Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

మిట్టూరోడి పుస్తకం

వికీపీడియా నుండి

మిట్టూరోడి పుస్తకం అనే తెలుగుకథాసంకల ప్రసిద్ధ తెలుగు కథారచయిత నామిని సుబ్రమణ్యం నాయుడు చే వ్రాయబడింది. ఈపుస్తకము అంతకు ముందు ప్రచురణ పొందిన కథాసంకలనాలను కలిపి ఒకే పుస్తకంగా అచ్చొత్తిన పుస్తకము. అంతకుముందే అచ్చయి అశేష తెలుగు పాఠకలోక ఆదరణపొందిన పచ్చనాకు సాక్షిగా',..సినబ్బ కతలు, మిట్టూరోడి కతలుతో కలుపుకొని ఆరు పుస్తకాలను కలిపి మిట్టూరోడి పుస్తకం పేరుతో ఈపుస్తకం ప్రచురించారు. ఈపుస్తకం మొదటి ముద్రణ డిసెంబరు 2009న జరిగింది. ఈపుస్తక ప్రచురణను రచయిత తానే స్వంతంగా టామ్ సాయర్ బుక్స్, తిరుపతి పేరుతో విడుదల చేసాడు. పుస్తకం లోపలి బొమ్మలను బాపు గారందించారు. ఏ పుస్తకముకైన ముఖచిత్ర పేజిపై రచయిత పేరుంటుంది. ఈపుస్తకం కవరుపై నామిని సుబ్రహ్మణం అని కాకుడా ముట్టూరోడి పుస్తకం అని వేసుకోవటంలోనే తన కథల మీద, తెలుగు పాఠలకుల మీద రచయితకున్న నమ్మకాన్ని తెలుపుతున్నది. ఒకరకంగా వినూత్నమైన ప్రయోగంగా చెప్పవచ్చును.

పుస్తక ముఖచిత్రము
మిట్టూరోడి పుస్తకం

రచయిత గురించి

[మార్చు]

నామిని సుబ్రహమణ్యం గారు రాయలసీమ ప్రాంతానికిచెందిన చిత్తూరు జిల్లానందలి రామచంద్రపురము మండలంకుచెందిన మిట్టూరువాసి.తిరుపతి లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం లో ఎమ్మేసి చదివాడు.కథలరచనలో తనకంటూ ఒకప్రత్యేక శైలి కలిగివున్నరచయిత.ఇతనికథలు ఉహల్లోంచి కాక వాస్తవాలనుంచి పుట్టుకొచ్చాయి. చుట్టూవున్న సమాజంలోని వాస్తవాలనుండి కథాలు అల్లుకొన్నాయి.కథ్లలోని భాష సరళమైన గ్రామీణ భాష.అనగా నిత్యజీవితంలో పల్లెజనులు ఎలాతమలో మాట్లాడుకుంటారో అభాషలోనే రాసాడు.అందుచే కథలు సూటిగా పాఠకులమనస్సుల్లోకి చొచ్చుకుపొయ్యి తిష్టవేస్తాయి.మళ్లిమళ్లి చదవాలనిపించేటట్లు వున్నాయి కథలు.

రచయిత గురించిన ప్రధాన వ్యాసం:నామిని సుబ్రమణ్యం నాయుడు

పుస్తకంలోని కథాసంకలనాల వివరాలు

[మార్చు]

ఇందులో మొత్తం ఆరు కథలపుస్తకాలున్నాయి.మొదటిమూడు పలుచిన్న కథలను కలిగిన కథాసంకనాలు.నాల్గవది ఒకమినీ నవల.చివరిరెండు పెద్దకథలు.

  1. పచ్చనాకు సాక్షిగా:కథల సంకలన పుస్తకము
  2. సినబ్బ కతలు:కథల సంకలన పుస్తకము
  3. మిట్టూరోడి కతలు:కథల సంకలన పుస్తకము
  4. మునికన్నడి సేద్యము:చిన్ననవల
  5. పాలపొదుగు:పెద్ద కథ
  6. సుందరమ్మ కొడుగులు:పెద్ద కథ

ఇందులో పచ్చనాకు సాక్షిగా 1985-86 లో రాసాడు.పాలపొదుగు,సుందరమ్మ కొడుకులు కూడా 1985లోనే రాసాడు.సినబ్బ కతల్ని 1987లో రాసాడు.మిట్టూరోడి కతల్నీ' 1990లో రాయడం జరిగింది.

రచయిత ఇతర రచనలు

[మార్చు]
  1. నామిని ఇస్కూలు పుస్తకం
  2. పచ్చనాకు సాక్షిగా
  3. సినబ్బ కతలు
  4. మిట్టూరోడి కతలు
  5. మునికన్నడి సేద్యం
  6. పాల పొదుగు
  7. నావిస్తరాకు