Jump to content

బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి

వికీపీడియా నుండి
(బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి నుండి దారిమార్పు చెందింది)
బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి
స్త్రీ పాత్రలో బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి
జననంబుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి
ఫిబ్రవరి 9, 1936
కృష్ణా జిల్లా, అవనిగడ్డ దగ్గర పోతుగడ్డ
మరణంఏప్రిల్ 7, 2019
హైదరాబాదు, తెలంగాణ
ఇతర పేర్లు"నాట్యాచార్య"
ప్రసిద్ధిస్త్రీ పాత్రధారణలో గొప్ప పేరు సంపాదింఛుకొన్న నటనాగ్రేసరుడు
ఉత్తమ స్త్రీ పాత్రలైన సత్యభామ, చింతామణి, సక్కుబాయి, చంద్రమతి, మోహిని, మాధురి మొదలైన పాత్రలు

బుఱ్ఱా సుబ్రహ్మణ్యశాస్త్రి, (ఫిబ్రవరి 9, 1936 - ఏప్రిల్ 7, 2019) స్త్రీ పాత్రధారణలో గొప్ప పేరు సంపాదించుకున్న నటనాగ్రేసరుడు.[1][2]

జననం

[మార్చు]

కృష్ణా జిల్లా, అవనిగడ్డ దగ్గర పోతుగడ్డ లో 1936, ఫిబ్రవరి 9 న జన్మించాడు.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]
బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి

శాస్త్రి మేనమామ కొటేశ్వరరావు స్వతహాగా హరిదాసు. ఉత్తమ గాయకుడు. మేనమామ పర్యచేక్షణలో పద్యాలు, పాఠాలు శ్రావ్యముగా పాడుట నేర్చుకున్నాడు. వానపాముల సత్యనారాయణ వద్ద పద్యాలు భావయుక్తముగా పాడుట, చిత్రకళలోని మెలకువలు నేర్చుకున్నాడు. శాస్త్రి నటనా విశిష్ఠత గుర్తించిన బి.వి. నరసింహారావు నాట్యశాస్త్రములోని నూతన ప్రయోగ రీతులన్నీ నేర్పాడు. శాస్త్రి అన్న తగినంత ప్రోత్సాహమిచ్చి నాటకరంగాన నిలిపి ఉత్తమ స్త్రీ పాత్రధారిగా తీర్చి దిద్దాడు. అకుంఠిత కార్యదీక్షతో ఉత్తమ స్త్రీ పాత్రలైన సత్యభామ, చింతామణి, సక్కుబాయి, చంద్రమతి, మోహిని, మాధురి మొదలైన పాత్రలు ధరించి ఆంధ్ర దేశ ముఖ్య పట్టణాలలో స్త్రీ పాత్రధారణలో "ఔరా" అనిపించుకున్నాడు. స్వంతంగా సత్యసాయిబాబా నాటక సమాజము స్థాపించి నాటక ప్రదర్శనలిచ్చి రసజ్ఞులందరి మెప్పు పొందాడు. శాస్త్రి పాత తరం నటుల సంప్రదాయాలైన క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర అన్వేషణ, నిత్యసాధన, కొత్త ప్రయోగాలపై తపన, ఆశయసాధన కనిపిస్తాయి.

శాస్త్రి స్త్రీ పాత్రలన్నింటిలోను ఒక నూతనత్వం గోచరిస్తుంది. కవి సృష్టించిన పాత్రకు న్యాయము చేస్తూ, మరొకవైపు సృజనాత్మక రూపం పాత్రకు ఆపాదింపచేసి సజీవ శిల్పం తో రాణింపు కలగచేస్తాడు. భావయుక్తమైన సంభాషణ విధానమూ, ఆ విధానానికి తగిన సాత్విక చలనమూ, ఆ చలనముతో సమ్మిళితమైన నేత్రాభినయనమూ, పలుకూ, కులుకూ, సొంపూ, ఒంపూ, హొయలు, ఒయ్యారాలతో నాట్యమయూరిలా, శృంగార రసాధిదేవతగా ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరయ్యేటట్లు నటించేవాడు. చూపు మన్మధ బాణంలా ఉండేది. ప్రేక్షకుల కరతాళధ్వనితో నిండిపోయేది. శాస్త్రి స్త్రీ పాత్రాభినయానికి ముగ్ధులైన విశ్వనాధ సత్యనారాయణ "నాట్యాచార్య" బిరుదునిచ్చాడు. ఆంధ్ర ప్రజానీకం "అభినయ సరస్వతి" అని, కొండవీటి వెంకటకవి "నాట్యమయూరి" అని బిరుదులిచ్చారు. అనేక చోట్ల ఘన సన్మానాలు, బంగారు కంకణాలనూ అందుకున్నాడు.[3]

ఇతర వివరాలు

[మార్చు]

ఈయన కుమారుడైన సాయిమాధవ్‌ బుర్రా తెలుగు సినీరంగంలో రచయితగా పనిచేస్తున్నాడు.[4]

మరణం

[మార్చు]

2019, ఏప్రిల్ 7న హైదరాబాదులో మరణించాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. నవతెలంగాణ, తాజా వార్తలు (7 April 2019). "బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి కన్నుమూత". Archived from the original on 11 April 2019. Retrieved 11 April 2019.
  2. మన తెలంగాణ, జాతీయ వార్తలు (7 April 2019). "అభినవ చింతామణి బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి కన్నుమూత". Archived from the original on 11 April 2019. Retrieved 11 April 2019.
  3. ఈనాడు, ఆంధ్రప్రదేశ్-ప్రధాన వార్తలు (8 April 2019). "'అభినవ చింతామణి' ఇక లేరు". Archived from the original on 11 April 2019. Retrieved 11 April 2019.
  4. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి, సినిమా కబుర్లు (27 March 2017). "చరిత్రలో నాకో పేజీ ఉండాలి: బుర్రా సాయిమాధవ్". Archived from the original on 7 April 2019. Retrieved 7 April 2019.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
  5. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-సినిమా కబుర్లు (7 April 2019). "బుర్రా సాయిమాధవ్‌కు పితృ వియోగం". Archived from the original on 11 April 2019. Retrieved 11 April 2019.
  6. ఆంధ్రజ్యోతి గుంటూరు జిల్లా ఎడిషన్ తేది:08.04.2019; పేజీ సంఖ్య 8

ఆధార గ్రంథాలు

[మార్చు]
  • బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 296.