మధు యాస్కీ గౌడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధు యాస్కీ గౌడ్
[[Image:|225x250px|మధు యాస్కీ గౌడ్]]


నియోజకవర్గము నిజామాబాదు

వ్యక్తిగత వివరాలు

జననం (1960-12-15) 1960 డిసెంబరు 15 (వయస్సు: 58  సంవత్సరాలు)
హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి శుచీ మధు
సంతానము 2 కూతుర్లు
నివాసము హైదరాబాదు
వెబ్‌సైటు www.madhuyaskhi.com
September 26, 2006నాటికి మూలం http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4028

మధు యాస్కీ గౌడ్ (జ: 15 డిసెంబర్ 1960) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 14వ లోక్‌సభకు ఆంధ్ర ప్రదేశ్ లోని నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

వ్యక్తిగత విషయాలు[మార్చు]

మధు యస్కీ గౌడ్ డిసెంబరు 15, 1960 కృష్ణయ్య మరియు సులోచన దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. ఇతన్ని చిన్నాన్న పోచయ్య మరియు అనసూయ దంపతులు పెంచుకున్నారు. ఇతడు డాక్టర్ సుచీని పెళ్ళిచేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుతుర్లు: కోమలి మర్యు గగన.

ఇతడు 1982లో నిజాం కళాశాల నుండి బి.ఎ., 1985లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి. మరియు 1989లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.ఎమ్. పట్టాలు పొందారు.

జీవిత విశేషాలు[మార్చు]

  • మధు యాస్కీ న్యూయార్క్ అటార్నీ మరియు అంతర్జాతీయ న్యాయం మరియు వ్యాపారంలో కన్సల్టంట్ గా అమెరికాలోని ప్రవాస భారతీయులకు సహాయపడుతున్నారు.
  • మధు యాస్కీ 2004 లో భారత పార్లమెంటుకు ఎన్నికోబడిన ప్రథమ మరియు ఏకైక ప్రవాస భారతీయుడు.

అవార్డులు[మార్చు]

  • ప్రముఖ ప్రవాస భారతీయునిగా 2005 లో ఎన్నుకోబడ్డారు.

సంఘ సేవ[మార్చు]

  • మధు యాస్కీ ఫౌండేషన్ అనే సేవా సంస్థను 2003 లో స్థాపించి, పేదలకు ఆర్థిక సాయం, పేద విద్యార్ధులకు విద్య చెప్పిస్తున్నారు.

మూలాలు[మార్చు]