బనియను
స్వరూపం
బనియన్ చిత్రం | |
| రకం | చేతులు లేని టీ షర్టు |
|---|---|
| మెటీరియల్ | fabric |

బనియను లేదా బాడీ పురుషుల లోదుస్తులలో ఒకటి. ఇది చొక్కా లేదా కుర్తా లోపల వేసుకొంటారు. దీనిని మృదువుగా ఉండే నూలుతో చేస్తారు. దీనికి చేతులు ఉండ (కపోవ) టం ధరించిన వారి వ్యక్తిగత అభిరుచిని బట్టి ఉంటుంది. దీనికి జేబులు ఉండవు. ఎండా కాలంలో చెమట బారి నుండి చొక్కా, కుర్తాలని కాపాడటమే కాకుండా చలి కాలంలో అదనపు పొరగా ఏర్పడి వెచ్చదనాన్నిచ్చేందుకు కూడా ఉపయోగపడుతుంది.
ఇంట్లో ఉన్నప్పుడు, సాంప్రదాయికత అవసరం లేనప్పుడు, వేసవి కాలాలలో పురుషులు వీటిని అత్యధికంగా వాడతారు.
దీనిని స్లీవ్‌లెస్ షర్ట్, ట్యాంక్ టాప్ అని కూడా పిలుస్తారు, ఇది స్లీవ్‌లు లేకుండా లేదా కత్తిరించిన స్లీవ్‌లతో తయారు చేయబడిన చొక్కా. శైలిని బట్టి, వాటిని అండర్‌షర్టులుగా, ట్రాక్ అండ్ ఫీల్డ్ మరియు ట్రయాథ్లాన్ వంటి క్రీడలలో అథ్లెట్లు లేదా పురుషులు మరియు మహిళలు ఇద్దరూ సాధారణ దుస్తులుగా ధరించవచ్చు.