ముత్తరాజు సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముత్తరాజు సుబ్బారావు
జననంముత్తరాజు సుబ్బారావు
జనవరి 14, 1888
పోతెగుంట, సైదాపురం మండలం నెల్లూరు జిల్లా India ఆంధ్రప్రదేశ్
మరణంసెప్టెంబర్ 17, 1922
నివాస ప్రాంతంఆంధ్రప్రదేశ్
వృత్తినాటక రచయిత
మతంహిందు.

ముత్తరాజు సుబ్బారావు (జనవరి 14, 1888 - సెప్టెంబర్ 17, 1922) సుప్రసిద్ధ నాటక రచయిత. వీరు శ్రీకృష్ణ తులాభారం నాటక రచన ద్వారా ప్రసిద్ధులయ్యారు.[1]

జననం

[మార్చు]

సుబ్బారావు 1888, జనవరి 14న నెల్లూరు జిల్లా రాపూరు సమీపంలోని పోతెగుంట లో జన్మించారు.[2]

విద్యాభ్యాసం - ఉద్యోగం

[మార్చు]

వీరు బి.ఎ. పట్టా పొంది బందరులోని నొబుల్ కళాశాలలో చరిత్రను బోధించే అధ్యాపకులుగా పనిచేశారు.

రచనా ప్రస్థానం

[మార్చు]

వీరి ఇతర రచనలు ఉత్తర రామచరిత్ర, రాజ్యశ్రీ, చంద్రగుప్త. వీటిలో రాజ్యశ్రీ నాటకాన్ని చెన్నపురిలోని సుగుణవిలాస సభవారు ఏర్పరచిన పోటీలకు రాసింది. దానికి స్వర్ణపతకం వీరికి లభించింది. ఇవి కాక బి.ఎ. చదివే విద్యార్థుల కోసం చరిత్ర పుస్తకాలు రచించారు. ముత్తరాజు సుబ్బారావు శ్రీకృష్ణ తులాభారం (నాటకం) కోసం రాసిన పద్యాలను శ్రీకృష్ణ తులాభారం సినిమాలో వావడం జరిగింది.

మరణం

[మార్చు]

సంపాదించిన డబ్బునంతా ధర్మాలు చేసి చివరికి నిరుపేదగా 1922 సెప్టెంబరు 17 తేదీన పరమపదించారు.

మూలాలు

[మార్చు]
  1. సుబ్బారావు, ముత్తరాజు (మ.1922), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, పేజీ. 977.
  2. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.661.