Jump to content

మహేంద్ర ప్రతాప్ సింగ్

వికీపీడియా నుండి
మహేంద్ర ప్రతాప్ సింగ్

మంత్రి
పదవీ కాలం
1991 – 1996

మంత్రి
పదవీ కాలం
2005 – 2009

పదవీ కాలం
2009 – 2014
నియోజకవర్గం బద్‌ఖల్
పదవీ కాలం
2005 – 2009
నియోజకవర్గం మేవ్లా–మహారాజ్‌పూర్
పదవీ కాలం
1982 – 1996
నియోజకవర్గం మేవ్లా–మహారాజ్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1945-02-28) 1945 ఫిబ్రవరి 28 (వయసు 79)
ఫరీదాబాద్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు లోక్‌దళ్
బహుజన్ సమాజ్ పార్టీ

మహేంద్ర ప్రతాప్ సింగ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హర్యానా శాసనసభకు 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

మహేంద్ర ప్రతాప్ సింగ్ లోక్‌దళ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1982 శాసనసభ ఎన్నికలలో మేవ్లా–మహారాజ్‌పూర్ నుండి లోక్‌దళ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి గజరాజ్ బహదూర్ పై 22791 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో 1987 1991 శాసనసభ ఎన్నికలలోకాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై 1991లో భజన్‌లాల్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు.

మహేంద్ర ప్రతాప్ సింగ్ 1996 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా, ఆయనకు 2000 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బహుజన్ సమాజ పార్టీలో చేరి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2005 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై 1991లో భూపిందర్ సింగ్ హుడా మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు.

మహేంద్ర ప్రతాప్ సింగ్ 2009 శాసనసభ ఎన్నికలలో బద్‌ఖల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కృష్ణన్ పాల్ గుర్జార్‌పై 63,108 ఓట్ల మెజారిటీతో గెలిచి ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సీమా త్రిఖా చేతిలో 36,609 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]

మహేంద్ర ప్రతాప్ సింగ్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫరీదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కృష్ణన్ పాల్ గుర్జార్ చేతిలో 17,294 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. ETV Bharat News (30 April 2024). "कौन हैं फरीदाबाद से कांग्रेस उम्मीदवार महेंद्र प्रताप सिंह, जिनके खिलाफ करण दलाल ने कर दी बगावत - Who is Mahendra Pratap Singh". Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.
  2. The Tribune (29 April 2024). "Congress' old warhorse makes battle interesting in Faridabad" (in ఇంగ్లీష్). Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.
  3. TimelineDaily (5 June 2024). "Krishan Pal Gurjar Edges Out Mahendra Pratap Singh In A Tight Faridabad Contest" (in ఇంగ్లీష్). Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.
  4. Election Commission of India (4 June 2024). "Lok Sabha 2024 Election results: Faridabad". Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.