ముకర్రం జా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీర్ బర్కత్ అలీ ఖాన్
అసఫ్ జా VIII
తన తల్లి యువరాణి దుర్రు షెహ్వార్, ఒట్టోమన్ సామ్రాజ్యం ఇంపీరియల్ యువరాణితో ముకర్రం జా
8వ నిజాం (నామమాత్రపు)
Reign1967 ఫిబ్రవరి 24 – 1971 నవంబరు 5
(1971–2023)
Coronation1967 ఏప్రిల్ 6
Predecessorమీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ జా VII
Successorఅజ్మత్ జా
జననం(1933-10-06)1933 అక్టోబరు 6
నైస్, ఫ్రాన్సు
మరణం2023 జనవరి 15(2023-01-15) (వయసు 89)
ఇస్తాంబుల్, టర్కీ
Spouseప్రిన్సెస్ ఎస్రా బిర్గిన్
(1959–1974; విడాకులు)
ఆయిషా సిమన్స్
(1979–1989; మరణం)
మనోల్య ఒనూర్
(1992–1997; విడాకులు)
జమీలా బౌలరస్
(1992 వరకు)
ప్రిన్సెస్ ఆయేషా ఓర్చేది
(1994 వరకు)
Issueఅజ్మత్ జా
సాహిబ్జాది షెహ్క్యార్
మీర్ అలెగ్జాండర్ ఆజం ఖాన్ సిద్ధికీ
ఉమర్ జా,
నీలోఫర్
జైరీన్
Houseఅసఫ్ జాహీ రాజ్యం
ఉస్మాన్ భవనం
తండ్రిఆజం జా
తల్లిదుర్రు షెహ్వార్
మతంసున్నీ ఇస్లాం

నిజాం మీర్ బర్కత్ అలీ ఖాన్ సిద్ధిఖీ ముకర్రం జా, అసఫ్ జా VIII (1933, అక్టోబరు 6 - 2023, జనవరి 15) 1967లో తన తాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరణించినప్పటి నుండి హైదరాబాదు నామమాత్రపు నిజాం.[1]

జా హెచ్.ఈ.హెచ్. నిజాంస్ ఛారిటబుల్ ట్రస్ట్, ముకర్రం జా ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ & లెర్నింగ్ కి అధ్యక్షుడిగా పనిచేశాడు.[2]

జీవిత చరిత్ర

[మార్చు]

జననం, విద్య

[మార్చు]

ముకర్రం జా 1933, అక్టోబరు 6న ఆజం జా - యువరాణి దుర్రు షెహ్వార్ దంపతులకు హైదరాబాదులో జన్మించాడు. ఆజం జా హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు కాగా, యువరాణి దుర్రు షెహ్వార్ ఒట్టోమన్ రాజవంశం చివరి ఖలీఫా అబ్దుల్మెజిద్ II కుమార్తె.[3] ముకర్రం జా డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్‌లో, ఇంగ్లాండ్‌లోని హారో, పీటర్‌హౌస్, కేంబ్రిడ్జ్‌లో చదువుకున్నాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్‌హర్స్ట్‌లలో కూడా చదువుకున్నాడు.[4]

ముకర్రం జా న్యూ ఢిల్లీలోని తీన్ మూర్తి భవన్‌లో కొంతకాలం ఉండి జవహర్‌లాల్ నెహ్రూకి గౌరవ సహాయకుడిగా పనిచేశాడు.[5] నెహ్రూ తనను తన వ్యక్తిగత రాయబారిగా లేదా ముస్లిం దేశానికి భారత రాయబారిగా చేయాలని కోరుకున్నాడని 2010లో ముకర్రం జా పేర్కొన్నాడు.[6]

హైదరాబాదు నిజాం

[మార్చు]
1934లో బొంబాయి చేరిన తర్వాత నానీ యువరాజును తీసుకెళ్తున్న దృశ్యం

1967లో తన తాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరణానంతరం హైదరాబాదు నిజాం అయ్యాడు.

ఆస్ట్రేలియా, టర్కీలో జీవితం

[మార్చు]
తన తమ్ముడు ముఫఖం జాతో ముకర్రం జా

హైదరాబాద్‌లోని ముకర్రం జాకు చెందిన రెండు ప్రధాన ప్యాలెస్‌లు (చౌమహల్లా, ఫలక్‌నుమా) పునరుద్ధరించబడ్డాయి. చౌమహల్లా ప్యాలస్ నిజాంల యుగాన్ని ప్రదర్శించే మ్యూజియంగా, ఫలక్‌నుమా ప్యాలస్ విలాసవంతమైన హోటల్‌గా మార్చబడి ప్రజల సందర్శనార్థం తెరవబడ్డాయి. తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్ దాదాపు పదేళ్ళ పునర్నిర్మాణాల తర్వాత, తాజ్ గ్రూప్‌కు లీజుకు ఇవ్వబడి ఫిబ్రవరి 2010లో ప్రారంభించబడింది.[7]

తన తండ్రి ఆజం జా మాదిరిగానే ముకర్రం జా కూడా 1980ల వరకు భారతదేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. అయితే, 1990లలో తన విడాకుల సెటిల్మెంట్ల కారణంగా కొన్ని ఆస్తులను కోల్పోయాడు. అయినప్పటికీ అతని నికర విలువ $2 బిలియన్లుగా అంచనా వేయబడింది.[8][9]

మరణం, అంత్యక్రియలు

[మార్చు]

ముకర్రం జా తన 89 ఏళ్ళ వయసులో 2023, జనవరి 15న టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో మరణించాడు.[10] ముకర్రం జా కోరిక ప్రకారం అతని అంత్యక్రియలు 2023 జనవరి 18న హైదరాబాద్ రాష్ట్రం, హైదరాబాద్ నిజాం పూర్వ రాజధాని అయిన హైదరాబాద్‌ నగరంలో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగాయి.

ప్రజల సందర్శనార్థ ముకర్రం జా భౌతికకాయాన్ని చౌమహల్లా ప్యాలెస్‌లో ఉంచబడింది, అక్కడ కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు నివాళులర్పించారు.[11]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

వివాహాలు

[మార్చు]

ముకర్రం జా ఐదుసార్లు వివాహం చేసుకున్నాడు. అతని మొదటి భార్య టర్కిష్ ఉన్నత మహిళ, ఎస్రా బిర్గిన్ (జ. 1936)కాగా, వారు 1959లో వివాహం చేసుకున్నారు.[12][13] జాహ్ తన హైదరాబాద్ ప్యాలెస్ నుండి ఆస్ట్రేలియా అవుట్‌బ్యాక్‌లోని షీప్ స్టేషన్ కోసం బయలుదేరాడు, అతనితో కలిసి వెళ్ళడానికి ఇష్టపడని తన భార్యకు విడాకులు ఇచ్చాడు.[14] 1979లో మాజీ ఎయిర్ హోస్టెస్, బిబిసి ఉద్యోగి హెలెన్ సిమన్స్‌ను వివాహం చేసుకున్నాడు (జ. 1949 - మ. 1989);[15] ఆమె ఇస్లాం మతంలోకి మారి తన పేరును ఆయిషాగా మార్చుకుంది. ఆమె మరణానంతరం అతను 1992లో మాజీ మిస్ టర్కీ అయిన మనోల్య ఒనూర్ (జ. 1954 - మ. 2017)ని వివాహం చేసుకున్నాడు. 1997లో ఆమెకు విడాకులు ఇచ్చాడు.[14][15][16]

తరువాత 1992లో మొరాకోకు చెందిన జమీలా బౌలరస్ (జ. 1972)ను వివాహం చేసుకున్నాడు.[17] 1994లో టర్కిష్‌కు చెందిన యువరాణి ఆయేషా ఓర్చెడి (జ. 1959)ని వివాహం చేసుకున్నాడు.[18][19]

కుమారులు/కుమార్తెలు

[మార్చు]

ఎస్రా బిర్గిన్ ద్వారా, ముకర్రం జాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు:

 • అజ్మత్ జా అని కూడా పిలువబడే వాలాషన్ నవాబ్ సాహిబ్జాదా మీర్ అజ్మత్ అలీ ఖాన్ సిద్ధికీ బయాఫెండి బహదూర్ (జ. 1960), 1994లో యువరాణి బేగం సాహిబా జైనాబ్ నాజ్ జా (నీ జీనెప్ నాజ్ గువెండిరెన్)ని వివాహం చేసుకున్నాడు. ఒక కుమారుడు కెమెరామెన్‌గా పనిచేశాడు.[20][21]
  • మురాద్ జా
 • సాహిబ్జాది షెహ్క్యార్ యునిసా బేగం (జ. 1964), అవివాహితుడు[22]

హెలెన్ సిమన్స్ ద్వారా అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు:

 • వాలాషన్ నవాబ్ సాహిబ్జాదా మీర్ అలెగ్జాండర్ ఆజం ఖాన్ సిద్ధికీ బయాఫెండి బహదూర్ (జ. 1979)[23]
 • వాలాషన్ నవాబ్ సాహిబ్జాదా మీర్ మొహమ్మద్ ఉమర్ ఖాన్ సిద్ధిఖీ బయాఫెండి బహదూర్ (1984-2004) డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా మరణించాడు.[23]

మనోల్య ఒనూర్ ద్వారా అతనికి ఒక కుమార్తె ఉంది:

 • సాహెబ్జాది నిలుఫెర్ యునిసా బేగం (జ. 1992)[24]

జమీలా బౌలరస్ ద్వారా అతనికి ఒక కుమార్తె ఉంది:

 • సాహెబ్జాది జైరిన్ యునిసా బేగం (జ. 1994)

ముకర్రం జాకు ముఫఖం జా అనే సోదరుడు ఉన్నాడు.[25]

రాజభవనాలు

[మార్చు]

ముకర్రం జాపై ఫిర్యాదు

[మార్చు]

7వ నిజాం మరో మనవడు నవాబ్ నజాఫ్ అలీ ఖాన్, హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌ను కలుసుకుని, ప్రిన్స్ ముకర్రం జా, అతని మాజీ భార్య ప్రిన్సెస్ ఎస్రా (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) హోల్డర్ కూడా అని ఆరోపిస్తూ మద్దతు పత్రాలతో పాటు ఫిర్యాదును సమర్పించాడు. యువరాజు ముకర్రం జా), అతని కుమారుడు ప్రిన్స్ అజ్మత్ జా, అతని సోదరుడు ప్రిన్స్ ముఫఖం జా యునైటెడ్ కింగ్ డమ్ హైకోర్టులో తప్పుడు పత్రాలను ఉపయోగించి అక్కడి నాట్‌వెస్ట్ బ్యాంక్‌లో ఉన్న £35 మిలియన్ నిజాం ఫండ్‌పై దావా వేశారు.[26]

మూలాలు

[మార్చు]
 1. Zubrzycki, John (2006), The Last Nizam: An Indian Prince in the Australian Outback, Pan Macmillan Australia Pty, Limited, ISBN 1-4050-3722-9
 2. Nizam Mukarram Jah Trust at deccanchronicle.com
 3. "Princess Durru Shehvar passes away", The Hindu, 9 February 2006, archived from the original on 25 October 2007
 4. Singh, Kishore (30 March 2007), "India's wealthiest man the country forgot", Business Standard
 5. K.S.S.SESHAN (2018-10-30). "The progressive princess of Hyderabad". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-01-18.
 6. "Nehru had big plans for me, says Mukarram Jah", The Times of India, 14 March 2010, archived from the original on 11 August 2011
 7. Taj Falaknuma Palace, Hyderabad - Opening February 2010, February 2010, archived from the original on 22 March 2010
 8. Natwest Bank account freeze
 9. Costliest divorce in India
 10. "Mukarram Jah, Eighth Nizam of Hyderabad, Passes Away". The Quint. 15 January 2023. Archived from the original on 2023-01-15. Retrieved 2023-01-18.
 11. "Last Nizam to be laid to rest with police honours". The Hindu. 2023-01-17. ISSN 0971-751X. Retrieved 2023-01-18.
 12. Zubrzycki, John (2006), The Last Nizam: An Indian Prince in the Australian Outback, Pan Macmillan Australia Pty, Limited, ISBN 1-4050-3722-9
 13. Guruswamy, Mohan (May 2008). "Books: The Last Nizam by John Zubrzycki. Picador India, Delhi, 2006". City of Hope: a symposium on Hyderabad and its syncretic culture. Retrieved 2023-01-18.
 14. 14.0 14.1 Dalrymple, William (8 December 2007), "The lost world", Guardian
 15. 15.0 15.1 "Turkish Beauty Fights for Justice", The Times of India, 21 March 2006, archived from the original on 20 January 2010
 16. Shrivastava, Namita A (19 March 2006), "Princess diaries", The Times of India
 17. "Nizam lands in $7-lakh soup", The Telegraph, Calcutta, India, 24 March 2006
 18. Leonard, Karen Isaksen (2007), Locating Home: India's Hyderabadis Abroad, Stanford University Press, p. 111, ISBN 978-0-8047-5442-2
 19. Parasher, Paritosh (31 August 2001), "Nizam's descendant faces unpaid wages charge in Aussie court", Indo-Asian News Service
 20. Dalrymple, William (8 December 2007), "The lost world", Guardian
 21. Farida, Syeda (10 February 2005), "I belong to a lot of countries", The Hindu, archived from the original on 6 March 2010, retrieved 2023-01-18
 22. Soszynski, Henry (20 June 2005). "HH Walashan Nawab Mir BEREKET ALI KHAN Mukarram Jah". Ancestry.com. Archived from the original on 23 April 2016. Retrieved 2023-01-18.
 23. 23.0 23.1 Soszynski, Henry (20 June 2005). "HH Walashan Nawab Mir BEREKET ALI KHAN Mukarram Jah". Ancestry.com. Archived from the original on 23 April 2016. Retrieved 2023-01-18.
 24. "Turkish Beauty Fights for Justice", The Times of India, 21 March 2006, archived from the original on 20 January 2010
 25. "Convert Nizam's lands into parks, royal kin urges Telangana CM". The New Indian Express. Retrieved 2023-01-18.
 26. "VII Nizam's grandson moves police against two cousins, two other kin". The Hindu. Special Correspondent. 17 November 2020. ISSN 0971-751X. Retrieved 2023-01-18.{{cite news}}: CS1 maint: others (link)

బయటి లింకులు

[మార్చు]