బి.ఆర్. ఇషారా
బి.ఆర్. ఇషారా | |
---|---|
జననం | రోషన్ లాల్ శర్మ 1934 సెప్టెంబరు 7 భర్వైన్, ఉనా జిల్లా, హిమాచల్ ప్రదేశ్ |
మరణం | 2012 జూలై 25 | (వయసు 77)
క్రియాశీల సంవత్సరాలు | 1964-1996 |
జీవిత భాగస్వామి | రెహనా సుల్తాన్ |
బాబు రామ్ ఇషారా (రోషన్ లాల్ శర్మ[1] 1934, సెప్టెంబరు 7 - 2012, జూలై 25 ) హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సినిమా దర్శకుడు. 1970లలోని సినిమాలకు స్క్రీన్ ప్లే రచయితగా ప్రసిద్ధి చెందాడు. 1964 - 1996 మధ్యకాలంలో 35 బాలీవుడ్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. చేతన, లోగ్ క్యా కహెంగే, మిలాప్, మన్ జైయే, ఘర్ కి లాజ్, వో ఫిర్ ఆయేగీ, సౌతేలా భాయ్, దూస్రా రూప్ 1982 వంటి సినిమాలతో బాగా ప్రాచుర్యం పొందాడు.[2]
జననం
[మార్చు]ఇషారా 1934, సెప్టెంబరు 7న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, ఉనా జిల్లాలోని భర్వైన్[3]లో జన్మించాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]1984లో బాలీవుడ్ నటి రెహానా సుల్తాన్ తో వివాహం జరిగింది.
సినిమారంగం
[మార్చు]ఇతడు తీసిన ఇన్సాఫ్ కా మందిర్ సినిమాలో తరుణ్ బోస్, అరుణా ఇరానీ తదితరులు నటించారు. ఆ తరువాత చరిత్ర సినిమాతో క్రికెటర్ సలీం దుర్రానీని సినిమాల్లోకి తీసుకువచ్చాడు.పర్వీన్ బాబీ, స్వరకర్త బప్పి లాహిరిని కూడా సినిమారంగానికి పరిచయం చేశాడు. డానీ డెంగ్జోంగ్ప, రాకేష్ పాండే, విజయ్ అరోరా, జయ భాదురి, అమితాబ్ బచ్చన్, రీనా రాయ్, శతృఘ్న సిన్హా, రాజ్ కిరణ్, రజా మురాద్ వంటి అనేకమంది కొత్తవారితో కలిసి పనిచేశాడు. 1988లో రాజేష్ ఖన్నాతో తీసిన వో ఫిర్ అయేగీ సినిమా సిల్వర్ జూబ్లీ హిట్ కాగా, సౌతేలా భాయ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
సినిమాలు
[మార్చు]దర్శకత్వం
[మార్చు]క్రమసంఖ్య | సంవత్సరం | సినిమా | ఇతర వివరాలు |
---|---|---|---|
1 | 1964 | ఆవారా బాదల్ | |
2 | 1969 | ఇన్సాఫ్ కా మందిర్ | కథా రచయిత |
3 | 1970 | గునా ఔర్ కానూన్ | |
4 | చేతన | ||
5 | 1971 | మన్ తేరా తన్ మేరా | |
6 | 1972 | మనిషి జైయే | |
7 | ఏక్ నాజర్ | ||
8 | జరూరత్ | ||
9 | మిలాప్ | ||
10 | 1973 | నై దునియా నయే లాగ్ | |
11 | హాతీ కే దాంట్ | ||
12 | ఏక్ నావో దో కినారే | ||
13 | దిల్ కి రహెన్ | ||
14 | చరిత్ర | ||
15 | 1974 | ప్రేమ్ శాస్త్రం | |
16 | దావత్ | ||
17 | బజార్ బ్యాండ్ కరో | ||
18 | 1975 | కాగజ్ కి నావో | |
19 | 1978 | రాహు కేతువులు | |
20 | పాల్ దో పాల్ కా సాత్ | ||
21 | 1979 | ఘర్ కీ లాజ్ | |
22 | 1981 | ఖరా ఖోటా | |
23 | కరణ్ | ||
24 | 1982 | లాగ్ క్యా కహెంగే | |
25 | 1983 | జై బాబా అమర్‌నాథ్ | |
26 | 1984 | ఔరత్ కా ఇంతేకం | |
27 | హమ్ దో హమారే దో | బి. ఆర్ గా. ఇషార | |
28 | 1985 | సౌతేల పతి | |
29 | 1986 | ఔరత్ | |
30 | 1987 | బేసహారా | |
31 | 1988 | వో ఫిర్ ఆయేగీ | |
32 | సిల | ||
33 | 1994 | జనమ్ సే పెహ్లే | |
34 | 1996 | సౌతేలా భాయ్ | |
35 | హుకుమ్నామా |
మరణం
[మార్చు]ఇషారా 77 సంవత్సరాల వయస్సులో క్షయవ్యాధితో[4] 2012, జూలై 24న ఉదయం 1:30 గంటలకు ముంబైలోని క్రిటికేర్ ఆసుపత్రిలో మరణించాడు.[5][6][7]
మూలాలు
[మార్చు]- ↑ B.R. Ishara (1934–2012)
- ↑ A director who created bold cinema Archived 2 జనవరి 2010 at the Wayback Machine
- ↑ Most Popular People Born In Bharwain, Chintpurni, Himachal Pradesh, India
- ↑ Film director Ishara dies at 77 - Times Of India
- ↑ Director BR Ishara passes away by Vaibhavi Risbood. Dainik Bhaskar.
- ↑ Filmmaker B R Ishara dies
- ↑ Film writer-director B R Ishara passes away in Mumbai | NetIndian
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో బి.ఆర్. ఇషారా పేజీ