Jump to content

బ్యాంకాక్ మహా ఉమాదేవి దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 13°43′17″N 100°31′22″E / 13.72139°N 100.52278°E / 13.72139; 100.52278
వికీపీడియా నుండి
బ్యాంకాక్ మహా ఉమాదేవి దేవాలయం
బ్యాంకాక్ మహా ఉమాదేవి దేవాలయ గోపురం
బ్యాంకాక్ మహా ఉమాదేవి దేవాలయ గోపురం
భౌగోళికం
భౌగోళికాంశాలు13°43′17″N 100°31′22″E / 13.72139°N 100.52278°E / 13.72139; 100.52278
దేశంథాయిలాండ్
Provinceబ్యాంకాక్
జిల్లాబ్యాంగ్ రాక్
ప్రదేశం2, సి లోమ్ రోడ్, సి లోమ్ ఉపజిల్లా, బ్యాంగ్ రాక్ జిల్లా, బ్యాంకాక్, థాయ్‌లాండ్
సంస్కృతి
దైవంఉమాదేవి
ముఖ్యమైన పర్వాలునవరాత్రి, దీపావళి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుద్రవీడియన్ శైలీ
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీ1879
సృష్టికర్తవైతి పడయాట్చి
వెబ్‌సైట్వెబ్సైటు

బ్యాంకాక్ మహా ఉమాదేవి దేవాలయం (శ్రీ మహా మరియమ్మన్ దేవాలయం), థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లోని సి లోమ్ రోడ్‌లో ఉన్న హిందూ దేవాలయం.[1] దక్షిణ భారత నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ దేవాలయంను 1879లో తమిళ హిందూ ప్రవాస భారతీయుడైన అయిన వైతి పడయాచి నిర్మించాడు.[2][3][4][5] ఈ దేవాలయం థాయ్‌లాండ్‌లోని ప్రధాన తమిళ హిందూ దేవాలయం.

ప్రదేశం

[మార్చు]

థాయ్‌లాండ్‌లోని ప్రధాన తమిళ హిందూ దేవాలయమిది. బ్యాంకాక్‌, బ్యాంగ్ రాక్ జిల్లాలో సిలోమ్ రోడ్ - పాన్ రోడ్ సమీపంలో ఉంది.[6]

చరిత్ర

[మార్చు]
ఉమాదేవి దేవాలయ వీధి దృశ్యం

1858లో బ్యాంకాక్‌కి వెళ్ళిన ప్రవాస భారతీయులు చాలామంది రత్నాల వ్యాపారం,[7] పశువుల పెంపకం చేసేవారు.[2] ఒక దశాబ్దం తర్వాత ప్రవాస భారతీయుల నాయకుడు వైతి పడయాచి ఈ దేవాలయాన్ని నిర్మించాడు.[1][3] థాయ్‌లాండ్‌లోని పురాతన, అతి ముఖ్యమైన దేవాలయమిది.[6]

నిర్మాణం

[మార్చు]
ఉమాదేవి దేవాలయ గోపురం

దేవాలయంలో వివిధ దేవుళ్ళ, దేవతల చిత్రాలు ఉన్నాయి.[8] దేవాలయ ప్రవేశద్వారం వద్ద 6 మీటర్ల ఎత్తులో ఒక గోపురం ఉంది. గోపురంపై అనేక దేవతల చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ వినాయకుడు, కార్తీకేయుడు, ఉమాదేవిలకు మూడు మందిరాలు ఉన్నాయి. గణేషుడు, శివుడు, కృష్ణుడు, విష్ణువు, లక్ష్మి, కార్తీకేయుడు, మరియమ్మన్, కాళి, సరస్వతి, నటరాజమూర్తి, హనుమంతుడు దేవుళ్ళు కొలువై ఉన్నారు.[9] అంతేకాకుండా శివలింగం, బ్రహ్మ, నవగ్రహాలు, అయ్యనార్, సప్తమాతృకలు, పెరియాచి, మదురై వీరన్, కథవరాయన్ దేవతల పూజలకు అంకితమైన పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి.[6][10]

పండుగలు

[మార్చు]

ఉమాదేవి దేవాలయం బ్యాంకాక్ లోని తమిళ హిందూ సమాజానికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. థాయిస్‌లోని 85% మంది ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు.[11] నవరాత్రి,[6] దీపావళి మొదలైన పండుగలతోపాటు ముఖ్య హిందూ పండుగలు నిర్వహించబడుతున్నాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Bracken 2011, p. 51.
  2. 2.0 2.1 Sandhu & Mani 2006, p. 978.
  3. 3.0 3.1 Kesavapany & Mani 2008, p. 673.
  4. Manguin, Mani & Wade 2011, p. 475.
  5. "Sri Mariamman Temple". Lonely Planet. Retrieved 2022-05-15.
  6. 6.0 6.1 6.2 6.3 Barrett 2014, p. 332.
  7. Kesavapany, Mani & Ramasamy 2008, p. 673.
  8. "Sri Mariamman Temple". Lonely Planet. Retrieved 2022-05-16.
  9. https://travel.mthai.com/blog/91583.html Archived 2022-08-15 at the Wayback Machine
  10. http://www.srichinda.com/index.php?mo=3&art=178641
  11. "The 'impossible' voyage of a Tamil ghost ship". theglobeandmail.com. Retrieved 2022-05-16.

ఇతర గ్రంథాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]