భండారు విజయ
భండారు విజయ | |
---|---|
జననం | వరంగల్లు, తెలంగాణ |
నివాస ప్రాంతం | హైదరాబాదు |
వృత్తి | రచయిత్రి, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, సంపాదకురాలు |
తండ్రి | భండారు ప్రసాదరావు |
తల్లి | వరలక్ష్మి |
భండారు విజయ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రచయిత్రి, కవయిత్రి, వ్యాసకర్త, కాలమిస్ట్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, సంపాదకురాలు.[1] ఆమె స్త్రీవాద దృక్పథంతో రచనలు చేస్తూ, మహిళా సమస్యలపై గళం విప్పుతున్నారు.
జననం, నేపథ్యం
[మార్చు]విజయ తెలంగాణలోని వరంగల్లులో భండారు వరలక్ష్మి, ప్రసాదరావు దంపతులకు జన్మించారు. విజయ పూర్వీకుల సొంతూరు నల్లగొండ జిల్లా, హుజూర్ నగర్ తాలూకా ఏటవాకిళ్ల . విజయ తల్లిదండ్రులకు ఏడుగురు సంతానం. ఇద్దరు అక్కలు, ఒక అన్న, ముగ్గురు తమ్ముళ్లు. విజయ నాన్న హోమి యోపతి డాక్టర్. ఏటవాకిళ్లనుంచి వరంగల్ జిల్లా పరకాలకు వలస వచ్చి, కొంతకాలానికి వరంగల్ లోని మట్టెవాడకు వచ్చారు.[1]
విద్య, వృత్తి
[మార్చు]లష్కర్ బజార్లోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివిన విజయ, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎమ్ఎల్ఎస్సీ, ఎల్.ఎల్.బి. కోర్సులన్నీ డిస్టెన్స్ లోనే పూర్తి చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో పార్ట్ టైం ఉద్యోగిగా చేరారు. లైబ్రరీ ఇన్పర్మేషన్ లో మాస్టర్ డిగ్రీ పూర్తిచేయడంతోజిల్లా గ్రంథాలయ సంస్థలో ఉద్యోగం వచ్చింది. విజయ గ్రంథాలయ అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు.[2]
వ్యక్తిగత జీవితం
[మార్చు]క్యాంపస్ లో పరిచయమైన లా విద్యార్థి అదిలాబాద్ జిల్లాకు చెందిన గణేశ్ తో 1987లో విజయ ప్రేమ వివాహం జరిగింది.[2] వారికి ఒక కూతురు (హస్మిత).
సాహితీ ప్రస్థానం
[మార్చు]విజయ సాహిత్య ప్రస్థానం సుదీర్ఘమైనది. మొదటగా 'వరంగల్ వాణి' అనే దినపత్రికలో రోజుకొకటి చొప్పున మహిళలకు సంబంధించిన సమస్యలపై రాసేవారు. 'ప్రసారిక' అనే మ్యాగజైన్ లోనూ రాస్తుండేవారు. ఆమె వివిధ ప్రక్రియల్లో రచనలు చేసారు. వాటిలో కొన్ని:
కవితా సంపుటాలు
[మార్చు]- దీపిక (1984)[3]
- తడి ఆరని దుఃఖం (2016)
- అలల అంతరంగం (2018)
వ్యాస సంపుటి
[మార్చు]- కచ్చిరు-ముచ్చట్లు (2018)
కథా సంపుటాలు
[మార్చు]- గణిక (2020)
- విభజిత (2024)[4]
సంపాదకత్వం
[మార్చు]- స్వయంసిద్ధ (40 మంది రచయిత్రులతో ఒంటరి మహిళల జీవన గాధలు) - హస్మిత ప్రచురణలు (మే, 2023)[5][6]
- “యోధ” మాతృత్వం-విభిన్న వ్యక్తీకరణలు (53 మంది రచయిత్రులు రాసిన స్త్రీవాద కథా సంకలనం) - హస్మిత ప్రచురణలు (2024)
పురస్కారాలు, గుర్తింపులు:
[మార్చు]విజయ సాహిత్య సేవకు అనేక పురస్కారాలు లభించాయి. వాటిలో కొన్ని:
- వంగూరి ఫౌండేషన్, అమెరికా వారి కథల పోటీలో "ఆఖరి విలునామా" కథకు బహుమతి (2012)
- నవ తెలంగాణ పత్రిక వారి దాశరథి రంగాచార్య కవితల పోటీలో "మీ ఇష్టం మీదే" కవితకు ద్వితీయ బహుమతి
- "తడి ఆరని దుఃఖం" కవితా సంపుటికి గోవిందరాజుల సీతాదేవి అవార్డు (2018)
- "తడి ఆరని దుఃఖం" కవితా సంపుటికి ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు నగదు పురస్కారం (2018)
- భూమిక స్త్రీ వాద పత్రిక నిర్వహించిన ఉత్తమ కథా రచయిత పురస్కారం (2019)
- "గణిక" కథా సంపుటికి గురజాడ కథా సాహిత్య పురస్కారం (2020)
- "గణిక" కథా సంపుటికి శ్రీ కొలకలూరి భగీరథి ఉత్తమ కథానిక పురస్కారం (2021)
- తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీమతి మల్లాది సుబ్బమ్మ స్మారక కీర్తి పురస్కారం (2020)[7]
- "గణిక" కథా సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ కథా సాహిత్య పురస్కారం (2021)[8]
హోదాలు
[మార్చు]విజయ గారు వివిధ సంస్థల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.
- హస్మిత ప్రచురణల ప్రచురణకర్త, సంపాదకురాలు
- ప్రగతిశీల మహిళా సంఘం, జంట నగరాల ఉపాధ్యక్షురాలు
- ఉద్యోగ క్రాంతి పత్రిక ఎడిటోరియల్ మెంబర్, కాలమిస్ట్, వ్యాసకర్త
- మహిళా, ట్రాన్స్ జెండర్, స్వతంత్ర సభ్యుల సంస్థల ఐఖ్య వేదిక సభ్యురాలు
- హైదరాబాదు వుమెన్ రైటర్స్ ఫోరమ్ (HWWF) వ్యవస్థాపక సభ్యురాలు
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 విజయకేతనం, జిందగీ, నమస్తే తెలంగాణ, 2014 మే 6, మధు కోట.
- ↑ 2.0 2.1 రచన ఓ సామాజిక బాధ్యత, మానవి, నవతెలంగాణ, 2016 మార్చి 23, కట్ట కవిత, పేజి నెం. 5.
- ↑ భండారు విజయ (1984). దీపిక.
- ↑ టీమ్, సంచిక (2024-06-09). "రచయిత్రి, సంపాదకురాలు విజయ భండారు ప్రత్యేక ఇంటర్వ్యూ | సంచిక - తెలుగు సాహిత్య వేదిక". Sanchika - Telugu Sahitya Vedika (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-01-05.
- ↑ టీమ్, సంచిక (2023-06-04). "'స్వయంసిద్ధ' సంపాదకులు భండారు విజయ, పి. జ్యోతి గార్లతో ప్రత్యేక ఇంటర్వ్యూ | సంచిక - తెలుగు సాహిత్య వేదిక" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-01-05.
- ↑ "Swayamsiddha". www.logili.com (in ఇంగ్లీష్). Retrieved 2025-01-05.
- ↑ "44 మందికి తెలుగు వర్సిటీ 'కీర్తి పురస్కారాలు'". EENADU. 2023-03-24. Archived from the original on 2023-03-24. Retrieved 2023-03-24.
- ↑ "తెలుగు వర్సిటీ 2021 సాహితీ పురస్కారాలు". EENADU. 2023-10-13. Archived from the original on 2023-10-14. Retrieved 2023-10-20.