బసవరాజేశ్వరి
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
బసవ రాజేశ్వరి | |
---|---|
లోక్సభ సభ్యురాలు | |
In office 1984–1996 | |
అంతకు ముందు వారు | గంగప్ప |
తరువాత వారు | కేసి కొండయ్య |
నియోజకవర్గం | బళ్లారి లోక్ సభ నియోజకవర్గం |
భారత స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి | |
In office 1994–1996 | |
నియోజకవర్గం | బళ్లారి లోక్ సభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1921 రాయదుర్గం అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం |
మరణం | 2008 ఫిబ్రవరి 19 బళ్లారి కర్ణాటక భారతదేశం |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
ఇతర రాజకీయ పదవులు | భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ |
తల్లిదండ్రులు | వీరారెడ్డి |
నైపుణ్యం | వ్యవసాయ వేత్త, విద్యావేత్త, వ్యాపారవేత్త సామాజిక కార్యకర్త |
బసవరాజేశ్వరి ఒక భారతీయ రాజకీయవేత్త 3 సార్లు పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయ్యారు. (MP), భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభలో బళ్లారి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. బసవ రాజేశ్వరి 1991 నుండి 1996 వరకు భారతదేశ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.
బాల్యం
[మార్చు]బసవ రాజేశ్వరి 1928లో అనంతపురం జిల్లా ( ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ) రాయదుర్గంలో జన్మించారు. బసవ రాజేశ్వరి తన విద్యను బళ్లారి (కర్ణాటక) లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పూర్తి చేసింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]బసవ రాజేశ్వరి 1948 మే 22న శరణ బసవరాజ్‌ను వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు నలుగురు కుమారులు నలుగురు కూతుళ్లు ఉన్నారు.
రాజకీయ జీవితం
[మార్చు]బసవ రాజేశ్వరి, పివి నరసింహారావు మంత్రివర్గంలో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. బసవ రాజేశ్వరి 1962 నుంచి 1967 వరకు కర్ణాటక రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఒక పర్యాయం కర్ణాటక శాసనమండలి సభ్యుజాగా పనిచేశారు.
బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి బసవ రాజేశ్వరి ఎంపిగా వరుసగా మూడుసార్లు గెలిచారు. బసవ రాజేశ్వరి 1957లో రాయచూర్ జిల్లాలోని లింగసుగూర్ నుండి శాసనసభ సభ్యురాలిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. 1977 నుంచి 1984 వరకు బసవ రాజేశ్వరి కర్ణాటక రాష్ట్ర శాసనమండలి సభ్యురాలుగా పనిచేశారు.
బసవ రాజేశ్వరి 1984, 1989 1991లో మూడుసార్లు బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి గెలుపొంది పివి నరసింహారావు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.
చైనాలోని బీజింగ్‌లో జరిగిన ప్రపంచ మహిళా సదస్సుకు కేంద్ర మంత్రిగా బసవరాజేశ్వరి భారతదేశం తరపున హాజరయ్యారు.[1]
2004లో బసవరాజేశ్వరి భారతీయ జనతా పార్టీలో చేరి బళ్లారిలోనే కాకుండా పొరుగు జిల్లాల్లో కూడా పార్టీ తరపున ప్రచారం చేశారు.[2]
- ↑ BLUSTER ALL AROUND
- ↑ Congress leaders made me quit: BasavarajeshwariThis article or section is not displaying correctly in one or more Web browsers. (April 2021)