భారీ తారాగణం
Appearance
భారీ తారాగణం | |
---|---|
దర్శకత్వం | శేఖర్ ముత్యాల |
రచన | శేఖర్ ముత్యాల |
తారాగణం | సదన్ దీపికా |
ఛాయాగ్రహణం | ఎం.వి.గోపి |
కూర్పు | మార్తాండ్ కె.వెంకటేష్ |
సంగీతం | సుక్కు |
నిర్మాణ సంస్థ | బివిఆర్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 23 జూన్ 2023 |
సినిమా నిడివి | 142 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
భారీ తారాగణం 2023లో విడుదలైన తెలుగు సినిమా. బివిఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు శేఖర్ ముత్యాల దర్శకత్వం వహించాడు. సదన్, దీపికా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 జూన్ 23న విడుదలైంది.[1][2]
చిత్ర నిర్మాణం
[మార్చు]భారీ తారాగణం సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఎం.ఎం.శ్రీలేఖ జ్యోతిప్రజ్వలన చేయగా, హీరో, హీరోయిన్లపై తీసిన తొలి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి క్లాప్ నివ్వగా, దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నటుడు ఆలీ గౌరవ దర్శకత్వం వహించాడు.[3] ఈ సినిమాలోని “బాపు బొమ్మ” లిరికల్ పాటను 2021 జూన్ 20న విడుదల చేశారు.[4]
నటీనటులు
[మార్చు]- సదన్
- దీపికారెడ్డి
- రేఖ నిరోషా
- పోసాని కృష్ణమురళి
- సత్య ప్రకాష్
- తోటపల్లి మధు
- కేదార్ శంకర్
- ప్రభావతి
- ఛత్రపతి శేఖర్
- సమీర్
- సరయు
- సాహితి దాసరి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: బివిఆర్ పిక్చర్స్
- నిర్మాత: బివి.రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శేఖర్ ముత్యాల
- సంగీతం: సుక్కు
- సినిమాటోగ్రఫీ: ఎం.వి.గోపి
- ఆర్ట్: జె.కె.మూర్తి
మూలాలు
[మార్చు]- ↑ "Bhari Taraganam Movie: 'భారీ తారాగణం' మూవీ రివ్యూ". Sakshi. 23 June 2023. Retrieved 23 July 2023.
- ↑ HMTV (19 November 2020). "అలీ కుటుంబం నుండి వస్తోన్న నట వారసుడు సదన్ 'భారీ తారాగణం' చిత్రం లాంఛనంగా ప్రారంభం!". Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.
- ↑ Sakshi (23 November 2020). "భారీ తారాగణం షురూ". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
- ↑ Eenadu (20 June 2021). "'బాపు బొమ్మ' మెలోడి విన్నారా". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.