Jump to content

బిద్యుత్ బరన్ మహతో

వికీపీడియా నుండి
బిద్యుత్ బరన్ మహతో
బిద్యుత్ బరన్ మహతో


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 మే 2014
ముందు అజోయ్ కుమార్
నియోజకవర్గం జంషెడ్‌పూర్

జార్ఖండ్ శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
2009 – 2014
ముందు దినేష్ సారంగి
తరువాత కునాల్ సారంగి
నియోజకవర్గం బహరగోర

వ్యక్తిగత వివరాలు

జననం (1963-02-15) 1963 ఫిబ్రవరి 15 (వయసు 61)
కృష్ణపూర్ , జార్ఖండ్ , భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2014–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు జార్ఖండ్ ముక్తి మోర్చా (2014 వరకు)
తల్లిదండ్రులు సురేంద్ర మహతో, సుహశీల మహతో
జీవిత భాగస్వామి ఉషా మహతో (మ.13 మే 1992)
సంతానం 2
నివాసం కృష్ణపూర్, సెరైకెలా ఖర్సవాన్ , జార్ఖండ్
వెబ్‌సైటు Official Website
మూలం [1]

బిద్యుత్ బరన్ మహతో (జననం 15 ఫిబ్రవరి 1963) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జంషెడ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

బిద్యుత్ బరన్ మహతో జార్ఖండ్ ముక్తి మోర్చా ద్వారా రాజకీయాలలోకి వచ్చి వివిధ హోదాల్లో పని చేసి 2000, 2005లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బహరగోర శాసనసభ నియోజకవర్గం నుండి బహరగోరా నుండి ఓడిపోయి ఆ తరువాత 2009 శాసనసభ ఎన్నికలలో బహరగోర శాసనసభ నియోజకవర్గం నుండి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జంషెడ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేఎంఎం అభ్యర్థి డాక్టర్ అజయ్ కుమార్‌పై 99,876 ఓట్లతో మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

బిద్యుత్ బరన్ మహతో 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జంషెడ్‌పూర్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేఎంఎం అభ్యర్థి చంపై సోరెన్‌ పై 3,02,090 ఓట్లతో మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జేఎంఎం అభ్యర్థి సమీర్ కుమార్ మొహంతిపై 2,59,782 ఓట్లతో మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5][6]

మూలాలు

[మార్చు]
  1. TV9 Bharatvarsh (5 June 2024). "BJP के विद्युत वरण महतो जमशेदपुर से ढाई लाख से अधिक वोटों के अंतर से जीते, जानिए उनके बारे में". Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. TimelineDaily (21 March 2024). "Jharkhand: Bidyut Baran Mahato, BJP Candidate From Jamshedpur Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
  3. The Times of India (10 June 2019). "Bidyut gets highest votes from Jamshedpur seat since 1957". Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
  4. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Jamshedpur". Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
  5. "Close contests with hidden surprises". 12 May 2019. Retrieved 26 July 2024.
  6. India Today (4 June 2024). "Jamshedpur lok sabha election results 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.