మిర్జా హాది రుస్వా
Appearance
మిర్జా ముహమ్మద్ హాది రుస్వా (1857 - 1931)
లక్నో లో జన్మించాడు. ప్రముఖ ఉర్దూ కవి సాహితీకారుడు. మతము, తత్వము, ఖగోళము, సాహిత్యము ఇతని అభిరుచులు. ఇతడు బహుభాషా కోవిదుడు. ఉర్దూ, పర్షియన్, అరబిక్, హిబ్రూ, ఆంగ్లం, లాటిన్, యూనాని (గ్రీకు) భాషలలో ఉద్ధండుడు. నవలాకారుడిగా ఖ్యాతినొందాడు.
ఇతని ప్రఖ్యాత నవల ఉమ్రావ్ జాన్ అదా, లక్నో కు చెందిన వేశ్య, కవయిత్రి జీవితంపై వ్రాయబడినది. ఉర్దూ నవలా సాహితీ రంగంలో ఈ నవల ప్రథమస్థానాన్ని ఆక్రమిస్తుంది. (భారత సివిల్ సర్వీసెస్ పరీక్షలకు, ఉర్దూ భాష సిలబస్ లో గలదు).
ఈ నవలాధారంగా 3 సినమాలు తీయబడ్డాయి.
సినిమాలు
[మార్చు]- ముజప్ఫర్ హుసేన్ నిర్మించిన ఉమ్రావ్ జాన్, ఉర్దూ సినిమా, ఇందులో రేఖ, నసీరుద్దీన్ షా, ఫరూఖ్ షేఖ్ నటించారు. దీనికి సంగీతం ఖయ్యాం, గీత రచయిత షెహ్ర్యార్ (అలీఘర్ యూనివర్శిటీ ప్రొఫెసర్).
ఇతర రచనలు
[మార్చు]- అఫ్షాయె రాజ్ (కవితలు)
- జాత్-ఎ-షరీఫ్ (నవల)
- షరీఫ్ జాద (నవల)
- అక్తరీ బేగం (నవల)
వర్గాలు:
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- ఉర్దూ కవులు