బాటిల్‌గ్రౌండ్ తెలంగాణ (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాటిల్‌గ్రౌండ్ తెలంగాణ: క్రానికల్ ఆఫ్ యాన్ అజిటేషన్
ప్రథమ ముద్రణ
రచయిత(లు)కింగ్‌షుక్ నాగ్
దేశంభారతదేశం
భాషఇంగ్లీష్
విషయంతెలంగాణ ఉద్యమం
ప్రచురణ కర్తహార్పర్‌కాలిన్స్
ప్రచురించిన తేది
2011 జూలై 8
పుటలు256
ISBN978-93-5029-074-3

బాటిల్‌గ్రౌండ్ తెలంగాణ: క్రానికల్ ఆఫ్ యాన్ అజిటేషన్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి ముందు జరిగిన తెలంగాణ ఉద్యమం గురించి పాత్రికేయుడు, టైమ్స్ ఆఫ్ ఇండియా సంపాదకుడు కింగ్‌షుక్ నాగ్ రాసిన పుస్తకం.[1][2] ఇది 2011 జూలై 8న విడుదలైంది.

నేపథ్యం[మార్చు]

1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు, తెలంగాణ ప్రజలు (స్వాతంత్ర్యం సమయంలో నిజాంలు పాలించిన ప్రాంతం) దానిలో భాగం కావడానికి ఇష్టపడలేదు, ఆంధ్ర ప్రాంతం నుండి వలస వచ్చిన వారు మరింత ఔత్సాహిక, మెరుగైన విద్యావంతుల వల్ల స్థానభ్రంశం చెందుతారని భయపడ్డారు. 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం పెద్దఎత్తున జరిగిన ఆందోళనలు 400 మందిని బలిగొన్నాయి, అయితే ఉద్యమం ఉధృతమైంది. 2000లో జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాంచల్‌ వంటి కొత్త రాష్ట్రాల ఏర్పాటుతో మరోసారి తెలంగాణ పోరు మొదలైంది. 2009లో, భారత ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉంటుందని ప్రకటించింది. అయితే, తెలంగాణ మధ్యలో ఉన్న హైదరాబాద్ నగరం కీలకంగా మారిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సంక్లిష్ట సమస్యలు, అంతర్లీన కారణాలను ఈ పుస్తకంలో విశ్లేషించబడ్డాయి.[3]

సారాంశం[మార్చు]

ఈ పుస్తకంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన చరిత్రను వివరిస్తూ ఆ ప్రాంతం, ఆంధ్రాప్రాంత సాంస్కృతిక నేపథ్యాలను వివరించారు. హైదరాబాద్ నిజాంల పాలనలో తెలంగాణ, ప్రాథమిక అవసరాల కోసం తెలంగాణ ప్రజల పోరాటం, అలాగే మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైన బ్రిటిష్ రాజ్ కాలంలో ఆంధ్ర ప్రాంతం గురించి ఈ పుస్తకంలో వివరించబడింది.[4]

విడుదల[మార్చు]

ఈ పుస్తకం 2011 జూలై 8న దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ క్రూసేడర్ ప్రశాంత్ భూషణ్ చేతులమీదుగా విడుదలయింది. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అప్పటి నిజామాబాదు ఎంపీ మధు యాస్కీగౌడ్‌, బిజెపి అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కె.టి.రామారావు, జాతీయ బ్యూరో హిందూ చీఫ్ సిద్ధార్థ్ వరదరాజన్ తదితరులు పాల్గొన్నారు.[5]

మూలాలు[మార్చు]

  1. "A new look at Battleground Telangana". The Hindu. 9 July 2011. Retrieved 2023-01-21.
  2. "Paperback Pickings". The Telegraph. India. 24 June 2011. Retrieved 2023-01-21.
  3. "Battleground Telangana: Chronicle Of An Agitation". www.amazon.in. 2011-05-27. Archived from the original on 2015-09-01. Retrieved 2023-01-21.
  4. Nag, Kingshuk (2011-05-27). Battleground Telangana: Chronical Of An Agitation (in ఇంగ్లీష్). Harper Collins. ISBN 978-93-5029-530-4.
  5. "A new look at Battleground Telangana". The Hindu. 2011-07-09. ISSN 0971-751X. Archived from the original on 2023-01-21. Retrieved 2023-01-21.

బయటి లింకులు[మార్చు]