మాణిక్ వర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాణిక్ వర్మ
జననం(1926-05-16)1926 మే 16
మరణం1996 నవంబరు 10(1996-11-10) (వయసు 70)
వృత్తిగాయకురాలు
పిల్లలునలుగురు కుమార్తెలు (రాణి వర్మ, అరుణా జయప్రకాష్, భారతి అచ్రేకర్, వందనా గుప్తే)
పురస్కారాలుపద్మశ్రీ (1974)
సంగీత నాటక అకాడమీ అవార్డు (1986)

మాణిక్ వర్మ (1926 మే 16 - 1996 నవంబరు 10) మహారాష్ట్రకు చెందిన శాస్త్రీయ గాయకురాలు.[1][2] 1974లో పద్మశ్రీ, 1986లో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకుంది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

మాణిక్ వర్మ అసలు పేరు మాణిక్ దాదర్కర్. ఆమెకు నలుగురు కుమార్తెలు. రాణి వర్మ (గాయని), అరుణా జయప్రకాష్, భారతి అచ్రేకర్ (నటి), వందనా గుప్తే (మరాఠీ నాటకరంగం, టివి, సినిమా నటి).[2]

కళారంగం[మార్చు]

శాస్త్రీయ ఖ్యాల్‌తోపాటు, ఠుమ్రి, మరాఠీ నృత్య సంగీతం, భావగీతాలు, భక్తి సంగీతం వంటి సెమీ క్లాసికల్ సంగీతాన్ని గానంచేసింది. కిరానా ఘరానా స్థాపకుడు అబ్దుల్ కరీం ఖాన్ కుమార్తె హీరాబాయి బరోడేకర్, కుమారుడు సురేష్‌బాబు మానేల శిష్యురాలు మాణిక్ వర్మ. ఆగ్రా ఘరానాకు చెందిన అజ్మత్ హుస్సేన్ ఖాన్ "దిల్రాంగ్", జగన్నాథ్బువా పురోహిత్ "గుణిదాస్" నుండి మరింత శిక్షణ తీసుకుంది.[3][4]

1955 ఏప్రిల్ నెలలో లతా మంగేష్కర్, యోగిని జోగ్లేకర్, ఉష, ఆత్రే, బాబాన్‌రావ్ నవ్‌దికర్, సుధీర్ ఫడ్కే వంటి కళాకారులతోపాటు పుణెలోని ఆల్ ఇండియా రేడియో ద్వారా వారానికోసారి నిర్వహించే గీత రామాయణం పాటల కార్యక్రమంలో పాల్గొన్నది.[5]

అవార్డులు[మార్చు]

గుర్తింపులు[మార్చు]

మాణిక్ జ్ఞాపకార్థం ముంబైలో మాణిక్ వర్మ ప్రతిష్ఠాన్ స్థాపించబడింది. ఇది మాణిక్ రత్న అవార్డును, స్కాలర్‌షిప్‌లను కూడా అందిస్తుంది. మాణిక్ వర్మ జయంతి, వర్థంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. [8][9] మాణిక్ ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా 2004 నవంబరు 12న పూణేలోని తిలక్ స్మారక్ మందిర్‌లో దేవగంధర్వ బఖ్లేబువా ట్రస్ట్ బహర్లా పారిజాత్ దారి అనే సంగీత కార్యక్రమం జరిగింది.[2][10]

మూలాలు[మార్చు]

  1. "Torch-bearers of kirana and Agra gharana, and their followers". The Times of India. 26 January 2011. Archived from the original on 4 November 2012.
  2. 2.0 2.1 2.2 "A tribute to legendary singer Manik Varma". The Indian Express. 10 November 2005.
  3. Manuel, Peter (1989). Thumri in Historical and Stylistic Perspectives. Motilal Banarsidass. p. 86. ISBN 81-208-0673-5.
  4. Deshpande, Vaman Hari (1989). Between two tanpuras. Popular Prakashan. p. 151. ISBN 0-86132-226-6.
  5. "Yesterday once more as Geet Ramayan turns 50". The Indian Express. 25 January 2005.
  6. "Padma Awards Directory (1954–2009)" (PDF). Ministry of Home Affairs (India). Archived from the original (PDF) on 10 May 2013.
  7. "SNA: List of Akademi Awardees". Sangeet Natak Akademi Official website. Archived from the original on 17 February 2012.
  8. "Stars shine down". The Indian Express. 7 November 1998.
  9. "Melodies for your soul: Music". The Indian Express. 6 November 2003.
  10. "Remembering Manik Varma". The Indian Express. 15 November 2005.

బయటి లింకులు[మార్చు]