బల్లి కళ్యాణ్ చక్రవర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బల్లి కళ్యాణ్ చక్రవర్తి

పదవీ కాలం
30 మార్చ్ 2021 - 29 మార్చ్ 2027
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

వ్యక్తిగత వివరాలు

జననం (1984-06-07)1984 జూన్ 7
వెంకటగిరి, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగు దేశం పార్టీ
తల్లిదండ్రులు బల్లి దుర్గాప్రసాద్‌, సారలమ్మ
జీవిత భాగస్వామి డా. శ్వేతా తన్నీరు

బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021 మార్చిలో ఎమ్మెల్యే కోటాలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

కళ్యాణ్‌ చక్రవర్తి తండ్రి బల్లి దుర్గాప్రసాద్‌ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎంపీగా గెలిచి 2020 సెప్టెంబరులో కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో చైన్నైలోని ఓ ఆసుపత్రిలో మరణించాడు. ఆయన తన తండ్రి హఠాన్మరణం తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. దుర్గా ప్రసాద్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చాడు.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి 2021లో ఎమ్మెల్యేల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కళ్యాణ్ చక్రవర్తిని వైఎస్సార్‌సీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 2021 ఫిబ్రవరి 25న ఖరారు చేశాడు[2][3]. ఆయన శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయినట్లు 2021 మార్చి 8న ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తెలిపాడు.[4] ఆయన శాసనసభ్యుడిగా 2021 ఏప్రిల్ 1న ప్రమాణ స్వీకారం చేశాడు[5].[6]

మూలాలు[మార్చు]

  1. Sakshi (26 February 2021). "ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో వైఎస్సార్‌సీపీ ప్రత్యేకత". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
  2. TV9 Telugu (25 February 2021). "ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చాణక్యం.. వైసీపీ అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే! - Political history of YCP MLC candidates". Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. News18 Telugu. "వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఈ ఆరుగురే ఎందుకు? ఎవరి నేపథ్యం ఏంటి?". Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Outlook India (8 March 2021). "Six ruling YSR Congress candidates elected unopposed to AP Legislative Council". outlookindia.com/. Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  5. The Times of India (1 April 2021). "Six newly elected Andhra Pradesh MLCs take oath | Amaravati News - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.
  6. Prajashakti (1 April 2021). "ఆరుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం". Archived from the original on 2 April 2021. Retrieved 18 July 2021.