రాకారం వరుస క్రమంలో నిలబడి దేవతలకు నైవేద్యం సమర్పించిన తర్వాత తాండా నాయక్ లేదా పెద్దమనషి అర్ధాస్ (వినతి) పాడుతారు.

యాఏ మరియామా యాడి సాబణి. కాళేమాతెర్ మనక్యా ఛా. భూలిచూకి మాఫ్ కరన్ ఖోళెం ఘాల్ యాడి. హాజార్ జ్ఞాన పాఫ్ కర్. జత సమర వోత్ అడణ్ ఆజో యాడి. కాళ్ కంట్ విజ్ఞేన దూర్ కర్. సూతేర్ సప్నేం,బెటేర్ హార్దేం, సేరో సాయి, వేన్ సవాయి రకాడేస్ యాడి. కర్తే కామేం,బర్కత్ ద,ముట్టి ఆన్ద, తార్ బాల్ గోపాలేన్ జ్ఞాన్ద. అంద విశ్వాసేన్ దూర్ కర్, సేరేర్ సవా షేర్ కర్, చింతోకామ్ ఫత్తోకర్,ఉందో తాలా సమోకర్.పడిరొటి ఖడి కర్, తార్ బాల్ గోపాలేన్ రక్షణ కర్. కత హాక్ మారుజత్ ఆడణ్ వేజో యాడి. అందళేన్ అంకిద,ముకేన్ బోలిద, వాంజడిన్ బెటా ద, తార్ ఖూటా ముంగ్రీరో,కీడి ముంగీరో, గోవు ధనేరో,బాల్ బచ్చారో, నంగర్ వాడిరో, గోర్ బందారో సేరో సాయి వేన్‌, సవాయి రకాడేస్ యాడి. వర్షేదనేర్ తారే నామేరో ప్రసాద్ కీదోచూ. తార్ ధోళే దేవళేన్ మంజూర్ కరన్ సాయి వేస్ యాడి అని చేప్పిన తర్వాత అందురు మొక్కుతారు.

తరువాత చేతుల పైన కడాయి,(పాయసం) సళోయ్ ,(నల్లా) నారెజా(హాల్ధి ఫ్రాయి) ఇచ్చి అందరికి వచ్చిందా? లేదా? అని అడిగి లో అని చెప్పి అందరూ తింటారు. అనంతరం వంట అయిన తర్వాత తాండా వాసులందరిని పిలిచి, బిందువులు,చుట్టాలు పెద్ద వారు అందరు కలసి దారు,(సార్) తాగి బోటి(ముక్కలు),లంగాణ్ (సర్వా)బాటి (రోట్టెలు) అన్నంతో సాహపక్తి భోజనాలు చేస్తారు.

సాయింత్రం నుండి రాత్రి వరకు పాడే పాటలు

[మార్చు]

అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు, తాండ పెద్దలు ఇత్తడి లేదా కంచు పల్లెము, నగారా (థాళి,నంగారా) మోగిస్తూ రాత్రంతా నిద్దుర పోకుండా భవానీ మాతను కొలుస్తూ ఈ పాటలు పాడుతారు.

దసరా చోకి బసారేర్ గీత్

1)చోకి బసారు త్వళ్జా మావేలియ మోటీ మావెలీ... చోకేమ బెసేచర హోమ బళచర హోరహే...

2)చోకి బసారు కంకాళీ మావేలియ మోటీ మావేలీ.... చోకేమ బెసేచర హోమ బళచర హోరహేయ.....

3)చోకి బసారు హింగ్ళా మావేలియ మోటీ మావెలీ.... చోకేమ బెసేచర హోమ బళచర హోరహేయ...

4)చోకి బసారు మర్యామా మావేలియ... మోటీ మావేలీ చోకేమ బెసేచర హోమ బళచర హోరహేయ....

5)చోకి బసారు ధోళాంగర్ మావేలియ .... మోటీ మావేలీ చోకేమ బెసేచర హోమ బళచర హోరహే ...

6)చోకి బసారు అంబా మావేలీయ ... మోటీ మావేలీ చోకేమ బెసేచర హోమ బళచర హోరహేయ....

7)చోకి బసారు సీత్ళా మావేలీయ మోటీ మావేలీ ... చోకేమ బెసేచర హోమ బళచర హోరహేయ .... సాతీ భేనే అణు చోకేమ బేసజాణు .


2).కంకాళీతో నికళీరే పాణియా భరేన పాణియా భరేన దుదియా తళాఎన  !!2!!

కంకాళీతో పెరరే పాటేరో పటోళో... పాటేరో పటోళో వు వాగెరే వానేరో !!2!!

తీన్ ఝారిరో యాడి బెడలో భవాని బేడలో వరలీ వేరిరో పాణి గదళోఛయ భవాని గదళోఛయ !!2!!

పరలీ వేరిరో పాణీ భరలయె భవానీ భరలయ తీన ఝారిరో బేడో పాడలయె భవానీ బేడలోయ ఝాపా సాధు బేటోచ ఘటేమ యె భవానీ ఘటేమయ ఝారి జకోళ పాణి దేదయ హోరహే !!2!!

సాతి దేవిరో ఝమర్కో చాలర హోరహే....

3).హరోభరో భవానీ చోకో భరోయ సారి చోకో కంకాళీతి భరోయ !!2!!

4).కంకాళీతో చాలిరే మాళిరే మళేమ మాళిరే మళేమ ఓ ఫూలడా తొడేన హారో రంగ్ ఫూలడా గులాబి రంగ్ ఫూలడా మాళిరే మళేమ ఓ ఫూలడా తొడేన

5).కాందా కదాళీ ఝాపా డుంగరేన చాలర డుంగరేన చాల ఝాపా అయిరో భగతర పేలి కదాళి ఝాపా జమిపర మారోర ఓమ్ నికళి కంకాళీర మూర్తిర హోరహే సాతీ దేవి అణో చోకేమ బేసజాణో

6).అణు లాగయె కంకాళీ అణో లాగయ చాందా గడేతి తోన అణు లాగయ.. చాందాఓ గడేతి జిల్ధి అజోయ హోరహే.. చాందా గడ ఛోడియా ఏ భవాని ఛోడియాయ సాతి భేనే అణో చోకేమ బేసజాణో

7).కుణ కటాయో గడేరి అంబేలి... రాహిందోళో హిందోళ హీచేమాయా సేవా కటాయో గడేరి అంబేలి రాహిందోళో హిందోళో హీచేమాయా కుణ చీరాయో చోడే చకేలా రాహిందోళో హిందోళో హీచేమాయా. ఝాపా చీరాయో చోడే చకేలా రాహిందోళో హిందోళో హీచేమాయా సూరా ఘడాయో నకలీ పాలేణో రాహిందోళో హిందోళో హీచేమాయా. ఓమ బేసయ సాతీ మావేలి రాహిందోళో హిందోళో హీచేమాయా లుకడ్ దచయ యాడిన జటేకో రాహిందోళో హిందోళో హీచేమాయా.

ఈ పాట ఏడు దేవతలను తలచుకుంటు పాడుతారు. పీఠం మీద కూర్చోవాలని దేవతలను విన్నవించుకున్నాంటారు.

రెండో రోజు ప్రొద్దున

[మార్చు]

తాండా వాసులందరిని పిలిచి ఇంటి మనిషి హారతి పళ్ళెం పట్టి మిగిలినవాళ్ళు నగారా,పళ్ళెం,తాళాలు పట్టి దేవతలకు ప్రొద్దున పాటలు పాడుతు హారతి చేస్తారు.

కోళేతారణ్ హారతి పాట

దేవిమ దేవి కుణ్సి మోటి వియోర కోళేతారా దేవిమ దేవి త్వళ్జా మోటి వియోర కోళేతారా,త్వళ్జా దేవిరి అరత్ హో వియోర కోళేతారా.గోళేతార్ పోళే బాందణ్ దేసాదేవి అరత్ తీరర హోరహే గోళేతారణ్ సాధుమ సాధు కుణ్సో మోటో వియోర కోళేతారా సాధుమ సాధు ఝాపా మోటో వియోర కోళేతారా ఝాపా సాధురీ అరత్ హో... వియోర కోళే తారా.

సంతేమ సంత్ కుణ్సో మోటో వియోర కోళేతారణ్ సంతేమ సంత్ సేవా మోటో వియోర కోళేతారణ్ సేవా సంతేరి అరత్ హో పణిర కోళేతారణ్.

ధనేమ ధన కుణ్సో మోటో వియోర కోళేతారణ్ ధనేమ ధన గరాస్యా మోటో వియోర కోళేతారణ్ గరాస్యా సాండేరి అరత్ హో పణిర కోళేతారణ్.

పాడేమ పాడ కుణ్సో మోటో వియోర కోళేతారణ్ పాడేమ పాడ హిమాలయా మోటో వియోర కోళేతారణ్ హిమాలయా పాడేరీ అరత్ హో పణిర కోళేతారణ్.

అన్నేమ అన్న కుణ్సో మోటో వియోర కోళేతారణ్ అన్నేమ అన్న కొద్దు మోటో వియోర కోళేతారణ్ కొద్దు అన్నేరి అరత్ హో పణిర కోళేతారణ్.

నందిమ నంది కుణ్సి మోటీ వియోర కోళేతారణ్ నందిమ నంది గంగా మోటీ వియోర కోళేతారణ్ గంగానందిరి అరత్ హోపణిర కోళేతారణ్.

ఝాడేమ ఝాడ కుణ్సో మోటో వియోర కోళేతారణ్ ఝాడేమ ఝాడ అకఢక మోటో వియోర కోళేతారణ్ అకఢాకేరీ అరత్ హో పణిర కోళేతారణ్.

నాయకేమ నాయక్ కుణ్సో మోటో వియోర కోళేతారణ్ నాయకేమ నాయక్ భీమా మోటో వియోర కోళేతారణ్ భీమా నాయకేరి అరత్ హో పణిర కోళేతారణ్.

చేట్లు,నదులు,పర్వతాలు,ఆకు,పండ్లు,ధాన్యాలు,పశువులు,పాంచభూతాలు ప్రకృతిలో ఉండే అతి పెద్దవి వాటిని పొగడ్తు పాడి హారతితో సమాప్తం చేసి అక్కచ పెట్టిన మాంసం,ముక్కలను అందరికి పంచి కాళ్ళు, తలకాయలతో కూర వండి, అన్నం,రోట్టెలు చేసి అందరూ భోజనాలు చేసి దేవతలను మళ్ళి యధాస్థానంలో పెట్టి ఈ పండుగను ముగిస్తారు.

మూలాలు

[మార్చు]
  1. "Unveiling the Mysteries of the Seven Bhavani Goddesses of the Banjara Community". Youth Ki Awaaz. 2023-03-27. Retrieved 2024-05-19.
  2. https://www.gotelugu.com. "లంబాడి సంస్కృతి . | Gotelugu.com". https://www.gotelugu.com. Retrieved 2024-05-19. {{cite web}}: External link in |last= and |website= (help)
  3. "Facts About The Seven Bhavani Goddesses Worshiped By Banjara Community In India". theopinionatedindian.com (in Indian English). 2024-04-30. Retrieved 2024-05-19.