భవనం జయప్రద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భవనం జయప్రద

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1967 - 1978
ముందు పులుపుల వెంకటశివయ్య
తరువాత అవుదారి వెంకటేశ్వర్లు
నియోజకవర్గం వినుకొండ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1935
పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 2007 డిసెంబర్ 02[1]
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి భవనం వెంకట్రామ్
సంతానం ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు
వృత్తి రాజకీయ నాయకురాలు

భవనం జయప్రద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె వినుకొండ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసింది.[2]

రాజకీయ జీవితం[మార్చు]

భవనం జయప్రద తన భర్త భవనం వెంకట్రామ్ అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వినుకొండ నియోజకవర్గం నుండి 1962లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది. ఆమె ఆ తరువాత 1967, 1972 రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా, జలగం వెంగళరావు మంత్రివర్గంలో మంత్రిగా పని చేసింది.[3] భవనం జయప్రద 1978లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది.

మూలాలు[మార్చు]

  1. "Bhavanam Jayaprada passed away" (in ఇంగ్లీష్). 2007. Archived from the original on 15 June 2022. Retrieved 15 June 2022.
  2. Sakshi (24 March 2019). "విజ్ఞుల మాట..వినుకొండ". Archived from the original on 14 June 2022. Retrieved 14 June 2022.
  3. The Times of India (26 March 2019). "History has it that women from Guntur make most of their chances" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2022. Retrieved 15 June 2022.