బల్లి దుర్గాప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బల్లి దుర్గాప్రసాద్‌

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2019 ఏప్రిల్ 23 - 2020 సెప్టెంబరు 16
ముందు వరప్రసాద్ రావు వెలగపల్లి
తరువాత గురుమూర్తి
నియోజకవర్గం తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం

శాసనసభ్యుడు
పదవీ కాలం
2009-2014
ముందు పాత్ర ప్రకాశ రావు
తరువాత పాసిం సునీల్ కుమార్
నియోజకవర్గం గూడూరు
పదవీ కాలం
1994-2004
ముందు పాత్ర ప్రకాశ రావు
తరువాత పాత్ర ప్రకాశ రావు
నియోజకవర్గం గూడూరు
పదవీ కాలం
1985-1989
ముందు బల్లి దుర్గాప్రసాద్‌
తరువాత పాత్ర ప్రకాశ రావు
నియోజకవర్గం గూడూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1956-06-15)1956 జూన్ 15
వెంకటగిరి, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం 2020 సెప్టెంబరు 16(2020-09-16) (వయసు 64)[1]
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగు దేశం పార్టీ
జీవిత భాగస్వామి బి. సారలమ్మ
సంతానం బల్లి కళ్యాణ్ చక్రవర్తి

బల్లి దుర్గాప్రసాద్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందాడు.[2]

జననం

[మార్చు]

బల్లి దుర్గాప్రసాద్‌ 1956, జూన్ 15న నెల్లూరు జిల్లా, వెంకటగిరిలో పెంచలయ్య, రామలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. దుర్గాప్రసాద్‌రావు బీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి వెంకటగిరిలోనే న్యాయవాద వృత్తి ప్రారంభించాడు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

బల్లి దుర్గాప్రసాద్‌ రావు 1985లో రాజకీయాల్లో చేరి గూడురు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. అతను గూడూరు నుంచి 1985, 1989, 1994, 1999 & 2009-14 ఎమ్మెల్యేగా గెలిచాడు. 1994లో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీలో చేరి తిరుపతి నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు.[3]

ఎన్నికల్లో పోటీ చేసిన వివరాలు

[మార్చు]
ఎన్నికల్లో పోటీ చేసిన వివరాలు
సంవత్సరం నియోజకవర్గం ప్రత్యర్థి మెజారిటీ (ఓట్లు) ఫలితం
1985 గూడూరు ముంగర రమణయ్య

(కాంగ్రెస్)

22224 గెలుపు [4]
1989 గూడూరు పాత్ర ప్రకాశ రావు

(కాంగ్రెస్)

15396 ఓటమి
1994 గూడూరు పాత్ర ప్రకాశ రావు

(కాంగ్రెస్)

28,350 గెలుపు
1999 గూడూరు పాత్ర ప్రకాశ రావు

(కాంగ్రెస్)

9,770 గెలుపు
2009 గూడూరు కొండాపురం రామమ్మ

(కాంగ్రెస్)

10,638 గెలుపు
2019 తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పనబాక లక్ష్మి (టీడీపీ) 228376 గెలుపు [5]

మరణం

[మార్చు]

కోవిడ్ -19 వ్యాధితో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2020 సెప్టెంబరు 16న గుండెపోటుతో మరణించాడు.[6][7]

మూలాలు

[మార్చు]
  1. "Tirupati MP Balli Durga Prasad Rao dies of Covid-19". Sandeep Raghavan. The Times of India. 16 September 2020. Retrieved 3 May 2021.
  2. loksabhaph.nic.in. "Members : Lok Sabha". Retrieved 3 May 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. News18 Telugu (16 September 2020). "Tirupati MP Balli Durga Prasad: తిరుపతి MP బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూత." Archived from the original on 3 May 2021. Retrieved 3 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Sakshi (17 September 2020). "అజాత శత్రువుగా అందరివాడయ్యారు." Archived from the original on 3 May 2021. Retrieved 3 May 2021.
  5. Times now news. "Tirupati Election Results 2019: YSRCP's Balli Durga Prasad Rao has won with 228376 votes". Archived from the original on 3 May 2021. Retrieved 3 May 2021.
  6. TV9 Telugu (16 September 2020). "BIG BREAKING : తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూత". Archived from the original on 3 May 2021. Retrieved 3 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Eenadu (2020). "తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్‌ కన్నుమూత". Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.