బొజ్జపల్లి రాజయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొజ్జపల్లి రాజయ్య

ఎమ్మెల్యే
పదవీ కాలం
1985 – 1990
నియోజకవర్గం స్టేషన్‌ ఘన్‌పూర్‌

ఎమ్మెల్యే
పదవీ కాలం
1999 – 2004
నియోజకవర్గం పరకాల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1950
గరిమిళ్ళపల్లి, టేకుమట్ల మండలం, జయశంకర్ జిల్లా , తెలంగాణ రాష్ట్రం , భారతదేశం
మరణం 16 డిసెంబర్ 2016
హైదరాబాద్
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

బొజ్జపల్లి రాజయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. ఆయన 1985లో స్టేషన్‌ ఘన్‌పూర్‌, 1999లో పరకాల నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా పని చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

బొజ్జపల్లి రాజయ్య తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985లో స్టేషన్‌ఘన్‌పూర్ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బానాల ఆనందం పై 19213 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. ఆయన 1989లో జరిగిన ఎన్నికల్లో స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆరోగ్యం చేతిలో 5466 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.[1]

బొజ్జపల్లి రాజయ్య 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుల్లా పద్మావతి పై 15094 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశాడు. రాజయ్య తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం పని చేసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు. రాజయ్య పరకాల, భూపాలపల్లి, హన్మకొండ లో టిఆర్ఎస్ పార్టి కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నాడు.

మరణం[మార్చు]

బొజ్జపల్లి రాజయ్య అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 16 డిసెంబర్ 2016న మరణించాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (9 November 2018). "విలక్షణ తీర్పునకు వేదిక స్టేషన్‌." Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
  2. Mana Telangana (17 December 2016). "మాజీ ఎంఎల్‌ఎ బొజ్జపల్లి రాజయ్య మృతి". Archived from the original on 21 July 2021. Retrieved 21 July 2021.
  3. Andrajyothy (17 December 2016). "మాజీ ఎమ్మెల్యే బొజ్జపల్లి రాజయ్య మృతి". Archived from the original on 21 July 2021. Retrieved 21 July 2021.