భార్యాభర్తల భాగోతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భార్యాభర్తల భాగోతం
(1988 తెలుగు సినిమా)
Bharya Bhartala Bhagotham.png
దర్శకత్వం నగేష్ కుమార్
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
చంద్రమోహన్ ,
జీవిత
సంగీతం కృష్ణ చక్ర
నిర్మాణ సంస్థ రవి మూవీ క్రియెషన్స్
భాష తెలుగు

భార్యా భర్తల భాగోతం 1988 లో వచ్చిన హాస్య చిత్రం. గంగోత్రి పిక్చర్స్ బ్యానర్‌లో మరిపల్లి మహీరత్నం గుప్తా, యమసాని ప్రకాష్ గుప్తా నిర్మించిన ఈ చిత్రానికి మహేష్ కుమార్ దర్శకత్వం వహించాడు.[1] ఇందులో రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్, అశ్విని, జీవిత రాజశేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కృష్ణ-చక్ర సంగీతం అందించారు.[1]

కథ[మార్చు]

డాక్టర్ గణపతి (చంద్ర మోహన్), న్యాయవాది భాగోతుల సుబ్రమణ్యం, అలియాస్ బాసు (రాజేంద్ర ప్రసాద్) సన్నిహితులు. గణపతి అరుంధతి (జీవిత రాజశేకర్) తో ప్రేమలో పడతాడు. బాసు సీతను (అశ్విని) ప్రేమిస్తాడు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. బసు అరుంధతిని తన సొంత సోదరిగా చూసుకుంటాడు. గణపతి సీతను అలాగే చూసుకుంటాడు. ఒకరోజు గణపతి తాగినట్లు బసు గమనిస్తాడు. ప్రశ్నించిన మీదట తన భార్య అరుంధతి ఒకరితో అక్రమ సంబంధం కలిగి ఉందని గణపతి చెబుతాడు. కానీ బాసు దానిని నమ్మడు. అక్కడ నుండి, అతను అరుంధతిని నీడ వలె అనుసరిస్తాడు. ఆ క్రమంలో, అతను ఒక ప్రమాదంతో చిక్కుకుంటాడు. అందులో టాక్సీ డ్రైవర్ బాబ్జీ (సుధాకర్) తీవ్రంగా గాయపడతాడు. తాను కోలుకునే వరకు, తన ఒంటరి బిడ్డను తనతోనే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకోవాలని బాబ్జీ బాసును అభ్యర్థిస్తాడు. ఆ బిడ్డ కోసం అతడు బాబ్జీ ఇంటికి వెళ్ళినపుడు అక్కడ బాబ్జీ, అతని భార్య సీతల పెళ్ళి ఫొటో చూసి దిగ్భ్రాంతి చెందుతాడు. బాసు సీతల మధ్య కూడా అపార్థాలు తలెత్తుతాయి. ఇక ఈ గొడవల నుండి రెండు జంటలు ఎలా బయట పడతాయనేది మిగిలిన కథ.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఎస్. పాట పేరు సాహిత్యం గాయకులు పొడవు
1 "యే తీసేయనా" సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎస్పీ బాలు, పి.సుశీల 3:43
2 "గువ్వా ముద్దులివ్వా" జోన్నవిత్తుల ఎస్పీ బాలు 4:21
3 "మారాలు చాలే గారాల తల్లి" సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎస్పీ బాలు, పి.సుశీల 4:07
4 "నో నో నో టచ్ మి నాట్" సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎస్పీ బాలు, ఎస్పీ సైలాజా 3:48
5 "ఒకటిచ్చుకోవే వయ్యారమా" జోన్నవిత్తుల ఎస్పీ బాలు, పి.సుశీల 3:44

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Error on call to మూస:cite web: Parameters url and title must be specified