మాతాజీ నిర్మలాదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాతాజీ నిర్మలాదేవి సహజ యోగ ఉపాసకురాలు. యోగం యొక్క వ్యాప్తికి విశేషకృషి చేసింది. నిర్మలా దేవి 1923వ సంవత్సరం మార్చి 21 తేదీ నాడు చింద్వారా అను ఊరిలో (ఒకప్పుడు మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ఈ ఊరు ప్రస్తుతం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది) ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించింది.

బాల్యం[మార్చు]

పగలు, రాత్రి రెండు సమానంగా ఉండే రోజున, అంటే మార్చి 21వ తేదీ 1923, మధ్యాహ్నం 12గం నిర్మలాదేవి మహారాష్ట్రలో చింద్వారాలో జన్మించింది. ఆమె ముఖకవళికలను బట్టి మహాత్మాగాంధీ చిన్ని నిర్మలను ముద్దుగా 'నేపాలి' అని పిలిచారు.

స్వాతంత్ర్య పోరాట సమయంలో తరచు ఆమె తల్లిదండ్రులను బ్రిటీష్ వారు జైల్లో పెట్టినపుడు కుటుంబ బాధ్యతను తమ కుటుంబంలోని చిన్నదైన నిర్మలకు మాత్రమే అప్పగించేవారు. అందుకు కారణం ఆమె మిగతా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా భాధ్యతాయుతంగా ఉండేవారు.[ఆధారం చూపాలి]

తల్లిదండ్రులు[మార్చు]

మహాత్మాగాంధీ నాయకత్వంలో భారతదేశ స్వాతంత్ర్య పోరాటయోధుడు శ్రీ పి.కె.సాల్వే సంతానం నిర్మల. నిర్మల తండ్రికి 14 భాషలలో ప్రవేశం ఉంది. ఆయన ఖురాన్ ను హిందీలోకి అనువదించిన వ్యక్తి. ఆమె తల్లి గణితశాస్త్రంలో దిట్ట. దేశంలో ఆ రోజులలో గణితశాస్త్రంలో పట్టా పొందిన అతికొద్ది మంది స్త్రీలలో ఆమె ఒకరు. వారి పూర్వికులు శాలివాహన వంశసంబంధీకులు. లాహోరులో బాలక్ రామ్ మెడికల్ కాలేజీలో సైకాలజీ, వైద్య విద్యనభ్యసించారు. నిర్మల బ్యాట్మింటన్ ఛాంపియన్[ఆధారం చూపాలి]

బాహ్య లింకులు[మార్చు]