బొర్రంపేట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బొర్రంపేట
Borram Peta
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం లక్ష్మీనరసుపేట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 798
 - పురుషుల సంఖ్య 392
 - స్త్రీల సంఖ్య 406
 - గృహాల సంఖ్య 202
పిన్ కోడ్ 532458
ఎస్.టి.డి కోడ్ 08942
వెబ్‌సైటు: not available

బొర్రంపేట (BORRAMPETA) గ్రామం లక్ష్మీనరసుపేట (ఎల్. ఎన్. పేట) మండలం, శ్రీకాకుళం జిల్లాలో వుంది.[1] ఈ గ్రామం శ్రీకాకుళంనకు ౩౦ కి.మీ దూరంలో వుంది. ఈ గ్రామంలో అక్షరాస్యులు ఎక్కువ. ఈ గ్రామము అభివృద్ధి అంత అంత మాత్రమే.సరైన డ్రైనేజ్ సౌక్యర్యం లేదు.

ఈ గ్రామంలో చాలా సంవత్సరాల నుండి కరెంటు సౌకర్యం ఉంది. 90 % ప్రజలు కరెంటుని వినియోగిస్తున్నారు.

ఈ గ్రామ ప్రజలు చెరువులు లోను, బావిల లోను స్నానం చేస్తుంటారు.

ప్రతి ఇంటికి సొంత మరుగు దొడ్లులు కానీ స్నానపు గదులు కానీ లేవు. 40 శాతం ప్రజలు మరుగు దొడ్లు, స్నానపు గదులు కలిగి ఉన్నారు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 798 - పురుషుల సంఖ్య 392 - స్త్రీల సంఖ్య 406 - గృహాల సంఖ్య 202

మూలాలు[మార్చు]

గ్రామం లోని కులాలు[మార్చు]

 • కళింగ
 • కాపు
 • కంసాలి
 • జంగం
 • చాకలి
 • క్షురకులు
 • మాల
 • రెల్లి

బొర్రంపేట గ్రామం లోని మతాలు[మార్చు]

 • హిందూ మతం

గ్రామం లోని దేవాలయాలు[మార్చు]

బొర్రంపేట గ్రామంలో 3 దేవాలయాలు ఉన్నాయి

 • వెంకటేశ్వర స్వామి ఆలయం
 • గ్రామ దేవత ఆలయం
 • నీలమ్మ గుడి

బొర్రంపేట గ్రామ ప్రజల గురుంచి[మార్చు]

ఈ గ్రామ ప్రజలు అధిక దైవభక్తి, దైవ చింతన కలవారు.

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

శ్రీమతి ఫున్నాలమ్మ మరియు శ్రీ రాజప్పల నాయుడు దంపతులు

వీరికి సంతానము ముగ్గురు కుమార్తెలు, అయిదుగురు కుమారులు. అందరికినీ మంచి విద్యాబుద్ధులు నేర్పించారు. వీరి మనవల్లు మరియు మనుమరాండ్లు తాతయ్య నాన్నమ్మ పట్ల గొప్ప ఆరాధన కలిగియున్నారు. తాతయ్య నెమలి బొమ్మలు, ఏనుగు బొమ్మలను చాలా ఆసువుగా పలకపై వేసి మనవళ్లకు చూపించి ఆనందపరిచేవారు.

ఇతను దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఊరి పెద్దగా తన వంతు పాత్ర పోషించారు. స్వాతంత్ర్యము సిద్ధించాక కడ వరకునూ గ్రామానికి దిశా నిర్దేశము చేశారు. ఇతని మాతృ భూమి మమకారమునకు దేశ సేవకు కృతజ్ఞతాపూర్వకముగానా అన్నట్టుగా, దేవతల ఆశీర్వచనముల తోడ సాదర స్వాగతమునకు సూచికగానా అన్నట్టుగా, పూల వర్షమా అన్నట్టుగా ఆతని దహన సంస్కారము రోజున చిరు జల్లులు పడెను. ఇది చూసిన గ్రామవాసులు పుణ్యాత్ములైన మహానుభావులకు దేవతలు ఈరీతిగనే కదా తమలో కలుపుకొందురు అని స్మరించుకొనెను.

గ్రామవాసులకు ఈతనిపై ఉన్న గౌరవ మర్యాదలను చూసినవారైన మనవళ్లు తాతయ్యను ప్రేరణగా తీసుకుని సదా మంచి చేయుటకై మనసులో దృఢీకరించుకున్నారు. ఎప్పుడూ హాయిగా నవ్వుతూ ఆనందమంటే ఇదేరా అన్నట్లుగా తన మనవళ్లతో ఆడుకునే తాతయ్య, పై లోకములో అతి ముఖ్యమైన కార్యము ఉన్నదా అన్నట్లుగా, మనవళ్లకు తెలిసీ తెలియని వయసు లోనే, శాశ్వతముగా ఇక కనిపించరు అంటే అర్ధం కూడా తెలియని వయసులో సుదూర లోకానికి తన పయనం మనవళ్లను తీవ్రంగా బాధించింది. మాకు మీతో మళ్లీ ఆడుకోవాలని ఉంది తాతయ్యా. ఇక మళ్లీ ఎప్పుడు అలా ఉంటామో (బహుశః ఈ ఆలోచనకు అర్ధం కూడా లేదేమో ఇప్ప్దుడు మనకున్న పరిమిత జ్ఞానముతో...)

బొర్రంపేట గ్రామ ప్రజల జీవన విధానం[మార్చు]

ఈ గ్రామంలో ప్రజల యొక్క ముఖ్యమైన జీవన ఆధారం వ్యవసాయం. ఇక్కడి ప్రజల వ్యవసాయం వర్షాదారం. ఇప్పుడిపుడు (2002 సవత్సరం నుండి ) బొర్రంపేట గ్రామ యువకులు ఆటో, జీపు, ట్రాక్టర్ లు కొని జీవనం సాగిస్తున్నారు. చాలా మంది గవర్నమెంట్, ప్రైవేటు ఉద్యోగులుగా స్థిరపడ్డారు.

బొర్రంపేట గ్రామ విద్యార్దులు[మార్చు]

ఈ గ్రామంలో ఒక ఎలిమెంటరీ పాఠశాల వుంది. ఈ పాఠశాలలో 1 నుండి 5 వ తరగతి వరకు బోదిస్తారు.5 వ తరగతి నుండి బయట ఊళ్ళలో చదువుకుంటారు. ఈ గ్రామ విద్యార్థులు వివిధ పాఠశాల లలో చదివి తరగతిలో మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకున్నారు. 2006 వ సంవత్సరం వరకు ఈ గ్రామ విద్యార్థులు షలంత్రి, కొత్త కోట, కరకవలస పాఠశాల లలో 10 వ తరగతి వరకు చదువుకునేవారు. ఆ తరువాత ఇంటర్మీడియట్ ఆమదాలవలస, హిరమండలం, శ్రీకాకుళం లలో చదువు కునేవాళ్ళు.

గ్రామమ లోని వివాదాలు[మార్చు]

ఈ గ్రామము చిన్నది అయినప్పటికీ, ఎన్నికల సమయంలో గ్రామములో రెండు వర్గాలుగా విడిపోయి విచక్షణ జ్ఞానాన్ని విడుస్తారు. ఎన్నికల సమయంలో కర్రలతో కొట్టు కోవడం, రాళ్లు విసురుకోవడం వీరి ప్రత్యేకత. తాగుబోతులు నెలకి ఒక సారైనా గోడవ చేస్తుంటారు. ఇక్కడి ప్రజల వ్యవసాయం వర్షాదారం కనుక ప్రతి సంవత్సరం నీటికి సంబంధించిన గొడవలు ఎలాను ఉంటాయి.

బొర్రంపేట చిరునామా[మార్చు]

బొర్రంపేట గ్రామము
గోనుపాడు పోస్ట్
ఎల్ ఎన్ పేట మండలం
శ్రీకాకుళం జిల్లా
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము
ఇండియా
పిన్ కోడ్ : 532458

బొర్రంపేట కి ఎలా చేరుకోవాలి?[మార్చు]

బొర్రంపేట రోడ్డు, రైలు మార్గాలతో అనుసందానిచబడింది. ఈ గ్రామమునకు చేరుకోవడం అత్యంత సులభము.

శ్రీకాకుళం, ఆమదాలవలస నుండి హిరమండలం, పాతపట్నం, కొత్తూరు, బత్తిలి, గునుపూర్, నీలకంటాపురం, ఆకులతంపర వెళ్లే బస్సులు ఎక్కితే బొర్రం పేట చెరుకొవచ్చు. శ్రీకాకుళం నుండి బొర్రంపేటకు ప్రయాణ సమయం ఒక గంట పడుతుంది. ఆమదాలవలస నుండి బొర్రంపేటకు ప్రయాణ సమయం 30 నుండి 45 నిముషాలు పడుతుంది.


 1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=బొర్రంపేట&oldid=1999168" నుండి వెలికితీశారు