బల్లి దుర్గాప్రసాద్
| బల్లి దుర్గాప్రసాద్ | |||
లోక్‌సభ సభ్యుడు
| |||
| పదవీ కాలం 2019 ఏప్రిల్ 23 - 2020 సెప్టెంబరు 16 | |||
| ముందు | వరప్రసాద్ రావు వెలగపల్లి | ||
|---|---|---|---|
| తరువాత | గురుమూర్తి | ||
| నియోజకవర్గం | తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం | ||
శాసనసభ్యుడు
| |||
| పదవీ కాలం 2009-2014 | |||
| ముందు | పాత్ర ప్రకాశ రావు | ||
| తరువాత | పాసిం సునీల్ కుమార్ | ||
| నియోజకవర్గం | గూడూరు | ||
| పదవీ కాలం 1994-2004 | |||
| ముందు | పాత్ర ప్రకాశ రావు | ||
| తరువాత | పాత్ర ప్రకాశ రావు | ||
| నియోజకవర్గం | గూడూరు | ||
| పదవీ కాలం 1985-1989 | |||
| ముందు | బల్లి దుర్గాప్రసాద్ | ||
| తరువాత | పాత్ర ప్రకాశ రావు | ||
| నియోజకవర్గం | గూడూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1956 జూన్ 15 వెంకటగిరి, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
| మరణం | 2020 September 16 (వయసు: 64)[1] | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | తెలుగు దేశం పార్టీ | ||
| జీవిత భాగస్వామి | బి. సారలమ్మ | ||
| సంతానం | బల్లి కళ్యాణ్ చక్రవర్తి | ||
బల్లి దుర్గాప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందాడు.[2]
జననం
[మార్చు]బల్లి దుర్గాప్రసాద్ 1956, జూన్ 15న నెల్లూరు జిల్లా, వెంకటగిరిలో పెంచలయ్య, రామలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. దుర్గాప్రసాద్‌రావు బీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి వెంకటగిరిలోనే న్యాయవాద వృత్తి ప్రారంభించాడు.
రాజకీయ ప్రస్థానం
[మార్చు]బల్లి దుర్గాప్రసాద్ రావు 1985లో రాజకీయాల్లో చేరి గూడురు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. అతను గూడూరు నుంచి 1985, 1989, 1994, 1999 & 2009-14 ఎమ్మెల్యేగా గెలిచాడు. 1994లో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీలో చేరి తిరుపతి నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు.[3]
ఎన్నికల్లో పోటీ చేసిన వివరాలు
[మార్చు]| సంవత్సరం | నియోజకవర్గం | ప్రత్యర్థి | మెజారిటీ (ఓట్లు) | ఫలితం |
|---|---|---|---|---|
| 1985 | గూడూరు | ముంగర రమణయ్య | 22224 | గెలుపు [4] |
| 1989 | గూడూరు | పాత్ర ప్రకాశ రావు | 15396 | ఓటమి |
| 1994 | గూడూరు | పాత్ర ప్రకాశ రావు | 28,350 | గెలుపు |
| 1999 | గూడూరు | పాత్ర ప్రకాశ రావు | 9,770 | గెలుపు |
| 2009 | గూడూరు | కొండాపురం రామమ్మ | 10,638 | గెలుపు |
| 2019 | తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం | పనబాక లక్ష్మి (టీడీపీ) | 228376 | గెలుపు [5] |
మరణం
[మార్చు]కోవిడ్ -19 వ్యాధితో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2020 సెప్టెంబరు 16న గుండెపోటుతో మరణించాడు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Tirupati MP Balli Durga Prasad Rao dies of Covid-19". Sandeep Raghavan. The Times of India. 16 September 2020. Retrieved 3 May 2021.
- ↑ loksabhaph.nic.in. "Members : Lok Sabha". Retrieved 3 May 2021.
{{cite news}}:|archive-date=requires|archive-url=(help) - ↑ News18 Telugu (16 September 2020). "Tirupati MP Balli Durga Prasad: తిరుపతి MP బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూత." Archived from the original on 3 May 2021. Retrieved 3 May 2021.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (17 September 2020). "అజాత శత్రువుగా అందరివాడయ్యారు." Archived from the original on 3 May 2021. Retrieved 3 May 2021.
- ↑ Times now news. "Tirupati Election Results 2019: YSRCP's Balli Durga Prasad Rao has won with 228376 votes". Archived from the original on 3 May 2021. Retrieved 3 May 2021.
- ↑ TV9 Telugu (16 September 2020). "BIG BREAKING : తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూత". Archived from the original on 3 May 2021. Retrieved 3 May 2021.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (2020). "తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ కన్నుమూత". Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.