Jump to content

బోదులబండ

అక్షాంశ రేఖాంశాలు: 17°06′12″N 80°02′32″E / 17.1034056°N 80.0423151°E / 17.1034056; 80.0423151
వికీపీడియా నుండి

బోదులబండ, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలానికి చెందిన గ్రామం.[1]

బోదులబండ
—  రెవెన్యూ గ్రామం  —
బోదులబండ is located in తెలంగాణ
బోదులబండ
బోదులబండ
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°06′12″N 80°02′32″E / 17.1034056°N 80.0423151°E / 17.1034056; 80.0423151
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండలం నేలకొండపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,575
 - పురుషుల సంఖ్య 2,274
 - స్త్రీల సంఖ్య 2,301
 - గృహాల సంఖ్య 1,290
పిన్ కోడ్ 507160
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన నేలకొండపల్లి నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఖమ్మం నుండి 27 కి. మీ. దూరంలోనూ ఉంది.2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1290 ఇళ్లతో, 4575 జనాభాతో 1331 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2274, ఆడవారి సంఖ్య 2301. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1298 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 74. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 579723[3].పిన్ కోడ్: 507160.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఈ ఊరు ఎంత పాతదో నిర్ణయించడానికి పాతవైన  ఆను (ఆధారము) లు పెద్దగా లేవు. కానీ ఈ ఊరి నడి బొడ్డున ఒక కోట బురుజు ఉంది. ఇది ఎక్కడానికి మెట్లు లేని ఒక నలుపలకల, ఎత్తయిన కట్టడము. ఎప్పుడు కట్టారో తెలియదు కానీ చివరి నిజాము కాలము నాటి రజాకార్ల ఆగడాలనుండి ఊరిని కాపాడుకోవడానికీ, ఊరి వారిని ముందుగా హెచ్చరించాడానికీ, 'కావలి గోపురము'గా వాడినారని పెద్దలు చెపుతారు.  ఎప్పటిదో తెలియని ఒక ఆంజనేయుని గుడి ఉంది. అందులోని విరాట్టు ఒక బండపై చెక్కి ఉంది. దాని పక్కగా ఈ మధ్యనే ఒక రాముని గుడి నిర్మించారు.

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

ఈ ఊరికి తూరుపు దిక్కున ఒక పాత చెరువు ఉండేది. ఇప్పటికీ ఉన్న ఆ చెరువు కట్ట మీద గల ఒక రావి చెట్టు కింద 'బోదుల్ సాహెబ్' సమాధి ఉంది. ఎప్పుడో ఈ పేరుగల తురక పిల్లవాడు చనిపోయినప్పుడు, తల్లితండ్రులు ఆ పిల్లవాడి శవాన్ని తీసుకొచ్చి అక్కడ సమధి చేశారట. ఆ పిల్లవాడు దేవుడై వెలసాడని ఈ ఊరి జనాల నమ్మకం. అందుకే హిందువులూ, ముస్లిములు అనే తేడా లేకుండా ఆయన్ను మొక్కుతారు. ఆయన పేరు మీదుగా ఈ చెరువు కట్టను 'బోల్ సాబయ్య ' కట్టగా పిలుస్తారు.. ఈ కట్టకు దగ్గరలో ఒక పెద్ద నల్ల కొండ ఉంది. ఊరి జనాలు ఆ కొండను 'నల్లబండ ' గా పిలుస్తారు. ఇలా ఊరిలోకి వచ్చెముందే కనిపించే పైన చెప్పిన రెండు గురుతుల మీదుగా ఈ ఊరికి 'బోదులబండ ' అనే పేరు వచ్చిఉండవచ్చని ఒక ఊహ.

ఇతర విశేషాలు

[మార్చు]

ప్రజలు

[మార్చు]

మూడు వేలకు మందికి పైగా నివసించే ఈ ఊరిలో ఎక్కువమంది హిందువులే. క్రైస్తవులు, ముస్లిములు కూడా గమనించదగ్గ సంఖ్యలో ఉన్నారు. పెక్కు మతాల వారున్నప్పటికీ, అందరూ ఎంతో కలసి మెలసి నివసిస్తున్నారు. బోల్ సాబయ్యను హిందువులూ, ముస్లిములూ పూజించడమే ఇందుకు నిదర్శనం. ఊరికి ఆగ్నేయ దిక్కులో రాములవారి గుడి, ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి. అలాగే ఒక చర్చి, ఒక మసీదు కూడా ఉన్నాయి. ఎక్కువమందిగా ఉన్న హిందువులలో ఉండే కులాల తేడా నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నది. కులంతో పొత్తు లేకుండా అందరూ చదువుకునే అవకాశం కలగడం అందుకుగల కీలక హేతువుగా చెప్పవచ్చు.

పంటలు

[మార్చు]

ఈ ఊరికి చాల ఎకరాల సాగునేల ఉంది. నాగార్జునాసాగర్ నుంచీ, దగ్గరలోగల పాలేరు పెద్దచెరువునుచీ అందే నీటి వలన సాగు చాలా బాగా సాగుతుంది. ఇక్కడ పెద్ద మొత్తంలో చెరుకు పంట పండిస్తారు. పండించిన చెరుకును పక్కనే ఉన్న రాజేశ్వరపురం పల్లెలోగల పంచదార మిల్లుకి తరలిస్తారు. చెరుకు తర్వాత ముఖ్యమైన పంట వరి. కాలాన్ని, నీటి దొరుకుదలను బట్టి పెక్కు ఇతర పంటలు కూడా పండిస్తారు. మునుపు ఊరిలో చాలా చిన్నవీ పెద్దవీ కుంటలూ, చెరువులూ ఉండేవని చెప్తారు పెద్దవారు. నాగార్జునా సాగర్ నీరు కాలువ ద్వారా ఊరికి వస్తూండటంతో వాటన్నింటినీ పూడ్చివేసారు. ఈ ఊరు చుట్టూ ఉన్న వాటితో పోలిస్తే పల్లంలో ఉండటం వలన బావులలో నీరు విరివిగా ఉంటుంది. బాగా వానలుపడి సాగర్ నిండినప్పుడే ఆ కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి. లేనట్లయితే బావుల మీద ఆధారపడవలసిందే. అదే చెరువులు ఉన్నట్లయితే అలాంటప్పుడు సాగునీటి కొరత తీరేది. దాదాపు ప్రజలందరూ సాగు మీద నేరుగానో, ఇతర రీతిగానో, ఆధారపడ్డవారే. అందువలన ఆ యేడు కురిసిన వానలు, సాగర్ కాలువలో, బావుల్లో నీళ్ళు దొరుకుదలా ఇవన్నీ ప్రజల బ్రతుకును ఆ యేటికీ, మరుసటి యేటికీ నిర్ణయించేవే.

చదువులు

[మార్చు]

ఊరిలో రెండు ప్రాథమిక పాఠశాలలూ, ఒక ఉన్నత పాఠశాల ఉన్నాయి. ఈ ఉన్నత పాఠశాలకి చుట్టూ ఉన్న ఊర్లనుంచి కూడా పిల్లలు వచ్చి చదువుకుంటారు. చిన్న పిల్లలకోసం రెండు 'ఆంగన్ వాడి ' బడులు కూడా ఉన్నాయి. వీటిని ఊర్లో 'అంగనబడి ' గా పిలుస్తారు. పై చదువుల కొరకు చేరువలో ఉన్న నేలకొండపల్లె మండల కేంద్రానికీ, ఇంకా పైచదువుల కొరకు, హైదరాబాదు, ఖమ్మం, కోదాడ వంటి పట్నాలకు వెళ్తారు. కొంత చదివి నడుమ బడిమానేసిన పిల్లల కోసం ప్రత్యేకంగా మరొక బడి ఉంది.

రవాణా

[మార్చు]

ఈ ఊరికి జిల్లా కేంద్రమైన ఖమ్మము నుంచి బస్సు సౌకర్యం ఉంది. దగ్గరలో ఉన్న నేలకొండపల్లె నుంచి పెక్కు ఆటోలు ప్రజలకు సేవలందిస్తున్నాయి.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి నేలకొండపల్లిలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల నేలకొండపల్లిలోను, ఇంజనీరింగ్ కళాశాల ఖమ్మంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ ఖమ్మంలో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నేలకొండపల్లిలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు ఖమ్మంలోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో6 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఆరుగురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆశా కార్యకర్త గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

బోదులబండలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 171 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 52 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 30 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 12 హెక్టార్లు
  • బంజరు భూమి: 119 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 947 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 136 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 942 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

బోదులబండలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 741 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 201 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

బోదులబండలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, మొక్కజొన్న, జొన్న

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 236 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపల్లి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బోదులబండ&oldid=4327186" నుండి వెలికితీశారు