Jump to content

బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి

వికీపీడియా నుండి
బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
వ్యక్తిగత వివరాలు
జననం (1980-04-06) 1980 ఏప్రిల్ 6 (వయసు 44)
చీమకుర్తి, ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ భారతదేశం
రాజకీయ పార్టీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
భారత జాతీయ కాంగ్రెస్
వృత్తివైద్యుడు రాజకీయ నాయకుడు

బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. [1] శివప్రసాద్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున దర్శి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశాడు. 2014లో శివప్రసాద్ రెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ( వైఎస్‌ఆర్‌సీపీ ) తరపున పోటీ చేసి ఓడిపోయారు. కుటుంబ సమస్యల కారణంగా శివప్రసాద్ రెడ్డి 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. శివప్రసాద్ రెడ్డి పేర్నమిట్టలోని బివి సుబ్బయ్య పాఠశాలలో చదివాడు. రాజకీయాల్లోకి రాకముందు శివప్రసాద్ రెడ్డి శ్రీరామచంద్ర వైద్య కళాశాలలో డాక్టరేట్‌ అందుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

శివప్రసాద్ రెడ్డి 2005లో రాజకీయాల్లోకి ప్రవేశించి చీమకుర్తి మండల పరిషత్ నుంచి ఎంపీటీసీగా గెలుపొందారు. తరువాత శివప్రసాద్ రెడ్డి చీమకుర్తి మండల ఎంపీపీగా పని చేశాడు. [ వివరణ అవసరం ]

తరువాత, 2009 శాసనసభ ఎన్నికలలో శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకటరమణను ఓడించి దర్శి నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా, గెలుపొందాడు. [2] [ వివరణ అవసరం ]

2014లో శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శిద్ధా రాఘవరావు చేతిలో ఓడిపోయారు. [3]

సంవత్సరం నియోజకవర్గం రాజకీయ పార్టీ ఫలితం
2009 దర్శి కాంగ్రెస్ గెలుపు
2014 దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి

శివప్రసాద్ రెడ్డి 2019 ఎన్నికలలో పోటీ చేయలేదు దర్శి సంతనూతలపాడు నియోజకవర్గంలో తన అధినేత జగన్ సూచించిన పార్టీ అభ్యర్థులకు శివప్రసాద్ రెడ్డి మద్దతు తెలిపాడు. వారి గెలుపుకు కీలక పాత్ర పోషించాడు. [4]

మూలాలు

[మార్చు]
  1. "Buchepalli Siva Prasad Reddy (Yuvajana Sramika Rythu (Congress Party): Constituency- Darsi (Prakasam) – Affidavit Information of Candidate". myneta.info. Retrieved 20 August 2019.
  2. "Buchepalli Siva Prasada Reddy (Indian National Congress (INC)): Constituency- Darsi (Prakasam) – Affidavit Information of Candidate". myneta.info. Retrieved 20 August 2019.
  3. India, The Hans (2 March 2018). "Buchepalli Active Again In YSR Congress". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 20 August 2019.
  4. "Cong MLA set to join YSR Congress". The Times of India (in ఇంగ్లీష్). 2 January 2013. Retrieved 20 August 2019.