బండివెలిగండ్ల
బండివెలిగండ్ల | |
---|---|
![]() | |
అక్షాంశ రేఖాంశాలు: 15°45′15.588″N 79°35′20.724″E / 15.75433000°N 79.58909000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | దర్శి |
విస్తీర్ణం | 13.57 కి.మీ2 (5.24 చ. మై) |
జనాభా (2011)[1] | 1,235 |
• జనసాంద్రత | 91/కి.మీ2 (240/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 620 |
• స్త్రీలు | 615 |
• లింగ నిష్పత్తి | 992 |
• నివాసాలు | 289 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08407 ![]() |
పిన్‌కోడ్ | 523304 |
2011 జనగణన కోడ్ | 590822 |
బండివెలిగండ్ల ప్రకాశం జిల్లా, దర్శి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన దర్శి నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఒంగోలు నుండి 85 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 289 ఇళ్లతో, 1235 జనాభాతో 1357 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 620, ఆడవారి సంఖ్య 615. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 104 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 12. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590822[2].
దర్శి మండలం బండి వెలిగండ్ల
ప్రకాశం జిల్లా దర్శి మండలంలో బండి వెలిగండ్ల గ్రామం కలదు.గ్రామచరిత్ర తెలిసిన వ్యక్తులు మరియు గ్రామస్తులు తెలిపిన ప్రకారం ఈ గ్రామం ఎంతో ప్రాచీనమైనదని మనకు తెలుస్తున్నది.
పూర్వం వెలిగండ్ల గ్రామం 79 కుటుంబాలతో ఉండి సుమారు 634 మంది జనాభా నివశించేవారట.ఈ గ్రామంలో 2550 ఎకరాల భూమి ఉండేదని (1817 లెక్కల ప్రకారం) తెలియుచున్నది.ఓ వైపు వాగు మరోవైపు ఎత్తైన కొండ తో సమృద్దిగా నీటి వనరులతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేదట.
ఓ సమయంలో ఆ గ్రామానికి ఊరూరూ తిరిగి పొట్టపోసుకునే ఒంటరి సాధువు వచ్చాడు. రోజూ కొన్ని ఇళ్ళలో అడుక్కొని దానితో కాలం గడుపుచున్నాడు. అతనికి నాటు వైద్యం తెలుసు. కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు ఉన్నవారికి కొండదగ్గరి ఏవో ఆకులు తెచ్చి పసురు పిండి చిన్నచిన్న వైద్యం చేస్తుండేవాడు.
ఓ రోజు గ్రామంలో బిక్షాటనకు తిరుగుతూ ఓ యవ్వన ప్రాయంలో ఉన్న సౌందర్యవతిని చూశాడు. ఆమెకు కొత్తగా పెళ్లి అయి కాపురానికి వచ్చింది. అత్త,మామ,పెనిమిటి,మరిది బండి కట్టుకొని పొలంపనులకు వెళ్లగా తను ఒక్కతే ఆరుబయట కూర్చొని కురులు సవరించుకుంటూ సుతారంగా తలకు ఆముదాన్ని రాసుకుంటున్నది. ఆమెను చూసిన సాధువుకు దుర్బుద్ధి పుట్టింది తనతో తీసుకెళ్ళాలి అనుకున్నాడు . ఆమె ఇంటి వద్దకు వెళ్లి అమ్మ బిక్షం పెట్టమ్మా అని అడిగాడు. అంత ఆ ఇంటి ఇల్లాలు తనకు కొత్తగా వివాహమైనదని ఇంటిపెత్తనం అత్తగారిదని, తను లేదని, తనకు తెలియదని తెలిపింది. దగ్గరగా వెళ్ళిన సాధువు చారెడు బియ్యానికి భయపడతావేంటి. ఈ రోజు ఎవరూ బిక్షం వెయ్యలేదు నీవు లేదంటే పస్తే అన్నాడు. వెంటనే ఆ ఇల్లాలు ఆముదం గిన్నెను అక్కడే ఉంచి బియ్యం బిక్షం తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. ఇంతలో ఆ సాధువు కపట బుద్ది తో తన వద్ద ఉన్న ఆకు పసరును ఆముదం లో కలిపి తను వేగంగా వెళ్ళిపోయాడు. దగ్గర్లో ఉన్న పులికొండగా పిలవబడుతున్న కొండ శిఖరాన్ని చేరుకున్నాడు. లోపలనుండి బిక్షం తీసుకువచ్చిన ఆ ఇంటి ఇల్లాలుకి సాధువు కనిపించలేదు. అటు ఇటు చూసి ఏమైపోయాడో అనుకొని, తన పనిలో తాను నిమగ్నమైంది. పక్కనే ఉన్న ఆముదం గిన్నెలో ఆముదాన్ని తలకు మళ్ళీ కొంచెం రాసుకుంది. వెంటనే ఆమె మతిస్థిమితం కోల్పోయిన దానిలా తయారై ఆ సాధు వెళ్లిన దారి వెంబడి వెళ్ళ సాగింది.
కొద్ది సమయానికి ఆ ఇంటి యజమాని ఎద్దుల బండి కట్టుకొని వచ్చి భార్యను పిలిచాడు. ఎప్పుడూ ఎదురొచ్చి మంచినీళ్ళు ఇచ్చే భార్య ఎంతకూ తను పలకకపోయేసరికి, ఏంటబ్బా తలుపు తీసే ఉంది ఎక్కడికి వెళ్ళిందో అనుకొని, బండి నుండి ఎద్దుల్ని విప్పి గాటిలో కట్టేశాడు. బయట ఆముదం గిన్నె కనిపించింది.ఆముదాన్ని చూడగానే బండి ఇరుసు శబ్దం చేస్తుందన్న విషయం గుర్తు వచ్చింది. కందెన కూడా అయిపోయింది అనుకొని లోపలికివెళ్లి మంచినీరు తాగి వచ్చి ఆ ఆముదాన్ని కందెనగా ఇరుసుకు రాశాడు.నిమిషాల్లోనే ఎద్దులు లేని బండి యెక్క నగలు పైకి లేచాయి. దక్షిణంవైపు ఉన్న నగలు కుడి వైపుకు తిరిగాయి. తత్తరపడి ఆ ఇంటి యజమాని నిశ్చేష్టుడై కన్నార్పక నోరెళ్ళపెట్టి చూడటంతప్ప ఏమీ చేయలేని స్థితికి చేరుకున్నాడు. సాధువు వెళ్లిన దారిలో బండి కూడా పయనమైంది.
కొన్ని క్షణాల్లో తేరుకున్న యజమాని గట్టిగా కేకలు వేస్తూ పరిగెత్తే ఎద్దులు లేని బండి వెంబడి తాను పరుగెత్త సాగాడు. ముందు సాధువు,వెనుక స్త్రీ,ఆ వెనుక బండి కొండమీదికి చేరుకోసాగాయి. పొలంనుండి వస్తున్న అత్త, మామలతో పాటు గ్రామస్తులు కూడా కొంతమంది కొండమీదికి చేరుకున్నారు.
కొండమీద ఓ చోట సాధువు కూర్చొనిఉండగా ఎదురుగా ఇల్లాలు మగతగా నిలబడి ఉంది. కొంచెం ఆలస్యం అయితే ఏమయ్యేదో?? కొండపైకి
చేరుకున్న ఇంటివారు మరియు గ్రామస్తులు ఆ సాధువును పట్టుకొని కట్టేసి ఇల్లాలు తో సహా బండిని గ్రామంలోకి తీసుకొని వచ్చారు. సాధువును అందరూ గట్టిగా ప్రశ్నించేసరికి తను చేసిన తప్పును క్షమించమని వేడుకొని ఆ విషయానికి విరుగుడు చేశాడు.
ఇప్పటికీ కొండమీదికి బండి దారి ఉంటుంది. కొండ శిఖరాన వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు.ఆనాటి నుండి ఈ వెలిగండ్ల *బండివెలిగండ్ల* అయినది.
ఇది బండి వెలిగండ్ల చరిత్ర.
(గ్రామ కరణం గోపాలుని లక్ష్మీనారాయణ గారు మరియు శ్రీనివాసప్రసాద్ తురిమెళ్ళ వారి రచన దర్శిసీమచరిత్ర ఆధారంగా.
గణాంకాలు
[మార్చు]2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,111. ఇందులో పురుషుల సంఖ్య 557, స్త్రీల సంఖ్య 554, గ్రామంలో నివాస గృహాలు 235 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,357 హెక్టారులు.
సమీప గ్రామాలు
[మార్చు]తూర్పు వెంకటాపురం 6 కి.మీ, చందలూరు 6 కి.మీ, పొట్లపాడు 6 కి.మీ, వెలిగండ్ల 7 కి.మీ, పాములపాడు 7 కి.మీ.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉంది. బాలబడి దర్శిలోను, మాధ్యమిక పాఠశాల తూర్పు వెంకటాపురంలోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల దర్శిలోను, ఇంజనీరింగ్ కళాశాల చీమకుర్తిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్ పొదిలిలోను, మేనేజిమెంటు కళాశాల ఒంగోలులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం దర్శిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలో ఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
పారిశుధ్యం
[మార్చు]మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]బండివెలిగండ్లలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]బండివెలిగండ్లలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 15 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 402 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 4 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 255 హెక్టార్లు
- బంజరు భూమి: 329 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 352 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 926 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 10 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]బండివెలిగండ్లలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- బావులు/బోరు బావులు: 10 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]బండివెలిగండ్లలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".